శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భక్త రక్షకుడవని వినీ ! నిను శరణు వేడితి మారుతీ !

>> Friday, April 30, 2010

భక్తులు తమ మనోభీష్టాలను విన్నవించుకుని కడుతున్న నారికేళం ముడుపులు
జైభజరంగబలీ
సాహస మొప్పగనీవు సంజీవిని తెచ్చినావూ !
సంధ్యవేళ హారతి లో
నిన్నుమించిన బంటులేరయ్యా !శ్రీరాములకునూ.......................కీర్తిస్తున్న బ్రహ్మచారులు

భక్తజన సంరక్షణార్ధం హనుమంతులవారిని వేడుకుంటూ సాగుతున్న హనుమత్ రక్షాయాగం మూడో రోజుకు చేరుకుంది. తమ మనోభీష్టములు నెరవేర్చుకోవాలనుకుంటున్న భక్తులు పీచుతీయని కొబ్బరికాయను ఎరుపు లేదా కాషాయవర్ణ వస్త్రం లో ముడుపుకట్టి తమ మనసులో ధర్మబధ్ధమైన కోరికను స్వామికి చెప్పుకుని స్వామి దగ్గరున్న గరుడవర్ధనం చెట్టుకు కడుతున్నారు. ఆతరువాత తమ నివాసంలోనే రోజూ పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణము ,ప్రదక్షిణ ప్రియుడైన హనుమంతునికి నిత్యం ఆలయంలోనో లేక తమ ఇంటివద్ద తులసికోటలో స్వామిచిత్రపటాన్నుంచి గాని ప్రదక్షిణలు చేస్తారు . నలభైరోజులనంతరం వారు ముడుపుకట్టిన నారికేళమును పూర్ణాహుతి సమయంలో యజ్ఞకుండములో సమర్పిస్తాము. ఈ కాలంలో స్వామివారి అనుగ్రహమున సాధకుల ఇచ్చితములు తప్పనిసరిగా నెరవేరుతాయని నమ్మకము . వీరికితోడు లోకకళ్యాణార్ధం బ్రహ్మచారుల సాధన కొనసాగుతున్నది.

పీఠమునకు రాలేనివారు తమ ఇళ్లవద్దనుండే సాధనకు సిద్ధమై ,మాకు తెలియపరచినచో వారితరపున ముడుపును మేము పూజించిస్వామి సన్నిధిలో ఉంచుతాము.
జైహనుమాన్ .

Read more...

గణపతిహోమము తో ప్రారంభమైన హనుమత్ రక్షయాగం

>> Wednesday, April 28, 2010





ఈరోజు గణపతి హోమము నిర్వహించి హనుమత్ రక్షాయాగమునకు శ్రీకారం చుట్టబడినది. నలభైరోజులపాటు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో భక్తజనుల సంరక్షణార్ధం నిర్వహించబడుతున్న ఈ హోమము లో ప్రపంచంలో వివిధప్రాంతములలో నివాసముంటున్న హనుమద్ భక్తులు తమ గోత్రనామాలను పంపి పారాయణములను చేస్తూ పరోక్షంలో కూడా పాల్గొంటున్నారు. హనుమత్ దీక్షతీసుకున్న బ్రహ్మచారులు [చిన్నపిల్లలు] లోకక్షేమంకోసం ఈనలభైరోజులు హనుమాన్ చాలీసా పారాయణం జరుపుతున్నారు. ఈ యాగంలో పాల్గొంటున్నవారు తమ కోరికలను తెలుపుకుంటూ హనుమత్స్వామి సన్నిధిలో కొబ్బరికాయను ముడుపుగా కట్టి చాలీసా మరియు సంపుటీకరణ మంత్రములను జపిస్తున్నారు. స్వామి అనుగ్రహం వారందరిమీద సదా వర్షించాలని కోరుకుంటూన్నాము .

Read more...

ఆహ్వాన పత్రిక

>> Friday, April 23, 2010



స్వామి వారి పరివారసభ్యుడు శ్రీ శర్మvj గారు ఈ ఆహ్వానపత్రిక ను రూపొందించి మిమ్మలనందరినీ ఆహ్వానిస్తున్నారు.

Read more...

ఈసామూహిక యాగాలు,పూజలు అవసరమా ? పదేపదే ఇలా పిలవాలా !

>> Thursday, April 22, 2010

వ్యక్తి సంఘజీవి . ఇక్కడ సమాజం ఎంత శాంతిసౌభాగ్యాలతో విలసిల్లుతుందో దానినాశ్రయిమ్చే వ్యక్తిజీవితం నడుస్తుంది. అది మంచిగాని చెడుగాని ఆచర్యల ప్రభావం ఆ సమాజంలో అందరిపైన పడుతుంది. కనుకనే వ్యక్తిగత పొరపాట్లకంటే సామాజికంగా జరిపే సామూహిక పొరపాట్లు తీవ్రమైన అనర్ధాలను తెస్తాయి .తెస్తున్నాయి కూడా. ఇక భగవంతుని కి వ్యక్తికున్న సంబంధాలు , సామూహికంగా సంఘం లోజరిగే మార్పులపై ఆధారపడిఉండవు. కానీ భగవంతుని వైపు పయనం జరిపే మార్గంలో నడకను ప్రభావితం చెయ్యగలవు. కనుకనే సాధకునికి పైస్థాయిని చేరుకున్నదాకా పరిసరవాతావరణం శుభ్రం గాను,శుభప్రదంగాను ఉండాల్సిన అవసరం ఉంది.
అదీగాక భగవంతుడు పరమకరుణతో ఇచ్చిన ప్రకృతి సంపదను కాపాడుకోవలసిన అవసరం తప్పనిసరి. అలాగే నీతి నియమాలను ,ధర్మాన్ని ,దైవీభావాలను సంరక్షించుకోవాల్సిన అవసరం మానవ మనుగడకు తప్పదు . వీటిని మనం మెరుగుపరచాల్సిన అవసరమేమీ లేదు ఉన్న దానిని ఎలా సృష్టించబడినదో అలానే ఉండనిస్తే చాలు. కానీ మనమలా ఉండమే ! కొంత అహం ,మరికొంత మూఢత్వం , ఇలా అవలక్షణాలు పెరిగేకొద్దీ మన వికృతమైన ఆలోచనలతో ప్రకృతిని ధ్వంసమొనరుస్తూనే ఉన్నాము. మనిషిగా జన్మించి మాహోన్నతంగా ఎదగాల్సిన పయనం వెనుక్కు తిరిగి మృగత్వం వైపుకు మల్లుతున్నది.

సృష్టి సంరక్షణార్ధం పరమాత్మపదేపదే అవతారాలు ధరించి దీనిని సరిదిద్దుకోవటమెలాగో చూపించాడు . ఈ సంరక్షణా కర్తవ్యం మనుషులదేనని బోధించాడు. కనుకనే ఇప్పటివరకు వచ్చిన భగవదవతారాలలో చివరిదైన కృష్ణావతారంలో మానవ కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వచించాడు.పరమాత్మ. ఒకస్త్రీ కి అవమానం జరుగుతుంటే మౌనం వహించిన భీష్మద్రోణ,కర్ణాది మహాపురుషులను సహితం దగ్గరుండి శిక్షింపజేసి ,మనం ధర్మాన్ననుసరింపకపోతే ఏమి జరుగుతుందో,తానేమి చేస్తానో చూపి హెచ్చరించాడు.

ఇక యుగధర్మాన్ననుసరించి ఈ కలియుగాన జిహ్వ,అంగ చాపల్యములతో మనసులను వికారింపజేసి మానవులను పతితులనుచేస్తానని కలిపురుషుడు ప్రతినబూనాడు. ఈర్ష్య ,అసూయ ,కలహాలే అన్నింటా వర్ధిల్లుతున్నాయి. ఎక్కడచూసినా ,ఈ చాపల్యాలతో నిండిపోయి మనమనసులు కలుషితమై క్రమేపీ మానవత్వం మరుగయ్యే స్థితి దాపురించింది. దీనివలన జరుగుతున్న సామూహిక పాపం సామూహికమైన పెనుప్రమాదాలను సృష్టిస్తున్నది.

కనుక మానవుడు తాను ధర్మాన్ననుసరించి బ్రతకటమేకాదు. ధర్మాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యతకూడా ఉంది. ఒకవైపు కలిపురుషుడు ,ఆయన సేన ,కరాళనృత్యం చేస్తూ మానవులలో దివ్యగుణాలను ద్వంసంచేస్తూ ,కేవలం కాముకులుగాను ,భోగలాలసులుగానూ, తయారుచేసేందుకు నస్తిక,భౌతిక, కాముక వాదాలను ప్రచారం చేస్తూ ఉంటే . వీటినుండి కాపాడగల భగవత్ శక్తిని వేడుకుని పిలవగల ధార్మిక ఆచరణలు ,మార్గాలు క్రమేపీ కనుమరుగవనున్నాయి. తల్లడిల్లుతున్న భూదేవి వేదనలు విలయాలను తెస్తున్నాయి.

ఈస్థితి సరిదిద్దాలని మానవునిలో మృగత్వలక్షణాలను పెరగనీయకూడదనే సత్సంకల్పంతో మహాత్ములు ,సిద్ధమండలి భువిన తీవ్ర శ్రమతో ధర్మరక్షణకు పూనుకున్నారు. ఇక భారము వారిదే అని మనం చూస్తూ కూర్చోవటం పాపహేతువు. ఎవరికి వీలైన పద్దతిలో సద్భావనలను, ధర్మవిధులను వారు పాటించాలి ,ప్రచారం చేయాలి. అయితే ఇక్కడ కాచుకుని కూర్చున్న కలిసేన మాయాప్రభావానికి లోనై స్వార్ధపరతతో ఈకార్యక్రమాలు గాడిదప్పితే సాధకునికే కాదు, లోకానికీ కీడే . ఆవిషయంలో జాగ్రత అవసరం. భగవత్ సేవాభావంతో సామూహిక పూజలు,యాగాలు .సత్సంగాలు విస్తరిల్లవలసిన అవసరం ఈసమయంలో అత్యవసరం. ఈపనులు చేపట్టటానికి మహాత్ములే అవసరం లేదు. మనలాంటి మామూలు మనుషులు కూడా అర్హులే.

