లంకలో పూలన్నీ ఎర్రగానే ఉంటాయా ? ! ఎక్కడైనా ఇలాఉంటుందా ?
>> Thursday, November 11, 2010
సంత్ తులసీ దాస్ లవారు కాశీనగరం లో నివాసం చేస్తూ రామాయణ రచన సాగిస్తున్నారు . సాక్షాత్తూ హనుమంతులవారు ఆనాడు జరిగిన ఘట్టాలను వివరిస్తూ అనుమానాలు తీరుస్తూ దగ్గరుండిరచనచేపిస్తున్నారు .
సుందరాకాండ పారంభమైనది . ఆంజనేయస్వామి లంకాపురం లో ప్రవేశించి అశోకవనంలో వెదకడం వ్రాస్తున్నారు . అక్కడ వనం యొక్క శోభను వర్ణిస్తూ చెట్లు వివిధరకాల పుష్పాలను గూర్చి చెబుతున్నారు .
ఆహా అక్కడ ఆవన శోభ ఎంత గొప్పగాఉంది వివిధ వర్ణాల పుష్పాలు ..అంటూ వ్రాస్తుండగా ఆంజనేయులవారు అడ్డుకున్నారు .
అశోకవనం లో పుష్పాలన్నీ ఎరుపు వర్ణము కలవే .. వేరే రంగులేదు అలావ్రాయి అన్నాడు.
అదేమిటి స్వామీ ? వనమన్నాక అనేక రకాల పుష్పాలుంటాయియి కదా ,! అన్నీ ఎర్రగా అని ఎలావ్రాయమంటారు ? ప్రశ్నించారు తులసీదాసులవారు
అవును అక్కడలాగే ఉన్నాయి ..చెప్పాడు స్వామి
అలాఎలా ఉంటాయండీ ఆశ్చర్యపోయాడు సంత్
అంతే ! అక్కడన్నీ ఎర్రగానే ఉన్నాయి .. స్వామి స్పష్టీకరించారు
అదెలాగండి ? ప్రకృతిలో అన్ని వర్ణాలుంటాయి అంతముద్దుగా వనం పెంచుకున్నవాళ్లు ఒక్కరంగు పూలచెట్లనే పెంచుతారా ? కాబట్టి అన్ని వర్ణాలుంటాయి అలాగే వ్రాయాలి ...అలావ్రాద్దాం అన్నారు తులసీ దాస్
టాట్ ... వీల్లేదు ఎర్రగా ఉన్నాయని వ్రాయాల్సిందే భీష్మించాడు స్వామి
ఏమిస్వామీ ! మీరు చెప్పేది ప్రకృతి విరుద్ధంగా ఉంది ,ఒక్కరంగుపూలే ఎలాఉంటాయి నసిగాడు దాస్ గారు
చూసింది నువ్వా ? నేనా ? కోప్పడ్డాడు హనుమ
ఇదెక్కడి గోలరా బాబూ ! అని మనసులో మధనపడ్ద తులసీ దాస్ గారు ఇహ లాభం లేదనుకుని ఈ సంక్లిష్టతనుంచి గట్టెక్కించమని రామచంద్రప్రభువును ప్రార్ధించాడు
తప్పనిసరై స్వామి స్వయంగా వచ్చాడు . వచ్చిన స్వామికి సాష్టాంగపడి స్వామీ ! ఈయన నన్ను అశోకవనాన్ని స్వేఛ్చగా వర్ణింపనీయటం లేదు . అక్కడన్నీ ఎర్రని పుష్పాలే ఉన్నాయని వ్రాయమంటున్నాడు .. ఎక్కడైనా అన్నీ ఎర్రని పుష్పాలే ఉండేలా వనాలుంటాయా ? అలాగంటే కోప్పడుతున్నాడు ..అని విన్నవించాడు .
రామచంద్రప్రభువులు చిరునవ్వునవ్వి ..... అంజలిబద్ధుడై ఉన్న హనుమను అనునయిస్తూ హనుమా ! నాడు అశోకవనం లో సీతాదేవిని రాక్షసులు బాధపెట్టడం చూసి నీలో క్రోధం పెరిగి కనులు ఎర్రబారాయి . కళ్లలో తీవ్రంగా రక్తనాళాలు రక్తం తో నిండి నీ చూపుకంతా ఎర్రగానే కనిపించింది . అందువల్లనే చుట్టుప్రకృతి అంతా రక్తవర్ణమయంగా నీకు కనపడింది . అంతే. ఆవనంలో అన్నిరంగుల పుష్పాలున్నాయి.
పాపం అతన్ని వ్రాసుకోనివ్వు ఆజ్ఞాపించాడు.
స్వామి ఆజ్ఞను హనుమంతులవారు ఔదలదాల్చారు
తులసీ దాసుగారి ఘంటం నిరాటంకంగా ముందుకు కదలింది .
జైశ్రీరాం
6 వ్యాఖ్యలు:
చాలా బాగుంది చిన్ని కథ :)
బాగుంది
మంచి టపా. ఇదే కథను రామకృష్ణపరమహంస గారు కూడా చెప్పారు. వారు చెప్పిన కథలో పూవులే కాకుండా లంకలోని భవనాలు కూడా హనుమకు ఎర్రగానే కనిపించినట్లు చెప్పారు.
yadbhavam tatbhavathi...yad drasttaha..tat drusyaha...[very nice post]
బాగుందండీ
చిన్ని కథ ద్వారా చాలా మంచి సందేసాన్నిచ్చారు. బాగుంది
Post a Comment