గల్ఫ్ దేశాల్లో ఇలా జరుపుకున్నట్టుగా మనం కూడా గణేశుని దొంగచాటుగా పూజించుకోవాల్సిన రోజు వస్తుందేమో ????
>> Wednesday, September 7, 2011
గల్ఫ్ గణేశా!
ఆర్భాటం తక్కువ.. ఆరాధన ఎక్కువ
సౌదీ అరేబియాలో 9 రోజుల వేడుకలు
వేలంలో దాదాపు రూ.లో పలికిన లంబోదరుడి లడ్డూ
హైదరాబాద్, సెప్టెంబర్ 6 : మనదేశంలో వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా.. అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమెరికా, బ్రిటన్, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్.. ఇలా మన తెలుగువాళ్లు పెద్దఎత్తున స్థిరపడిన చోట్ల చిన్నచిన్న నిబంధనలున్నా బాగానే జరుగుతాయి! మరి ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేసే గల్ఫ్ దేశాల్లో పరిస్థితి? అక్కడ ఉండే మనవాళ్లు ఈ వేడుకలను ఎలా జరుపుకొంటారు? అందుకు స్థానిక ప్రభుత్వాలు సహకరిస్తాయా? గల్ఫ్ దేశాల్లో చవితి ఉత్సవాలు అంగరంగవైభోగంగా కాదుగానీ.. ఉన్నంతలో కనుల పండువగా, అంతే గుట్టుగా జరుగుతాయి.
కారణం.. కఠినమైన ఇస్లామిక్ చట్టాలు. విగ్రహారాధనే నిషిద్ధమైన దేశాలు కాబట్టి బహిరంగ వేడుకలు జరపడం అసాధ్యం. అంచేత ఆర్భాటం లేకుండా ఇళ్లలోనే చిన్నపాటి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. ప్రవాసాంధ్ర కార్మికులు ఎక్కువగా నివసించే లేబర్ క్యాంపుల్లో మాత్రం ఒక రకమైన సామూహిక పూజలు నిర్వహిస్తున్నా వ్యక్తిగతంగా ఇళ్లలో చేసేవారి సంఖ్యే ఎక్కువ. అలాగే.. భారతదేశంలోలాగా ఇక్కడ వేడుకలను తొమ్మిది రోజులపాటు నిర్వహించరు. చవితి మర్నాడు.. మహా అయితే మూడో రోజు గణేశుడికి ఉద్వాసన చెప్పేస్తారు. ఈసారి రంజాన్ సెలవులు కూడా కలిసి రావడంతో గల్ఫ్‌లో తెలుగువారి ఉత్సాహం రెట్టింపైంది.
దుబాయ్‌లో విగ్రహాల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. 'దుబాయ్‌లో.. విగ్రహాల అమ్మకాలు ఇంత రద్దీగా జరుగుతాయంటే ఆశ్చర్యం వేసింది' అని అక్కడ వ్యాపారం చేసే వేణు (కరీంనగర్ జిల్లా) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండగరోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన తెలుగువారు వాటిని శుక్రవారం (సెప్టెంబరు 2) సాయంత్రం జుమేరియాలోని సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు. నిబంధనల కారణంగా.. 'గణపతి బప్పా మోరియా' అని నినాదాలు చేసే అవకాశం లేకపోవడంతో చాలామంది బోటులో ఒడ్డునుంచి దూరంగా సముద్ర జలాల్లోకి వెళ్లి నిమజ్జనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.
గతంలో ఇక్కడ బస్సులో వినాయకుణ్ని ఊరేగించే ప్రయత్నం చేసిన కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు... ఓమాన్‌లోని శివమందిరంలో గురువారం నుంచి శనివారం వరకు కె.వైద్యనాథన్ ఆధ్వర్యంలో చవితి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జె.ఎన్.ఎ.మూర్తి (విశాఖపట్నం వాసి).. 'స్థానికచట్టాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పండుగలు చేసుకోవాల్సి వస్తోంది' అని వ్యాఖ్యానించారు. ఇక సౌదీ అరేబియాలోని దమ్మాం, అల్‌ఖోబర్, జుబేల్, ఖఫ్జీ ప్రాంతాల్లో మాత్రం 9 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. కాకపోతే ఇక్కడా భారీ విగ్రహాలు, ఊరేగింపులు ఉండవు. చిన్న విగ్రహాలతో సరిపెట్టుకోవాల్సిందే.
భారీసైజు విగ్రహాలతో ఉత్సవంగా వెళ్లి నిమజ్జనం చేయడం తమకు అలవాటని, అలాంటిది ఇక్కడ చిన్న విగ్రహానికి పూజ చేసి కుటుంబసభ్యులతో కలిసి గుట్టుగా కార్లో వెళ్లి నిమజ్జనం చేయాల్సి వస్తోందని అల్ ఖోబర్‌లో నివసించే తూర్పుగోదావరి జిల్లా వాసి రాధాకృష్ణ రవి చెప్పారు. అటు బహ్రె యిన్‌లో ఈ ఏడాది తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో సామూహిక వినాయక పూజ జరిగింది. 'స్వదేశంలో చవితి వేడుకలు చూసి 27 ఏళ్లయింది' అని వాపోయారు కాకినాడ వాసి శివకుమార్. కువైట్‌లో ఈసారి గణేశ్ చతుర్థి ఉత్సవాలను స్థానిక తెలుగు లలిత కళా సమితి అత్యంత ఘనంగా గల్ఫ్‌లో ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారెవ రూ నిర్వహించని విధంగా జరిపించింది.
ఖైతాన్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో వినాయకుడిని ప్రతిష్ఠించి పండితుల ఆధ్వర్యంలో పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేశారు. లడ్డూ వేలం ఇక్కడ కూడా జరిగిందండోయ్! ఈసారి వేలంలో లంబోదరుని లడ్డూను కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వ్యాపారవేత్త జీకే స్వామిరాజు 600 దినార్లు (దాదాపు రూ.లక్ష)కు పాడారు. ఒక ప్రముఖ తెలుగు హోటల్ పైభాగంలో కూడా పార్వతీ తనయుణ్ని ప్రతిష్ఠించారు.
ముక్తాయింపు: వ్యాపారాలు చేయడానికో, ఉద్యోగాల కోసమో, ఉదర పోషణ నిమిత్తం ఇక్కడికి వచ్చేవారిలో చాలామంది మనసు మాత్రం ఈ పదిరోజులూ మాతృభూమి చుట్టూనే తిరుగుతుంటుంది. వారిలో చాలామంది ఫోన్‌ద్వారా తమ ఊళ్లో జరిగే లడ్డూ వేలాల్లో పాల్గొంటుంటారు!!
andhrajyothi news 7.9.2011
ఆంధ్రజ్యోతి లో ఈరోజు వచ్చినవార్త ఇది చూశారు కదా! ఈదేశంలో కూడా ధర్మవిరుద్దమైన చర్యలు ఇలాగే కొనసాగితే నిర్విరామంగా ఇలా మతాంతీకరణ జరుగుతుంటే మరో తరం తరువాత మనగతీ ఇంతే కావచ్చునేమో . బహుపరాక్
1 వ్యాఖ్యలు:
నమస్తే దయ చేసి ఈ పాటను వినగలరు
http://rastrachethana.blogspot.com/2011/09/vijayavipanchi.html
Post a Comment