కనుకనే నాకు చేతైన అవకాశమున్నరీతిలో భగవత్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. నేనునడిచే బాట మహాత్ముల నడకతో బాగా నలిగిన దారి కనుక నేను నడుస్తూ నాతోటివారిని రమ్మని పిలుస్తున్నాను. అయితే ఇక్కడ మాత్రం నేనెవరో .నాస్థాయి ఏమిటో ఒల్లుమరచి మాట్లాడే మానసికదౌర్భల్యానికి లోనవలేదు. నేను నమ్మినది భగవంతున్ని, ఆశ్రయించమని ఎలుగెత్తి చెబుతున్నది ఆయనశక్తినే. అందుకు అవసరమైన సాధనా సామాగ్రి నా అల్పబుద్దినుంచి అతితెలివితో సృష్టించినదికాదు. మహాత్ములు అనుగ్రహం తో లోకానికి ఇచ్చినదిమాత్రమే. ఎవరన్నా ఈబాటలో నడుస్తూ మేలుపొందినా,నాకన్నా ముందుకు సాగినా , అది ఖచ్చితంగా సాధకులభక్తి,పరమాత్మశక్తిమాత్రమే అని ఎప్పుడు చెబుతూనే ఉంటాను. అసలిది చెప్పటానికైనా అర్హత ఉండవద్దా ? అని పెద్దలనవచ్చు. ఎక్కడో చదివాను .రామకృష్ణులు ఒకాయనను ఎందుకయ్యా! అలా ధర్మం గూర్చి ఊరికే మాట్లాడుతుంటావు ?అని. అప్పుడాయన .స్వామీ స్వయంగా నీచమైన దైనా చీపురు శుభ్రపరచగలుగుతుందికదా అని.వివరణ ఇచ్చుకుంటాడు. ఇక్కడ నన్ను నేను అన్వయించుకుంటున్నాను.

ధర్మోరక్షతి రక్షిత: అన్నారు పెద్దలు . కనుక త్రికరణశుద్ధిగా మన మహర్షుల బోధలను నమ్మి ,ఏపూర్వజన్మపుణ్యం తోనే లభించిన భగవత్ సేవను ధర్మబధ్ధమైన నాస్వంత సంపాదనతోనూ, ,భగవదాదేశానుసారంగా కలసివచ్చే మితృలతో కలసి నిర్వహిస్తున్నాను .అది నేను ఎక్కడ పదిమందితో మాట్లాడగలిగితే అక్కడ. ప్రచారం చేస్తున్నాను . ఇదెవరినో ఉద్ధరించడానికి మాత్రం కాదు. నన్నునేను సంస్కరించుకోవడానికి .స్వీయ శ్రేయస్సుకూడా సమాజశ్రేయస్సుతో ముడిపడిఉంది అని నమ్మి.

గత సంవత్సరం ఈసమయంలో నిర్వహించిన" హనుమత్ రక్షాయాగం "లో పాల్గొన్న సాధకుల అనుభవాలు మహాత్ములు ప్రసాదించిన సాధనా సంపత్తి మహిమను ప్రత్యక్షంగా నిరూపించాయి . కాకికి ఒకముద్ద ఆహారం దొరికితే పదికాకులను పిలుచుకుంటుంది .అది దాని సామాజిక జీవనంలో నిబద్దత . మనుషులమైయుండి మనం లబ్దిపొందినమార్గాన్ని పదిమందికి అందజేయటం .అదీ లోకానికంతటకు మేలుచెసేదైనప్పుడు తప్పేమిటీ ?
ఇక దీనిపై వచ్చే కువిమర్శలు , కారుకూతలు వీటన్నింటికి చలించే బలహీనతలేదు కనుక అలాంటివారు అనవసర శ్రమతీసుకొనక పోవటం మంచిది. దానివలన నాప్రయాణ మాగదు కానీ నేనేదన్నా తెలియచేసిన దోషాల ఫలితం మాత్రం పాపమై ఈ కువిమర్శకుల నెత్తికి చుట్టుకుంటుంది. దారినబోయే దరిద్రాన్ని నెత్తికితెచ్చుకోవటం తెలివిగలవారు చేయవలసిన పనికాదనుకుంటాను . మీకుచేతనైన రీతిలో లోకానికి మేలుచేయండి ,కీడుచేయకుండా ఊరకున్నా పరవాలేదు. కానీ ప్రత్యక్షగా నిజమేమిటో తెలియకుండా [తెలుసుకోవాలనికూడా ప్రయత్నించకూండా] పరనిందకు పాల్పడవద్దని మనవి.
.లోకాస్సమస్తా సుఖినోభవంతు.
జైహనుమాన్


Read more...

ఆపద వేళల...

>> Wednesday, April 21, 2010

ఆపద వేళల...
- సి.వేదవతి
మనం సాగిస్తున్న ఈ జీవనయాత్ర ఎంత సుందరమైనదో అంత కష్టతరమైనది. పుట్టిన దగ్గరనుంచీ, ఎన్నెన్ని అనుభవ పరంపరలు! మరింకెన్నెన్ని అనుభూతుల స్పర్శలు! కొన్ని కసుక్కున గుచ్చి బాధించే కసాయి ముళ్లు- మరికొన్ని అప్పుడే రేకలు విచ్చుకొన్న పూలపిల్లలు వచ్చి చల్లగా తాకినప్పటి మృదుల స్పర్శలు!

చల్లదనాన్ని ఆస్వాదించడానికి మనకు ఏ తోడూ లేకపోయినా ఫరవాలేదు. కానీ, ముల్లు గుచ్చుకొన్నప్పటి కరకు బాధ ఉన్నదే- దాన్ని ఓర్చుకోవటం మాత్రం ఒక్కరివల్లా కాదు. ఏ మూలనుంచో ఒక ఆపన్న హస్తం వచ్చి ఆదుకోవాలి! పళ్లబిగువున మనం అనుభవిస్తున్న బాధకు మరేపక్కనుంచో ఒక ఉపశమన మంత్రం వచ్చి మన చెవిలో వినిపించాలి. వచ్చి పడిన కష్టం ఎంతటిదైనా, దాని తీవ్రతను ఎంతో కొంత తగ్గించి మనకు స్వాంతన కూర్చే కారుణ్యమయ హస్తస్పర్శ వచ్చి మనలను చల్లగా తాకాలి.

కష్టసమయంలో మనం ఆశించే ఈ తోడ్పాటు ఏ దిశనుంచి వస్తుంది? మనకు అయిన వాళ్లెవరో వచ్చి మనలను ఆదుకోవాలి. సాధారణంగా వారు మనకు రక్తసంబంధీకులైన బంధువులో, మనకు మానసిక బంధంతో చేరువైన ఆప్తమిత్రులో అయి ఉంటారు. అందుచేత అవసర సమయాల్లో ఆసరా కోసం మనం వారిపైనే ఆధారపడాలని ఆశపడతాం.

వారు ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారన్నదీ అసంభవమైన విషయమే. వారు కూడా మనకుమల్లేనే మానవమాత్రులే. వారికీ మనకు మల్లేనో, ఇంకా ఎక్కువగానో సమస్యలు ఉండి ఉండవచ్చు. అదీ కాక- బంధువులు, మిత్రులు మనకు చేసే సహాయానికి కొన్ని పరిమితులు ఉంటాయి. వారికైనా, ఎల్లవేళలా మనకు సహాయపడటానికి ఉండేది కొద్దిపాటి శక్తి మాత్రమే!

మరి ఎలాగ? స్వశక్తికానీ, భౌతికమైన మరే సహాయ సంపత్తికానీ మనను ఆదుకోలేని దుస్థితి ఏర్పడితే... ఎలాగ మరి?

భయపడవలసిన పనిలేదు. సర్వశక్తిమంతమైన ఆపద్భాంధవ తత్వం ఒకటి సదా మనను వెన్నంటే ఉంటుంది. అది భౌతిక దృష్టికి అందదు కనుక- మనం గుర్తించలేకపోవచ్చు. నమ్మినవారి దృష్టిలో, సర్వవ్యాపకమైన ఆ పరమశక్తి దివ్యరక్షాకవచమై అన్నివేళలా మనలను ఆదుకొంటూనే ఉంటుంది. అది ఒక అపారమైన కారుణ్యతత్వం! ఎక్కడెక్కడ దైన్యం ఉంటుందో, ఎక్కడెక్కడ జ్వలితార్తి రగుల్కొంటూ ఉంటుందో- అక్కడక్కడ చినుకు చినుకై జల్లులాడే కృపావర్షమది!

ఆపత్సమయంలో మనం ఒకసారి స్మరించినా చాలు- కరిగి కరిగి నీరయ్యే నీలమేఘమల్లే మనలను చల్లగా తాకి ఆర్తిని హరింపజేసే ఆ దయామృతాన్ని ఏమని పిలవాలి? ఒక వూరా, ఒక పేరా? ఏ పేరుతో పిలిచినా పలుకక మానదు కదా! ఎక్కడ ఉన్నా- మనం పిలవగానే పరుగుపరుగున రాక మానదు కదా!

మన కంటికి కనుపించదు కానీ- ఆపద వేళలో, ఆకటివేళలో మనకు తోడునీడై నిలుస్తుంది, ఆర్తిహరమైన ఆ పరమాత్మతత్వం... పరమకారుణ్య భగవత్తత్వం!


[ఈనాడు ,నుండి]

Read more...

ధర్మసూక్ష్మాలు

>> Tuesday, April 20, 2010

సమస్త ధర్మాలకు వేదమే ఆధారమని మహర్షులు ప్రబోధించారు. ధర్మమనేది మానవజాతికి వెన్నెముకవంటిది. ధర్మాన్ని విడిచిన మనిషి మనిషిగా జీవించలేడు. ధర్మసూత్రాలతోనే సమాజం వికసిస్తుంది. ఈ మానవ మర్యాదలతోనే సమాజం హద్దుల్లో ఉంటుంది. అందుకే మన పూర్వీకులు మానవ సమాజ సర్వతోముఖ వికాసం, ప్రగతి, అభ్యుదయాల్ని కాంక్షించి ధర్మశాస్త్రాలు రచించి అందించారు. వాటిని పరిశీలించి పాలించడమే మన ధర్మం.

