అమ్మ అనుగ్రహం కొరకై జరుగుతున్న ఈ దివ్యపూజలకు గోత్రనామాలు పంపండి
>> Saturday, October 9, 2010
దుష్టజనశిక్షణకు ,భక్తజనరక్షణకై యుగయుగాలనుండి అవతరిస్తున్న ఆది పరాశక్తి అమ్మ దుర్గాదేవి ఆనంద తాండవం చేస్తున్న దివ్యశరన్నవరాత్రులివి . లోకమంతా అమ్మ నామస్మరణతో పులకించిపోతున్నది. అమ్మా !అని పిలిస్తే పరుగునవచ్చి కాపాడుకునే తల్లిని కొలచి స్మరించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి . ఆతల్లి దివ్యానుగ్రహం లోకమంతటా సుఖశాంతులను ప్రసాదించాలని ఆసురీశక్తుల విజృంభణను పరిహరించాలని , కోరుతూ శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో 75 వ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిప్రపత్తులతో జరుపబడుతున్నాయి .
లోకశ్రేయస్సును కోరి భక్తులతరపున పూజలు జరుపబడుతున్నాయి. కాన మీ గోత్రనామాలను పంపినచో జరుగుతున్న ఈ మహోత్సవాలలో మీ కొరకు కూడా ప్రార్ధనలు చేసి పూజలు జరుపబడతాయి . అలాగే వీలైనన్నిరోజులు సాధన చేసుకోదలచినవారు ప్రత్యక్షముగా పాల్గొని సాధనచేసుకొనుటకు కూడా అవకాశం ఉన్నది . అమ్మ దివ్యానుగ్రహాన మీకు మీకుటుంబానికి సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాము .
సంప్రదించవలసిన నంబర్ 9948235641 durgeswara@gmail.com
2 వ్యాఖ్యలు:
GOTRAM: GANDHASIRI
GALLA YEDUKONDALU
GALLA UMARANI
GALA GEETHANJALI
GALLA MANVITHA SAI PRASANNA
Name : Neeladri Rao, Sesirekha, SriAurobindo, Sriram
Gotram : Kowsikasa
Thank you very much and pranams!
Post a Comment