జ్యోతిర్లింగార్చనకు గోత్రనామాలు పంపండి
>> Monday, November 8, 2010
ఓం నమ:శివాయ
పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమశివునిఅర్చనలు వైభవో పేతంగా జరుగుతుంటాయి. వివిధరకాలుగా భక్తులు సాగించే అర్చనలను స్వీకరించి వారి దురితములను బాపుతాడాభోళాశంకరుడు . ఆయన అభిషేకము ,అర్చన అనంతఫలితాలనిస్తుంటాయి .
కార్తీకమంటేనే దీపోత్సవాలమయం . జ్యోతిర్మయుడైన పరమాత్మను కు దీపాలతో అర్చనలు నివేదిస్తుంటారు . ఈసందర్భంగా శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం భక్తుల తరపున జ్యోతిర్లింగార్చన కార్యక్రమమును చేపట్టింది .కార్తీక మాసం లో ప్రతిరోజూ సాయంకాలం పీఠంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఈ పూజ జరుగుతుంది. ౧౦౮ జ్యోతులతో స్వామి లింగాకారాన్ని ఏర్పరచి షోడశోపచారములతో అర్చన జరుపబడుతుంది . ఈ అర్చన చేయటం ద్వారా భక్తులయొక్క వివిధమైన జాతక,కర్మ దోషాలు నశించి పరమేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది . స్వామికి ఈసేవజరపటం ద్వారా సకల సంపదలు ఒనగూడుతాయి .
ఈకార్యక్రమాన్ని తమతరపున జరిపించుకోదలచిన భక్తులు తమ గోత్రనామాలను పంపి ఈ కార్యక్రమానికి అవసరమయ్యే పూజాద్రవ్యాలను సమర్పించవలసి ఉంటుంది .
నువ్వులనూనె ,వత్తులు .పూలు ,పండ్లు, పసుపుకుంకుమ విభూతి ,పూలు,కొబ్బరికాయలు ,కర్పూరం, అగరు బత్తీలు మొదలైన పూజాద్రవ్యాలను తెచ్చుకున్నవారిచే ఈకార్యక్రమం జరిపించబడుతుంది . ఒకవేల స్వయంగారాలేని వారు కూడా ఈపూజాద్రవ్యాలకయ్యే ఖర్చును పంపితే వారి తరపున కార్యక్రమం నిర్వహించబడుతుంది . మొత్తం ఖర్చు 256 రూపాయలకు మించదు. మీతరపున అర్చనజరిపించుకోవాలనుకునేవారు మెయిల్ చేసినా లేదా 9948235641 సంప్రదించినా ఎలాపంపాలో వివరం తెలియపరచడం జరుగుతుంది .అలాగే ఆరోజు ఇక్కడ అర్చన జరిగే సమయానికి మీ ఇంటిలో ఏమిచేయవలెనోకూడా తెలియపరచబడుతుంది . మీఇంటి లో కూడా ఈ జ్యోతిర్లింగార్చన జరపటం వలన గృహం లో ఉండే దోషాలేమైనా ఉంటే తొలగిపోయి లక్ష్మీకళ ప్రాప్తిస్తుంది . ఆయింటిలోనివారికి అనారోగ్యాది ఈతిబాధలు నివారించబడతాయి .
durgeswara @gmail.com
1 వ్యాఖ్యలు:
చక్కనైన విషయాలను తెలిపారు దుర్గేశ్వర గారు. మీరు జతపరిచిన చిత్రాలు కూడా చక్కగా ఉన్నాయి. ఈ పూజ ఏ ఊళ్ళో జరుగుతుందండి?
Post a Comment