రుషులు త్రికాలజ్ఞులు. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో ఏమి జరుగుతుందో వారికి తెలుసు. అందుకే వారు రచించిన గ్రంథాల ద్వారా సమస్త మానవజాతిని ధర్మమనే మణిహారంలో ముడివేయాలనుకున్నారు. శాస్త్ర ధర్మాలు మనకు బోధించారు. శాస్త్ర నిషిద్ధ కర్మలను చేయకూడదు. వేదం జూదం ఆడవద్దని ఆదేశించింది. దుష్టకార్యాలు చేయవద్దని హెచ్చరించింది. శ్రేయం కలిగించే ధర్మ సూక్ష్మాలు అన్ని కాలాల్లో అందరికీ వర్తిస్తాయి. ఈ ధర్మ జ్ఞానం వేద ప్రతిపాదిత జీవన విధానం వల్ల మనకు కలుగుతుంది.

మనం ఈ లోకంలో అనుభవించే సుఖాలన్నీ భగవంతుడిచ్చినవే. దుఃఖాలన్నీ మనం కోరి తెచ్చుకొన్న పాప ఫలాలే. గృహస్థులు ధర్మబద్ధంగా వస్తువులు సంపాదించుకొని వాటిని త్యాగభావంతో అనుభవించాలి. ఇది నాదికాదనే పరార్థ భావన ఉండాలి. ఇది అందరిదీ అనే విశాల మనస్తత్వం అందరిలో కనిపించాలని వేదమంటుంది.

మనిషి కోరికలకు లొంగిపోకూడదు. విషయసుఖాలు మనిషిని బంధిస్తాయి. అందుకే వివేకవంతుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అందని కోరికలకు ఆశించి భంగపడకూడదు. కోరికలు మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. కోరికలు తగ్గించుకుంటే మనిషి విశ్రాంతిగా ఉంటాడు. దుఃఖానికి కారణం కోరికలేనని బుద్ధుడన్నాడు. అవి తీర్చే కొద్దీ కొత్తవి పుట్టుకొస్తాయి. అందుకే వాటిని అదుపులో ఉంచుకోవాలి. మనస్సు నిగ్రహించుకోవాలి. సంయమనం పాటించాలి. సాధారణ జీవనం సుఖదాయకం. అవసరాలు మనిషిని వేధించి బాధిస్తాయి. అందుకే రుషులు ధర్మాన్ని అతిక్రమించవద్దని పదేపదే హెచ్చరించారు. ధర్మమే ప్రధాన లక్ష్యమని ఉపదేశించారు.

భార్యబిడ్డలు, బంధుబాంధవులు, మనం ప్రేమించిన వస్తువులన్నీ మనల్ని విడిచిపోతాయి కాని- ధర్మం మాత్రం ఎప్పుడూ విడవదు. ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాల్లో మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షాన్ని విడిచి మధ్యలోని అర్థ కామాల వెంట నేటి మనిషి పరుగులు తీస్తున్నాడు. అశాంతికి లోనవుతున్నాడు. బాధ్యతలను విడిచి హక్కుల కోసం ఆరాటపడుతున్నాడు. మన పూర్వులు అందించిన సురక్షిత మార్గాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం అన్వేషిస్తున్నాడు. సహజమైన సుఖశాంతుల్ని విడిచి కృత్రిమమైన ఆనందాలకోసం అర్రులు చాస్తున్నాడు. సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు. జీవనాన్ని భగ్నం చేసుకుంటున్నాడు.

మానవ జన్మ మనకు దివ్యవరంగా లభించింది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. మహా పురుషులను ఆశ్రయించాలి. ఆత్మ పరమాత్మల జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం లేకుండా ముక్తి దొరకదు.

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి [ఈనాడు నుండి]

Read more...

ధ్యానం-సాధనా గానం

>> Monday, April 19, 2010



- [చక్కిలం విజయలక్ష్మి]
ధ్యానం విషయంలో చాలామంది అపోహలో ఉంటారు. కళ్లు మూసుకుని వూరికే కూర్చుని ఉండటమనీ, శూన్యంలోకి గానీ లేదా ఒక వస్తువునుగానీ తదేకంగా చూస్తూ ఉండటమనీ భావిస్తారు. ఇది కొంతవరకు మాత్రమే సరైనది. పూర్తిగా సమర్థించవలసినది కాదు. ఆరోగ్యం వేరు, ఆధ్యాత్మిక విషయం వేరు. పూర్వం రుషులు, విజ్ఞులు ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాలను సమ్మేళించి బోధిస్తూ వచ్చారు. ఎందుకంటే మరీ తీవ్ర తపోధనుల విషయం పక్కనపెడితే- ఆధ్యాత్మిక సాధన యావత్తూ సాధకుడి ఆరోగ్యంతోనే ముడివడి ఉంది. గౌతమ బుద్ధుడు కూడా ఒకానొక సందర్భంలో నిరాహారం వల్ల ఆరోగ్యం సహకరించక ధ్యానం నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఆహారం మన ఆధ్యాత్మికతకు తోడ్పడే స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితి మన ఆహారంగా, ఆరోగ్యంగా మారే దశ వచ్చేవరకు- సాధకుడు ఆరోగ్యానికి ఆధ్యాత్మికత కంటే అధిక ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంది. శరీరం ఖలు ధర్మసాధకం అన్నారు మరి. భగవత్‌ స్పృహ బొత్తిగా లేని వ్యక్తి మౌనంగా, కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ ఉండటమనేది ధ్యానం అనిపించుకోదు. ఆలోచనల తీవ్రత తగ్గి ఆ రీత్యా అలజడి మందగించి, కొంతవరకు మానసిక ప్రశాంతత ఏర్పడవచ్చు. అంతే! ఏ పనైనా అవగాహనతో చేసినప్పుడే పూర్తి ఫలితాలు లభిస్తాయి. ధ్యానం కేవలం ఆరోగ్యం కోసం చేసినట్లయితే... మంచిదే. దానికి హృత్‌-పూర్వక నమస్కారం. కానీ మనం ఆ అంతర్యామి కోసం చేస్తున్నాం. అక్కడికి దారి వేసే ఆధ్యాత్మికత కోసం చేస్తున్నాం. ఆ మౌలిక సూత్రాల ఆధారంగానే మన పయనం సాగాలి. ఆ ధ్యేయ వస్తు జ్ఞానంతోనే మన అన్వేషణ సాగాలి. దీనికంతా ధ్యానం ఒక మార్గం మాత్రమే. గమ్యం తెలిసి ఉండాలి. ఆ గమ్యాన్ని ఎందుకు చేరాలనుకుంటున్నామో ఆ స్పృహ ఉండాలి. అప్పుడు ప్రారంభించాలి ధ్యానం.

ధ్యానం భావనామయ ప్రపంచ వ్యవహారం. మనసు కూడా దాటి మహా శూన్యంలోకి, మహా మౌనంలోకి నిరామయంగా వెళ్లిపోయే అద్భుత దశ. ఈ దశ కేవలం ఆలోచనల మందగింపుతోనో, మళ్లింపుతోనో రాదు. ఆ మహాశూన్యంలోకి మళ్లింపదలచిన మనోపుష్పానికి 'భగవత్‌ స్పృహ' అనే పరిమళం కావాలి. అది లేకపోతే మనసు కాగితం పువ్వే.

నిజమే. అందరికీ అనుకున్నప్పుడే భగవంతుని పట్ల ప్రేమ ఏర్పడదు. ప్రేమించాలనే ఆశ ఉంటుంది. ఆయనను సాధించాలనే తపనా ఉంటుంది. కానీ ఎండమావిలాంటి మనసు భక్తిజల రహితంగా ఉంటుంది. బండరాయిలా ఉంటుంది. దానికి స్పందన కావాలి. ఆర్ద్రత కావాలి. పరమ ప్రేమ అనే అరణి రగలాలి. అప్పుడు... అప్పుడు... హృదయం హోమగుండం అవుతుంది. భగవంతుడనే యజ్ఞఫలం కోసం యజ్ఞం ప్రారంభమవుతుంది. అందుకు గురువనే రుత్విక్కును అన్వేషించాలి. భగవంతుని పొందాలనే తపన మనలో నిజాయతీగా అంకురించినప్పుడు గురువే మనను వెతుక్కుంటూ వస్తాడు. లేదా మనం తన దగ్గరకు వెళ్లేలా చేస్తాడు. జీవాత్మ పరమాత్మల సంయోగానికి సుముహూర్తం కుదిరిపోతుంది. గురువు మనలో మంత్రోపదేశంతో ఆధ్యాత్మిక బీజాలు నాటుతాడు. సాధనా బలంతో దాన్ని పెంచి పోషించుకుని ఫలాలనందుకోవాలి. ఈ పూర్తి యజ్ఞంలో మన తను ధన ప్రాణాలు గురువుకే అంకితం చేయాలి. అప్పుడు ఆయన చూపే మార్గమే ధ్యానసాధన.

అందుకే... భగవంతుని పట్ల ప్రేమ, పూర్ణ అవగాహన పెంచుకునే ప్రయత్నానికి నాందిగా గురువును ఆశ్రయిద్దాం. ఆయన ఆశీస్సులు పొందుదాం!

Read more...

మార్గసిద్ధి



[కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌]
ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కొందరు ఏ మార్గంలో పయనించాలో తేల్చుకోలేక సందిగ్ధావస్థలో పడి సతమతమవుతుంటారు. చాలామంది ఎలాంటి శారీరక శ్రమాలేకుండా, సాధ్యమైనంత సుఖంగా తమ ఆధ్యాత్మిక ప్రయాణం సాగాలని కోరుకుంటుంటారు. ఫలితాలు, ప్రయోజనాలు ఘనంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. మధుమేహ రోగులు తీపిని తింటూనే రోగం తమను బాధించకూడదనుకుంటే- అది ఎలా సాధ్యం?

సిద్ధధ్వజుడనే మహర్షికి మూడు ఆశ్రమాలుండేవి. ఒక్కొక్క ఆశ్రమంలో నాలుగు నెలలు చొప్పున ఉంటూ, శిష్యులకు జ్ఞానబోధ చేస్తుండేవాడు. సిద్ధధ్వజుడు ఆశ్రమంలో ఉండని కాలంలో శిష్యులు తపస్సులో నిమగ్నమై ఉండేవారు. ఆశ్రమానికి తిరిగి రాగానే వివిధ ప్రశ్నలతో శిష్యుల పురోగతిని అంచనా వేసేవాడు. పరిపూర్ణత సాధించిన వారిని ఆయన ఆశీర్వదించి, ఇతర ప్రాంతాల్లో ఉన్న తపోభూముల్ని సందర్శించాక, చివరిగా హిమాలయాలకు వెళ్లమనే వాడు. విచిత్రం ఏమిటంటే- అలా హిమాలయాలకు వెళ్లినవారికి సిద్ధధ్వజుడు ఒక మంచుగుహలో కనిపించేవాడు. ఆ గుహ రాత్రింబగళ్లు వెచ్చగా ఉండటమే గాక, వెన్నెల వెలుగు లాంటి దివ్యకాంతితో నిండి ఉండేది. సిద్ధధ్వజుడు మౌనముద్రలో ఉండేవాడు. ఆయన విశాల నేత్రాలు శాంతి నక్షత్రాల్లా మెరుస్తుండేవి. శిష్యులు విస్మయంలో తలమునకలవుతూ ఆయనముందు భక్తిప్రపత్తులతో సాష్టాంగపడేవారు. ఆయన మందహాసంతో చేయెత్తి ఆశీర్వదించేవాడు.

వారిని మౌనంగా కూర్చుని ధ్యానం చేయమని సౌంజ్ఞలతో ఆదేశించేవాడు. అలా ధ్యానంలో కూర్చున్న శిష్యులకు క్షణాల్లో ఆత్మసాక్షాత్కారం లభించేది. అలా ఎంతసేపు గడిపారో కూడా తెలిసేది కాదు. కళ్లుతెరిచి చూస్తే సిద్ధధ్వజుడు ఉండాల్సిన చోట కాంతిపుంజం ఉండేది. ఆయన కనిపించేవాడు కాదు. ఆ కాంతిపుంజమే ఆయన ఆత్మస్వరూపంగా భావించి, నమస్కరించి మెల్లగా నిష్క్రమించేవారు శిష్యులు. ఒకసారి అలావచ్చిన శిష్యుల్లో ఆత్మానందుడనేవాడు తిరిగి వెళ్లటానికి ఇష్టపడక అక్కడే ఉండిపోయాడు. మిగతావాళ్లు వెళ్లిపోయారు. సిద్ధధ్వజుడు కనిపించకపోయినా, ఆయన ఉన్నట్టుగానే భావించి ఆత్మానందుడు ఆ గుహలోనే కాలక్షేపం చేస్తూ అధిక సమయం ధ్యానంలో గడపసాగాడు. ఒకరోజు భయంకరమైన మంచు తుపాను వచ్చి గుహబయట వాతావరణం క్షణంలో మారిపోయింది. గుహలోకి రెండు మంచు ఎలుగుబంట్లు పరుగున వచ్చాయి. అవి మనిషిని మించిన ఎత్తున్నాయి. మొదట భయపడినా తరవాత ఆత్మానందుడు నిబ్బరంగా ధ్యానంలో కూర్చున్నాడు. అవి రెండూ సమీపానికి వచ్చి, వాసన చూస్తూ మీదకు వెచ్చని శ్వాస వదిలినా ఆత్మానందుడు చలించలేదు. మరికాస్సేపటికి అవి రెండూ వెళ్లిపోయాయి. అవి వెళ్లిన కాస్సేపటికి ఒక గిరిజన యువతి భయభయంగా లోపలికి వచ్చింది. ఆమె గంపలో పర్వతప్రాంతాల్లో లభించే మధుర ఫలాలున్నాయి. వస్తూనే ఆమె కొన్ని ఫలాలను అతడికిచ్చింది. ఆత్మానందుడు వాటిని తిరస్కరించాడు. ఆమె అనేక విధాలుగా అతణ్ని కామ వికారానికి లోనుచేసేందుకు ప్రయత్నించి విఫలురాలైంది. చివరకు రుసరుసలాడుతూ బైటికి వెళ్లిపోయింది. అంతలో సిద్ధధ్వజుడు లోపలికి వచ్చాడు. ఆత్మానందుడు వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు.

'ఆత్మానందా! ఆధ్యాత్మిక మార్గమంతా కఠిన పరీక్షలతో నిండి ఉంటుంది. చివరి పరీక్షలకు నిలవగలిగావు. నువ్విప్పుడు నాతో సమానుడవైనావు. అంటే- నువ్వు నాలాగా ఎందరికో మార్గదర్శనం చేయాల్సిన కర్తవ్యం ఉంది. అప్పుడే నువ్వు మార్గసిద్ధుడివవుతావు. వెళ్లు. ప్రపంచంలో ఎందరో మార్గజ్ఞానశూన్యులై బాధపడుతున్నారు. నిస్వార్థంగా వారికి సహాయపడు' అని ఆదేశించాడు సిద్ధధ్వజుడు.

ఆత్మానందుడు గురువు ఆజ్ఞ పాటించి జిజ్ఞాసువులెందరికో మార్గదర్శనం చేశాడు. వారి ఆధ్యాత్మిక ప్రగతికి అనేక విధాలుగా సహాయపడ్డాడు. ప్రలోభాలకు లోబడని వారంతా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించారు. తద్వారా మార్గసిద్ధి అనే ఆత్మానందాన్ని పొందగలిగారు. ఆ విధంగా సిద్ధధ్వజుడి ఆకాంక్ష నెరవేరింది. ఆత్మానందుడు మార్గసిద్ధుడైనాడు.



Read more...

భక్తి బాంధవ్యం

>> Sunday, April 18, 2010

భక్తి బాంధవ్యం
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
సృష్టిలోని ప్రాణులన్నింటిలో అనుబంధ బాంధవ్యాలు సహజమే. మానవజాతి మధ్యగల అనుబంధాలు-బాంధవ్యాలు ఒక విలక్షణతను సంతరించుకుంటాయి. కోతులు, ఏనుగులు, చీమలు, గోవులు- అన్నీ తమ తమ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాయి. పుట్టిన బిడ్డలకి కొంతకాలం పాలిచ్చి, పోషించి వదిలేస్తాయి. మానవులు అలాకాదు- కుటుంబాలుంటాయి. కుటుంబసభ్యులుంటారు. తల్లి-తండ్రి, అన్న-తమ్ముడు, అక్క, చెల్లెలు, భార్య, భర్త, బిడ్డలు... ఇలా ఎన్నెన్నో వావివరసలు ఏర్పరచుకుని అనుబంధాన్ని పెంచుకుంటారు. తత్ఫలితంగా కుటుంబం శక్తిమంతమవుతుంది. ఎవరైనా ఈర్ష్యాద్వేషాలతో తమమీద దాడిచేసినా, దూషించినా కుటుంబం కుటుంబమంతా ఏకపక్షంగా నిలిచి వాళ్లని తిప్పికొడుతుంది. అటువంటి కుటుంబంమీద ఏ దుర్జనుల కుదృష్టీ పడదు.

సమాజంలోని ప్రతి కుటుంబానికీ ఈ మంచి లక్షణం అవసరం. ఈ సత్సంప్రదాయం సమాజంలో పరివ్యాప్తం కావాలంటే కుటుంబసభ్యులంతా చేయవలసిందేమిటి? వారి బాధ్యతలెలా ఉండాలి? చెప్పుకోవడానికిది చాలా సులభంగా కనిపించినా, ఆచరించడానికి చాలా కష్టతరమైన పని. ప్రధానంగా కుటుంబసభ్యుల్లో పరస్పరం ప్రేమాభిమానాలను సర్వదా పెంచుకుంటూనే ఉండాలి. ఒకరిపట్ల ఒకరికిగల బాధ్యతల్ని గుర్తెరగాలి. వాటిని నిర్వర్తించడంలో ఏ క్షణమూ సందేహించకూడదు. నిజానికి ఈ సంస్కారం అంతతేలికగా అబ్బదు. ఇది విజ్ఞులనీ, గురువులనీ విని, చూసి అనుకరించవలసిఉంటుంది. మంచి పుస్తకాలను అధ్యయనం చేయాలి. విషయాలన్నీ ఆకళింపు చేసుకోవాలి. మంచిని కనాలి, మంచిని వినాలి, మంచిని ఆచరించాలి. ఈ మూడు లక్షణాలను ఒంటబట్టించుకుంటే మానవుడు సమాజంలో ప్రతి ఒక్కరిపట్లా తన వంతుగా వ్యవహరించే విధానాన్ని అనుసరించగలడు. శాశ్వతమైన సుఖశాంతులనిచ్చే అనుబంధ-బాంధవ్యాలను మనమందుకోవలసి ఉంది. అవి పారలౌకిక, పారమార్ధిక, బాంధవ్యాలు.

ఈ బాంధవ్యానికి సంపదతో, ఆస్తితో, ఐహిక సౌఖ్యాలతో, తాత్కాలిక ఆనందాలతో ఎంతమాత్రమూ సంబంధంలేదు. పదవులతో, హోదాలతో, అధికారాలతో, భేషజాలతో సంబంధంలేదు. అన్ని బాంధవ్యాలకంటే ఈ బాంధవ్యం అత్యున్నతమైనది. అతీతమైనది. మహిమాన్వితమైనది. అదే భక్తిబాంధవ్యం. ఇది తెలుసుకుని ఆచరించిన మహనీయులు శాస్త్ర, పురాణేతిహాసాలలో ప్రతి పుటలోను దర్శనమిస్తారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నారదుడు, హనుమ, విదురుడు, రుక్మిణి, శబరి, పోతన, సుదామ, గోపన్న, త్యాగయ్య, మీరా, కబీరు, తులసీదాసు మొదలైన మహామహులెందరో మహోత్తమమైన భక్తితోనే పవిత్రమైన బాంధవ్యాన్ని పటిష్ఠం చేసుకొని జన్మకు సార్ధకత కల్పించుకున్నారు. తమ వ్యక్తిత్వాన్ని భక్తిభావరసంలో రంగరించి చరితార్ధత చేకూర్చుకున్నారు. ఈ సృష్టిలో చెడని పదార్థం భక్తి ఒక్కటే, చెడనివాడు భక్తుడొక్కడే! పరమేశ్వరుడొక్కడే. ఎందరు దేవుళ్లను ఏ పేర్లతో స్తుతించినా అన్నీ ఆయనకే చేరుతాయి. అటువంటి శ్రేష్ఠతమైన భక్తిని పొందడంలో సనాతన ధర్మం సంపూర్ణంగా సహకరిస్తుంది.

సనాతన ధర్మం అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. భక్తిప్రాప్తికి సనాతనం సాధనం. సనాతనుడు ప్రతిష్ఠించిన ధర్మం కనుక సనాతనమైంది. దేవుడు దగ్గరవాలంటే ఆయన దారిలో నడవాలి. భక్తికెంత శక్తి ఉన్నదో, భక్తి బాంధవ్యానికెంతటి ఫలితమున్నదో ఈ కథ చెబుతుంది మనకు. ఒక పండితుడు కష్టపడి, సత్సంగం చేసి శాస్త్ర పురాణాలు చదువుకున్నాడు. తాను నేర్చుకున్నదాన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రవచన రూపంలో భక్తులకు బోధించేవాడు. అలా మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. ఎన్నో గ్రంథాలు రూపొందించాడు. అవి ముద్రించేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు. అకస్మాత్తుగా ఆ పండితుడోరోజున స్వర్గస్తుడయ్యాడు. ఆయనకిద్దరు పుత్రులు, ఒక కూతురు. ఇంట్లో వున్న కాస్త వెండి బంగారాన్ని ఆ మరునాడే కూతురు తీసుకువెళ్లిపోయింది. పెద్దకుమారుడు పండితుడు కట్టుకున్న గృహాన్ని ఆక్రమించుకొని 'తమ్మూడూ! నీవు భక్తుడివి కదా! నాన్నగారు రాసిన లిఖిత ప్రతులన్నీ తీసుకో. ఈ ఇంటిని నేనట్టే పెట్టుకుంటాను' అని ఆ కాగితాలన్నీ తమ్ముడికిచ్చి బైటికి వెళ్లగొట్టాడు.

ఇంతలో అక్కడికి పండితుడి భక్తులు, శిష్యులు తండోపతండాలుగా చేరి తమ్ముణ్ని ఓదార్చారు. 'నాయనా! మీ నాన్నగారు తన అద్భుతమైన ప్రవచన ప్రబోధతో మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. కృతజ్ఞతగా ఆయన రచించిన ఈ గ్రంథాలన్నింటినీ మా సొంత ఖర్చులతో ప్రచురించి, విక్రయించి, వచ్చిన సొమ్ముతో మీ జీవనోపాధికి అవరోధం కలగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా గ్రంథ విక్రయం మీద లక్షలకు లక్షలు ద్రవ్యం సమకూరింది. ఇదంతా తండ్రి భక్తిప్రపూరిత ప్రసంగాల ఫలితమేనని గ్రహించిన తమ్ముడెంతో సంతోషించి, పరమభక్తుడై గ్రంథాలన్నీ అధ్యయనం చేసి తానూ గొప్ప పౌరాణిక ప్రాసంగికుడిగా అఖండకీర్తిని ఆర్జించాడు. భక్తిని నమ్ముకున్న భాగవతుడికి భగవంతుడితో ఏర్పడే బాంధవ్యం, సాన్నిహిత్యం అసమానవైనవని సుగ్రాహ్యమవుతోంది. భక్తి బాంధవ్యం వల్లనే మానవ కల్యాణం, అఖిల విశ్వకల్యాణం సుసాధ్యమవుతాయి.

[ఈనాడు నుండి]




Read more...

హనుమంతుని జన్మస్థల మెక్కడ ?

>> Saturday, April 17, 2010


శ్రీరామపాదసేవకుడు ,భక్తరక్షకుడైన హనుమంతులవారి జన్మస్థలం గూర్చి తెలుసుకుందాం . స్వామి తిరుమల కొండలపైన పుట్టాడు. అంజనాదేవి తపస్సుచేసి హనుమంతుని కనుటవలనే అది అంజనాద్రి గా పిలవబడుతున్నది. పురాణ ప్రమాణాలతో పరిశోధించి ఈవిషయం నిరూపించారు పరిశోధకులు . ఆప్రాంతంలోనే జాబాలి మహర్షి తపస్సుచేసి స్వామి బాల్యరూప దర్శనం కోరగా స్వామి "స్వయంభూ"గావెలసాడు ఈచోట . చుట్టూ ఎత్తైనకొండలతో నింగినంటే వృక్షాలతో ,కొండవాగులతో ప్రకృతి రమణీయమై అలరారే ఈక్షేత్రం తప్పనిసరిగా దర్శించవలసినది.
వరాహ స్వామి ఆలయానికి వాయువ్యంగా అడవి బాటలో వెళ్లవచ్చు .లేదా పాపనాశనం వెళ్ళేదారిలో జాపాలిక్షేత్రానికి దారి చూపే బోర్డ్ ఉంటుంది .అక్కడదిగి ఒక కిలోమీటర్ నడచి జాపాలి క్షేత్రం చేరుకోవచ్చు. దారిపొడవునా జనం ఉంటారుకనుక ఎవరూ భయపడనవసరం లేదు. తిరుమల వెళ్ళే యాత్రికులంతా తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడ క్షేత్రనిర్వహణ మొత్తం హాతీరాంబావాజీ మఠం వాళ్లది.అర్చనాదికాలు ఉత్తరభారత సాంప్రదాయరీతిలో ఉంటాయి.

స్వామి ఇక్కడేజన్మించారని చెప్పటానికి మరొక ఆధారం ఉంది. శ్రీవారి ఆలయానికి కెదురుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. అక్కడ హనుమంతుని చేతులకు బేడీలు వేసి నట్లుగా అలంకరణ చేస్తారు. అంజనీదేవి జప,ధ్యానాదులుచేసుకునేప్పడు బాలహనుమంతుడు పర్వతాలు ,అరణ్యాలు గెంతులువేస్తూ చుట్టివస్తూ దూరంవెళ్లిపోతుండటంవలన, మరలా ఆయననను వెతుక్కోవటం ఆతల్లికి భారమైపోతుండేది. అందుకే ఇలా ఆయనను కట్టివేసి ఉంచేదని చెబుతారు .దానిమూలంగానే స్వామివారికి బేడి ఆంజనేయస్వామి అనిపేరు వచ్చింది.

Read more...

నిజం తెలుసుకో ..............

>> Friday, April 16, 2010

వందకోట్లకు అధిపతివైనా _ ఒక్క నిముషం ఆయుష్షు కొనలేవని తెలుసుకో

కోటికోట్లకు వారసుడవైనా _ ఊపిరిపోగానే ఊరిబయట పారవేస్తారని తెలుసుకో

లక్షాధికారివైనా భిక్షాధికారివైనా _ స్మశానం లో ఇద్దరూ సమానమేనని తెలుసుకో

వందమంది డాక్టర్లు నీవెంటనున్నా _ నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో

ప్రపంచానికంతా అధిపతి వైననూ _ నీ ఆయుష్షుకు అధిపతివి కాలేవని తెలుసుకో

యావత్ ప్రపంచాన్ని జయించగలిగననూ _ మృత్యువును జయించలేవని తెలుసుకో

కాలం విలువైనది,రేపు అను దానికి రూపులేదు_మంచిపనులు వాయిదావేయరాదని తెలుసుకో

నీవు తిన్నది మట్టిపాలు _ ఇతరులకిచ్చినదే నీపాలని తెలుసుకో

నీవుదాచుకున్నది జారిపోతుంది _ ఇతరులకిచ్చి సహకరించినదే నీ ఖాతాలో జమవుతుందని తెలుసుకో

భోగాలకు ఖర్చు చెసి రోగాలు తెచ్చుకోక_ మంచిపనులకు ఖర్చుచేసి పుణ్యాన్ని పెంచుకో

ఆ పుణ్యమే నీరాతను నిర్ణయిస్తుందనే నిజం తెలుసుకో .

[ ఆథ్యాత్మిక గ్రంథాలనుండి]





Read more...

మాస్టర్ ఇ.కె. మధుర వాక్కులు

>> Thursday, April 15, 2010



రోజులు బాగుండలేదు అంటారు. కాలం మారిపోయింది అంటారు. ఇవి ఇదివరకటి రోజులు కావు అంటారు. కొంచెం నిదానించి చూడండి. మారింది ఎవరు ? రోజులా , మనమా ? .రోజులన్నీ అలానే అన్ని గంటలే గడుస్తున్నాయి. మన మనస్తత్వాల్లోనే మార్పు వస్తున్నది. కాలాన్ని నిందించటం బాగున్నదా ? . మార్పులు వస్తున్నాయి ,ఆహ్వానించు. ఆమార్పులలో మంచివాటిని స్వీకరించు . గతమన్నది గౌరవించు .ఆ గతమందించిన మంచి విషయాలను జారవిడుచుకోకు.లోకం పోకడబట్టి మనమూ పోవాలిగదా ! అని నీవనవచ్చు. మన పోకడే సరైదని ఋజువైతే లోకమే మనవెంట వస్తుంది.

ఎవరికైనా మంత్ర ముపదేశిస్తే " ఎన్ని రోజులు చేయాలండీ "[అంటే ఎప్పుడు మానేయాలండీ] అని అడుగుతారు .ప్రేయరు చేసుకోరా నాయనా అంటే "ఎన్నో సంవత్సరాలనుండి చేస్తున్నాను [ఇకనేనుచేయకపోయినా పరవాలేదు]అని అంటారు.................................................................................

Read more...

హనుమత్ రక్షాయాగం [రెండవ ఆవృతి] మొదలవనుంది .మీగోత్రనామాలుపంపి పాల్గొనండి

>> Wednesday, April 14, 2010


హనుమత్ రక్షాయాగం 2010 {ఆథ్యాత్మిక ప్రయోగం}

ది .28-4-2010 నుండి 7-6-2010 వరకు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో నిర్వహించబడుతున్నది.


ఎలా పాల్గొనాలి. ?
----------------

*ముందుగా మీగోత్రనామాలను పీఠానికి పంపించాలి .

*మీరు 7-6-2010 [హనుమజ్జయంతి] నాటికి 40 [వీలుకుదరనివారు] 21 రోజులు సాధన జరిగేలా చూసుకోవాలి.
స్త్రీలు {తమకు ఇబ్బందైన} ఐదు రోజులు వదలి కూడా నలభైరోజులు సాధనచేయాలి.

*మీరుగోత్రనామాలు తెలుపగనే మీ పేరున ఒక కొబ్బరికాయను పీఠంలో ముడుపుకట్టటం జరుగుతుంది
దానిని పూర్ణాహుతి సమయంలో సమర్పించటం జరుగుతుంది{ ఇందుకయ్యే సుమారు ఇరవైరూపాయలుఖర్చు మీస్వంతంగానే వెచ్చించాలి]

*ఇక మీరు మంచి రోజు చూసుకుని మీరు ఎందుకు ఈపారాయణం చేయాలనుకుంటున్నారో స్వామిచిత్రపటం ముందుకూర్చుని సంకల్పంగా చెప్పుకోవాలి.

*ఉదయాన్నే స్వామికి స్వల్పంగానైనా పూజ ,ఒక పండు నివేదించాలి.

*ఆలయం లోకాని ,వీలుగానివాళ్ళు,ఇంట్లో నే తులసికోటలోనో లేక శుద్ధిపరచిన ఆసనం మీదనో స్వామి వారి చిత్రాన్నుంచి మీసంకల్పానుసారంగా 21,54,108 ఇలా ప్రదక్షినలుచేయాలి. అయితే మొదలుపెట్టిన రోజు నుండి చివరవరకు ఒకే సంఖ్యలో చేయాలి.

*హనుమాన్ చాలీసా రోజుకు 11 సార్లు పారాయణం చేయాలి. ఉదయం అల్పాహారానికి ముందుగానే.

*మీ ఇష్ట కార్యం సిద్దించుటకుగాను క్రింద ఇస్తున్న సంపుటీకరణ మంత్రాలలో మీకు సంకల్పానికి సంబంధించిన మంత్రాన్ని ఎన్నుకుని దానిని అన్ని వేళలా అంటే ప్రయాణం లోను ,మీస్వంత పనులు చూసుకుంటూ కూడా ఎక్కువసార్లు జపిస్తుండాలి.

*ఇక మద్యం మాంసం ఈసాధనాకాలంలో నిషేధం .అధర్మప్రవర్తన మీ సాధనకు ఆటంకం.
[బ్రహ్మచర్యం ,నేలపడక,ఆహారనియమం సమస్యతీవ్రతను బట్టి మీరు నిర్ణయించు కోవలసినది]. మన నియమాలు మనసాధనను తీవ్రం చేసి ఫలితాలు శీఘ్రంగావచ్చేట్లు సహాయపడతాయి.

*ప్రతిశనివారం దగ్గరలోగల ఆంజనేయస్వామి మూర్తిని దర్శించి నమస్కరించుకోండి.

*వీలైనవారు స్వామి కి ఆకుపూజ జరపండి.

*ఈకాలంలో అనవసరంగా వివాదాలు ఆవేశాలు తగవు.ఆవేశపడి మీరు ఇతరులని నిందించటం వలన మీ సాధనాశక్తి తరగిపోతుందికనుక సంయమనం వహించి మౌనంగా అక్కడ నుండి వైదొలగండి .

సంపుటీకరణ మంత్రములు .
------------------------

శ్రీరామ


శ్రీమహాగణపతయేనమ: శ్రీ సరస్వత్యై నమ: శ్రీ గురుభ్యోన్నమ:

భక్తితో 41 రోజులపాటు చాలీసా రోజుకు 11సార్లు పఠిస్తూ మీ కార్యసిద్దికవసరమైన ఈక్రింది దోహాను పదేపదే స్మరించుట ద్వారా మీ అభీష్టం శీఘ్రంగా సాధించుకోగలుగుతారు .ఇది సిద్ధయోగం.


గుర్వనుగ్రహప్రాప్తికి // జైజైజై హనుమాన గోసాయి / కృపాకరో గురుదేవకినాయి //

విద్యా,బుద్ధిశక్తికి // బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవనకుమార్//
// బలబుద్ధి విద్యాదేహు మొహి హరహుకలేశవికార్//

రామ దర్శనమునకు // రామ దుఆరే తుమ రఖవారే /హో తవ ఆజ్ఞ బినుపైఠారే //

ఉద్యోగము,[పదవి] ప్రాప్తికి : // తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా / రామమిలాయ రాజ పదదీన్హా /
/ //తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వరభయె సబజగజానా //


వ్యాధి నివారణకు : // నాసైరోగ హరై సబపీరా // జపత నిరంతర హనుమత వీరా //
[ సంజీవ పర్వతోద్దారక _మనోదు:ఖనివారయ ,ప్రసీదమహాబాహో త్రాయస్వ హరిసత్తమ]

విష దోషనివారణకు : // లాయ సంజీవన లఖన జియాయే /శ్రీ రఘువీర హరఖి ఉరలాయే//

కష్ట సాధ్యమైన కార్యసాధనకు // దుర్గమ కాజ జగతకేజేతే /సుగమ అనుగ్రహ తుమహరె తేతే //

[ అసాధ్య సాధక స్వామిన్ .అసాధ్యం తవకింవద .రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో]


సంకటముల నివారణకు // సంకట హటై మిటై సబపీరా / జపత నిరంతర హనుమత వీరా //

లక్ష్మీఅనుగ్రహమునకు // అష్ట సిద్ధి నవనిధికేదాత / అసవర దీన్హజానకిమాతా //


సంతానప్రాప్తికి //రామదూత అతులిత బలధామా అంజనిపుత్ర పవనసుతనామా//
[ అంజనాసుత దేవేశ కేసరీ ప్రియనందన ,దేహి మే తనయం శీఘ్రం సర్వభాగ్య నిధిం ప్రభో ]


శతృబాధానివారణకు
: [మర్కటేశ మహోత్సాహ సర్వ శోక నివారణ ,శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో .]
దుష్ట గ్రహ బాధానివారణకు // భూతపిశాచ నికటనహి ఆవై ,మహావీర జబనామ సునావై //

మోక్షసాధనకు : //తుమ్హరె భజన రామ కోభావై ,జన్మ జన్మకే దు:ఖబిసరావై .//

సర్వానుగ్రహ ధ్యానం :

//బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్.//
[ఆయు: ప్రజ్ఞా యశోలక్ష్మీ: శ్రద్ధాపుత్రా: సుశీలతా .,ఆరోగ్యం దేహిసౌఖ్యం చ కపినాథ నమోస్తుతే ]

[ఒకే ఆసనంలో కూర్చుని 108 సార్లు చాలీసా పారాయణం చేయటం విశేష ఫలప్రదం]


------------------------------------------------------------------------------------

ఇలాచేసిన సాధనతో క్రితం సంవత్సరం అనేకమంది సాధకులు తమ సమస్యలను తాము పరిష్కరించుకుని స్వామి అనుగ్రహశక్తిని చవిచూశారు. ఈసాధనకు గురువు,దైవము హనుమంతులవారే.మేము కూడా మీలాగే ఆయన. పరివారం మాత్రమే . స్వామి పై నమ్మకముంచి ఆయననాశ్రయించి సాధమచేస్తే మీరు తప్పనిసరిగా మీసంకల్పాన్ని నెరవేర్చుకుంటారు .అది ఆయన శక్తి , మీభక్తి.

ఈకార్యక్రమాన్ని సామూహికంగా ఆలయా లలో గాని సాధకుల గృహాలలోగాని జరుపుకోవచ్చు. 27 మంది ఒక్కచోట కూర్చుని చేసే సాధన అద్భుతఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతారు. ఆవిధంగా చేసిన ప్రదేశం లో శక్తిపాతం మహాప్రవాహంగా ఉంటుందని సిద్ధసాధకుల అనుభవం.


సంప్రదించవలసిన చోటు

durgeswara@gmail.com
cell 9948235641

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం . రవ్వవరం




Read more...

దత్త కిరణాలు

>> Monday, April 12, 2010

దత్తప్రభువు
శ్రీపాదశ్రీవల్లభులు
శ్రీనృసింహసరస్వతీ స్వామివారు
శ్రీ మాణిక్యప్రభు
శ్రీ స్వామి సమర్ధ [అక్కోల్కోట్ మహరాజ్]
శ్రీ సమర్ధసద్గురు సాయినాథులు

గురుపాదుకలు
శ్రీవాసుదేవానంద సరస్వతి
శ్రీ గజానన్ మహరాజ్
శ్రీతాజుద్దీన్ బాబా
శ్రీ గులాబ్ బాబా


Read more...

అపార ఐశ్వర్యమున్నా, కోరినతిండి కడుపునిండా తినలేకపోవుటకు కారణమేమిటి?

>> Saturday, April 10, 2010

సత్పురుషులకు భోజనం పెట్టుటవలన సాధకునకు ఆయుర్ధాయం లభించును. అనగా సాధకునకు మరికొన్నిసంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతే కాకుండా వారు సంతుష్టులయినప్పుడు శాంతి,పుష్టి,తుష్టి, ఐశ్వర్యము మొదలయిన వాటికి సంబంధించిన భోగ,యోగస్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును .,కాలాంతరములో అవ్యక్తమునందలి బీజములు వ్యక్తిస్థితిలో అంకురములై ,మహా వృక్షములై విరాజిల్లుచున్నవి. ద్రౌపది మాతనుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించి న శ్రీకృష్ణపరమాత్మ దుర్వాస మహర్షికిని అతని పదివేలమంది శిష్యులకును కడుపునిండా భోజనము అనుగ్రహించాడు.

ఒకసారి శ్రీకృష్ణులవారు సుధాముడు దర్భలకోసం అడవికి పోయిరి .అలసిపోయిన కారణమున సుధాముని ఒడిలో తల ఉంచి స్వామి నిదురించాడు.శ్రీకృష్ణునకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమమునుంచి తెచ్చుకున్న అటుకులను తినుచుండెను . కపట నిద్ర నటిస్తున్న స్వామి ,సుధామా! ఆకలగుచున్నది ,ఇంటివద్ద నుంచి వచ్చునప్పుడు గురుపత్ని ఏమైనా తినుటకు ఇచ్చినదా ? అని అడిగాడు. లేదు ! అని సుధాముడు బదులిచ్చాడు. నువ్వేదో నములుతున్నట్లున్నదే అన్నాడు ఆలీలామానుష విగ్రహుడు. నేను విష్ణుసహస్రనామములను చదువుచున్నాను అని సుధాముడు కప్పిపుచ్చుకున్నాడు. అవునా ! వచ్చునప్పుడు మనకు తినుటకని గురుపత్ని అటుకులను నీకు ఇచ్చిపంపినట్లు ,అవి నీవొక్కనివే భుజిస్తున్నట్లు కలవచ్చినదే ? అన్నాడు జగన్నాటక సూత్రధారి.
"శ్రీ కృష్ణా ! అలసియుంటివిగదా ! అందులోనూ పగటి నిద్ర .ఈవేళలో వచ్చు కలలకు ఫలితములుండవని శాస్త్రములు చెబుతున్నవి " అని సుధాముడునమ్మ బలికాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకునెను.

కాలాంతరమున కుచేలుడు [సుధాముడు] పరమ నిర్భాగ్యుడయ్యెను. తనవెతలు బాపుమని ఎన్నియో మారులు విష్ణుసహస్రనామములను పఠించెను .ఆఖరికి శ్రీకృష్ణులవారికి దయగలిగినది. కుచేలునినుండి అటుకులు స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యమును ప్రసాదించెను. తాను అలసిపోయినప్పుడు ఒడిలో తల ఉంచి నిదురపోయేందుకు అవకాశమిచ్చిన కుచేలునికి హంసతూలికా తల్పం మీద పరుండబెట్టి పాదసేవను చేశాడా భక్తవల్లభుడు. కర్మసూత్రమెంత నిగూఢముగా పనిచేస్తుందో ప్రభువు ఈలీలలో చూపాడు.

అందుకే ఇప్పుడు అపార ఐశ్వర్యం కలిగి కూడా కోరినది తినుటకు అవకాశం లేని వారు[వివిధవ్యాధులు,కారణాలు] పూర్వజన్మలో విశేషమయిన పుణ్యకార్యములుచెసినా, అన్నదానం చేసి ఉండనందున ఈజన్మలో తృప్తిగా భుజించే అవకాశం చిక్కటం లేదని పెద్దలంటారు. ఎవరికైనా దానములు చేసినప్పుడు ఏసంపదను ఎంత ఇచ్చినా చాలు అనరు.
ఒక్క అన్నదానంలోనే తృప్తిగా భుజించి ఇంకచాలు అంటారు. గ్రహీతకు సంపూర్ణతృప్తి కలిగినదాకా దాతలుచేయగలిగిన దానం ఇదొక్కటే .

Read more...

సాగుతున్న హనుమత్ రక్షాయాగం సంరంభాలు.

>> Thursday, April 8, 2010




మొదలవబోతున్న ఆథ్యాత్మిక ప్రయోగం "హనుమత్ రక్షాయాగం" రెండవ ఆవృతికొరకు సంరంభాలు స్వామి ఆజ్ఞానుసారం సాగుతున్నాయి. క్రితం సంవత్సరం ఈ సాధనలో పాల్గొన్న సాధకులకు లభించిన ఫలితాలు చూసి ఆప్రేరణతో మరింతమందికి ఈ కార్యక్రమాన్ని అందించాలనే సంకల్పంతో అదీ హనుమత్ ప్రభువు తానే నడిపిస్తాడనే నమ్మకం తోఈ కార్యక్రమానికి సాహసిస్తున్నాము. క్రితం సంవత్సరం కూడా ,కార్యక్రమం స్వామి ఆదేశంగా భావించి ప్రారంభించగనే పూజాద్రవ్యాలు.యజ్ఞద్రవ్యాలు, అన్నదానమునకు కావలసిన వనరులు మేము సమకూరుస్తామంటూ స్వామి భక్తులు ముందుకొచ్చారు .ఎవరో నిర్ణయించి ఉంచిన ప్రణాళికవలె కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా అద్భుతమైన ఫలితాలతో ముగిసింది. అలానే ఈసంవత్సరం కూడ కార్యక్రమం చేపట్టాలని సంకల్పించగనే స్వామి అనుగ్రహం మొదలైంది. తణుకు ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు హనుమదుపాసకులు వెంకట్రామయ్యగారు, సంసిద్ధులయ్యారు. తాడేపల్లి గూడెంలో ఉన్న మన బ్లాగర్ ,అక్కడి ప్రింటింగ్ సంస్థ యజమాని జగదీష్ రెడ్డిగారు కార్యక్రమంలో పాల్గొనే సాధకులకు అందజేసేందుకు కావలసిన హనుమాన్ చాలీసాలు,సంపుటీకరణ మంత్రాలు ముద్రించిన కార్డులను తాము తయారుచేసి ఇస్తామని చెప్పారు. ప్రముఖ హనుమత్ తత్వప్రచారకులు అన్నదానం చిదంబర శాస్త్రిగారు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ తమ శిష్యవర్గానికి అందజేస్తున్నారు.చెన్నైనుండి " ఇండియాటుడే "లో పనిచేస్తున్న ఒక హనుమద్ భక్తుడు తాము సుందరాకాండను గేయరూపంలో గానంచేస్తామని .రాష్ట్రంలో ఎక్కడైనా ఈకార్యక్రమంలో వచ్చి పారాయణం చేయమంటే సిద్దమని తెలిపారు. అలాగే గాయత్రీపరివార్ కు చెందిన సాధకులు కొందరు ఎక్కడైనాయజ్ఞనిర్వహణ మేము సహకరిస్తామని మాటిచ్చారు .ఇలా అన్నీ స్వామే సమకూరుస్తున్నారు కనుక ఇది స్వామి అనుగ్రహాన సాగుతున్న యాగంగా భావించి స్వామిసేవలో ముందుకు సాగుతున్నాము. రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలచుకుంటే వారికి మావంతు సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నాము . త్వరలో ఇందులో పాల్గొనే విధానం ,సాధన తెలియజేస్తాము.
జైశ్రీరాం .

Read more...

"దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా "

>> Tuesday, April 6, 2010

శ్రీపాద వల్లభగురో: వదనారవిందం
వైరాగ్యదీప్తి పరమోజ్వల మద్వితీయం
మందస్మితం సుమధురం కరుణార్ద్ర నేత్రం
సంసార తాపహరణం సతతం స్మరామి



శ్రీపాద వల్లభగురో: కరకల్పవృక్షం
భక్తేష్ట దాననిరతం రిపుసంక్షయంవై
సంస్మరణ మాత్రచితి జాగరణం సుభద్రం
సంసార భీతి శమనం సతతం భజామి

శ్రీపాద వల్లభగురో: పరమేశ్వరస్య
యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య
శ్రీపర్వతస్య శిఖరంఖలుసన్నివిష్టం
త్రైలోక్య పావన పదాబ్జ మహం నమామి .

"దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా "

Read more...

పాహి ! దత్త ప్రభో ! పాహి దత్త ప్రభో ! [నిన్న నాజీవితాన కురిసిన దత్తకృపావర్షం]

>> Monday, April 5, 2010

దత్తలీలలు అనూహ్యంగా ఉంటాయి .ఆయన కరుణ ఎవరిమీద ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవరూ ఊహించలేరు. పరీక్షా నిష్ఠుడైన స్వామి ఒక్కోసారి అత్యంత కఠినంగా పరీక్షిస్తాడట . మరొకసారేమో అడగకుండనే ఆయన అనుగ్రహం ముంచెత్తుతుందట. నిన్న నాపై స్వామి కురిపించిన అనుగ్రహం నాసుకృతం అనేకంటే దీనులను, హీనులను కూడా అపార దయతో బ్రొచే దత్తప్రభువు కృపకు ఉదాహరణ అనేది నిజం .

నిన్న మా పెద్దబ్బాయి ఫీజు విషయం మాట్లాడి చెల్లించి రావాలని ఆదివారం తాడేపల్లి గూడెం వెళ్లాను . అక్కడకెళ్లాక మధ్యాహ్నం నేనొచ్చిన సంగతి ఆఊర్లోగల మన బ్లాగర్ జగదీష్ రెడ్డిగారికి తెలియజేశాను. ఎప్పటినుంచో ఆయన ఒకసారి రమ్మని అడుగుతున్నారు. ముందు కాలేజీ కివెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పగా ఆయన వారి బంధువును ఒకరిని పంపి కాలేజీదగ్గర దించి వచ్చారు. అక్కడకెళ్లాక ముక్కామల లో ఉన్న ప్రముఖ హనుమదుపాసకులు హనుమత్తత్వ ప్రచారకులు వెంకట్రామయ్య గారికి ఫోచేశాను నేను ఇక్కడకొచ్చానని. ఆయన సంతోషించి ఎలాగూ ఇక్కడకొచ్చారు కనుక తణుకు వరకు రండి. నేను అక్కడకొస్తాను ఒకసారి మిమ్మల్ని కలసి మాట్లాడాలని ఉంది దగ్గరే ఇక్కడకు అని అడిగారు. ఆవిషయం జగదీశ్ రెడ్డిగారికి చెప్పి ,ముందు తణుకు వెళ్లి వారితో మాట్లాడి మీ ఇంటి కొస్తాను అని చెప్పాను. తణుకు వెళ్ళేసరికే వారు నాకోసం వచ్చి ఎదురు చూస్తున్నారు .వారి ఆప్యాయతకు ,అభిమానానికి కృతజ్ఞతలు . వారు ఆపట్టణం లో ఉన్న వారిశిష్యుల ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కొంచెం సేపు
సత్సంగం ,హనుమత్పూజ అయ్యాక ఆప్రాంతం లోకూడా ఈసంవత్సరం "హనుమత్ రక్షాయాగం" జరపుటగూర్చి చర్చించాము. ఆసమయం లో ఆయన మాస్టర్ గారూ ! మీకు మా అబ్బాయి దత్తాత్రేయులవారి చిత్రమునొకటి ఇవ్వమని,ఒకసారి పిఠాపురం లోని శ్రీపాదవల్లభుల దర్శనం చేయించమని చెప్పాడండి . మీరు ఉంటే వెళ్ళివద్దాము రేపు అన్నారు . నేను ఈరాత్రికే తాడేపల్లిగూడెంలో వారితో మాట్లాడి తిరుగుప్రయాణం అవ్వాలండి ,పదవతరగతి పిల్లల చివరి పరీక్ష ఉంది .అని చెప్పాను . ఈమధ్యలో దత్తస్వామి ప్రసక్తి రావటం ఆయన అనుగ్రహమే.
నాకు ఇదే మొదటిసారిఈ ప్రాంతం రావటం కనుక కొత్త. అనుకోకుండా స్వామీ ఇక్కడకు "చివటం" ఎంతదూరమండి ? అని అడిగాను . చివటం ఇక్కడేనండి మూడుకిలోమీటర్లే అన్నారు. అక్కడ మహాసమాధి చెందిన అవధూత, దిగంబర యోగిని "చివటం అమ్మ" గారి దర్శనం చేయాలనే ప్రగాఢకోరికతో ఎవరైనా కాస్త బండిమీద వదిలిపెట్టిరమ్మనగలరా ? అని అడిగాను ,వేంకట్రామయ్య గారి శిష్యులు [పేరు గుర్తు రావటం ] నేనొస్తా పదండి అని బయలుదేరారు. అక్కడ ఆథ్యాత్మిక వాతావరణం లో సంస్కారవంతులై ఉన్న ఆసాధనామండలి సభ్యుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాను. వారందరి అభిమానానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరొకసారి.
పదినిముషాలలో అమ్మ మహాసమాధి మందిరానికి చేరుకున్నాము. అమ్మ మహాసమాధిపై ఉంచిన మూర్తి నేత్రాలనుంచి ప్రసరిస్తున్న దయ ప్రేమ ,తీక్షణత మనసులోపొరల్లోకి దూసుకుని పోతున్నాయి. తన్మయత్వం కలుగుతున్నది , మనసు ఎక్కడ నిరామయమవుతుందో ఎక్కడ మనస్సుకు అపారమైన శాంతి కలుగుతున్న అనుభూతి లభిస్తాయో ,అది సద్గురు స్థానమని పెద్దల సూచన ప్రత్యక్షంగా కనపడుతున్నదచట . అమ్మ కు ప్రదక్షిణాదులు చేసుకుని [అయ్యో ! మరచిపోయాను ఇప్పుడుగుర్తుకొస్తున్నది. సద్గురువుల సన్నిధికి ఉట్టిచేతులతో పోరాదు ,బుద్దిహీనతవల్ల కలిగిన ఈబిడ్ద తప్పును .కరుణారాశి అమ్మ క్షమించుగాక] అక్కడ సుదీంద్రబాబుగారి స్థానమునకు నమస్కరించుకుని అలాగే అక్కడకు విచ్చేసిన కొండమోడు ఆశ్రమాధిపతులైన స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వచ్చేశాను.
తాడేపల్లి గూడెంలో నాకోసం ఎదురుచూస్తున్న జగదీష్ రెడ్డిగారింటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించాను .వారికుటుంబసభ్యుల సంస్కారం ఎంతో ఉన్నతమైనది. అనుకోకుండా జగదీష్ రెడ్డిగారి నోట మరొకసారి స్వామి ప్రసక్తి వచ్చింది. ఇప్పటివరకు గుప్తంగా ఉంచబడ్డ శ్రీపాదశ్రీ వల్లభుల సంపూర్ణ చరిత్రను ఒకమహాభక్తుడు లక్షలరూపాయల వ్యయంతో ముద్రిస్తున్నారు ప్రింటింగ్ పూర్తయినది మా ప్రెస్ లోనే. మొదటిప్రతిని మీకివ్వాలని అనుకుంటున్నానండి అని తెచ్చి ఇచ్చారాయన.
నిజంగా దత్తప్రభువు దయకు వర్ణించడానికి మాటలు రావటం లేదు.ఇలా ఆయన స్మరణ కూడా సరిగాచేయటం చేతగాని నాలాంటి నికృష్ట జీవులపైనే కరుణకురిపించి ,దర్శనమిప్పించి తన చరిత్రను ప్రసాదంగా ఇప్పించిన స్వామి , ఇక నిత్యం ఆయనను ఉపాసించి ధ్యానించు యోగులను , భక్తులను ఎంతగా అనుగ్రహిస్తాడో కదా !
. అన్నట్లు చెప్పడం మరచాను ,. నేను ఈపోస్ట్ కాక చివరగా, శ్రీగురుచరిత్రనుండి అసంకల్పితంగా వ్రాసిన పోస్ట్ "దత్తానుగ్రహ సాధన". ఇలా వ్రాయడం ,వరుసగా స్వామి అనుగ్రహం అనుభవం లోకి రావడం , యాదృచ్చికమేనా ? గమనించుకోలేని నామంద బుద్దికి తన అనుగ్రహం ఎలా ఉంటుందో రుచి చూపించుటకు దత్తస్వామి జరిపిన లీలా ? ఏమో . అర్ధం కాని మూర్ఖత్వం నాది. అపార కరుణావృష్టి దత్తప్రభువుది. అందుకే అన్నారు స్వామి "స్మర్తృగామి"[అంటే స్మరణమాత్రం చేత సంతుష్టుడు] అని.


స్వామి అనుగ్రహ ప్రసాదంగా నాకు లభించిన శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ దివ్యచరితామృతమ్.ఇది

దత్తాం భజే .గురు దత్తాంభజే




Read more...

దత్తానుగ్రహ సాధన

>> Friday, April 2, 2010


శ్రీ గురుచరిత్రను భక్తితో పారాయణం చేసి ఇహపరాలను సులభంగా సాధించుకోవచ్చు . దత్తప్రభువు అనుగ్రహ ముంటే లభించనిది ఏమున్నది ? చొట్టచేతులతో పుట్టిన కార్తవీర్యునకు వేయిబాహువులను అఖండ సిద్ధులను ,సమస్తరాజ్యభోగాలను ప్రసాదించిన కరుణాంతరంగుడాయన . కేవలం భౌతిక సుఖాలనే కాదు ఆథ్యాత్మిక శిఖరాలపై భక్తులను కూర్చోబెట్టి పరమపదవిని ప్రసాదించగలదు సద్గురు కృప . ఇక గురునాథుడైన దత్తానుగ్రహానికి తిరుగేమున్నది ? . ఈ కలియుగాన ఆయన అనుగ్రహాన్ని శీఘ్రంగా ,సులభంగా ప్రసాదించగల మార్గం శ్రీగురుచరిత్ర పారాయణం . ఈ గ్రంథ పారాయణాన్ని చేస్తూ . సకల శుభాలను సాధించుకోవచ్చు . భక్తిపూరిత సాధన మీది ,అనుగ్రహ కృపావర్షం దత్తప్రభువుది . ప్రారంభించండి .ఏటి ఒడ్డున నిలబడి అలా దాటాలా ? ఇలా దాటాలా ? అని మీనమేషాలు లెక్కించేబదులు దిగి చూడండి ఏదో ఒక ప్రయత్నానికి .అది దత్తప్రభువు అనుగ్రహానికి కారణమై మనలను తప్పనిసరిగా తరింపజేస్తుంది. శ్రీ గురుచరిత్ర పారాయణం తోబాటు క్రింది శ్లోకాల జపం తప్పనిసరిగా ఆయా ఫలితాలనిస్తుంది మీ జీవితాన ప్రయోగించి నిరూపించుకుని చూడండి .
జై గురుదత్తా .


అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:
స్మర్తృగామీ స్వభక్తానాముద్ధర్తా భవసంకటాత్

[ యథా శక్తి ఈస్తోత్రం జపం చేస్తే కష్టాలు తొలగుతాయి]

జీవయామాన భర్తారం మృతం సత్యాహి మృత్యుహా
మృత్యుంజయ స్స యోగీంద్ర: సౌభాగ్యం మే ప్రయచ్ఛతు
.

{ ఈశ్లోకాన్ని జపిస్తే సౌభాగ్యం వృద్ధి అవుతుంది.]

దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్
యో౭భూదభీష్ట: పాతు స న: సంతాన వృద్దికృత్
సంతానాన్ని ప్రసాదిమ్చగల శ్లోకజపమిది]

దరిద్ర విప్ర గేహే య: శాకం భుక్త్వోత్తమ
శ్రియం
దదౌ శ్రీదత్త దేవ: దారిద్ర్యాత్ శ్రీప్రదో౭వతు

[ఈశ్లోకజపం దారిద్ర్యాన్ని దూరం చేసి సంపదను ప్రసాదిస్తుంది]

Read more...

దత్తానుగ్రహ సాధన

అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:
స్మర్తృగామీ స్వభక్తానాముద్ధర్త్రా

Read more...

మనలను మనం మూర్ఖులనుకునే దినమట .. సంతోషిద్దామా ! ఏమిటీ ఖర్మ?

>> Thursday, April 1, 2010

మనం ఇతరులను ఎగతాళికైనా మూర్ఖులు అని సంబోధించడానికి సందేహిస్తాము . కారణం ఇతరులను అవమానించటం అనేది కూడా పాపమని మన నమ్మిక . మనకు క్షమించే ఔదార్యాన్ని నేర్పినది మన సంస్కృతి. అవమానించే గుణం ఒక అవలక్షణంగా భావింపబడుతుంది మనలో .

కానీ ఎవరినైనా ముఖ్యంగా వారి పద్దతిని అనుసరిమ్చని ఎవరినైనా మూర్ఖులుగా జమకట్టి అవమానించటం తెల్లవాని దురహంకారం . అందుకే ప్రపంచ చరిత్రలోవాని అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకోవటానికి ఇతరులు ఏమీ తెలియని మూర్ఖులుగా ప్రచారం సాగించిన నైచ్యం అడుగడుగునా కనపడుతుంది . దానిలో భాగమే ఈ ఏప్రిల్ ఫూల్ ఆచారం . ప్రామాణికమైన కాలగణనం లేని పాశ్చాత్యులు కొత్త సంవత్సర ప్రారంభాన్ని అనేకసార్లు మార్చుకున్నారు. అప్పటిదాకా ఏప్రిల్ ఒకటిన జరుపుకుంటున్న కొత్తసంవత్సరం వేడుకలను జనవరి ఒకటికి మార్చుకుని ,ఈమార్పుని అంగీకరించక పాతపద్దతినే ఆచరించే వారిని ఏప్రిల్ ఫూల్స్ అంటూ హేళనచెసి దానితో సంతోషాన్ని పొందటమేకాక తమకు బానిసలయ్యేవారందరి మెదల్లలోకి తమకు తాముగా ఏమీతెలియని మూర్ఖులమనే భావజాలాన్ని విజయవంతంగా చొప్పించగలిగారు. ఈవరుసలోనే తెల్లవాడు తమ సంస్కృతిని నరాల్లోకి ఇంజక్షన్ లా ఎక్కించి మరీ మనదేశాన భావబానిసత్వం పెంచగలిగాడు కొంతవరకు .అందుకే ఈ ఫూల్స్ దినాలు ,ప్రేమికుల దినాలు రకరకాల దినాలు మన జీవితంలోకొచ్చేస్తున్నాయి . రేపోమాపో లేచిపోయే దినాలు ,లేవదీసుకుపోయే దినాలు కూడా వస్తాయేమో ! ఖర్మ.





ఈ ఏప్రిల్ ఫూల్ ఆచారమూలాలను పరిశీలించండి ఒకసారి.


చరిత్ర

ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. [1]అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటినుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టపడక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యదావిధిగా ఏప్రిల్ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటపట్టించేవారు. అంతేకాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్ ఫిష్ అంటూ అల్లరి పెట్టేవారు.

ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్ ఫూల్స్ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమెరికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచమంతా ప్రాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రాన్రానూ ప్రాక్టికల్ జోక్స్ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్ జోక్స్ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. [వికీపీడియా నుండి]








Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP