శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పెళ్లి ఆలస్యమవుతున్న మగ పిల్లల కొరకు

>> Thursday, August 19, 2010

పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా
పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు
మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార
మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో
అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల
సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది.
అందునా మంచి భార్య లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన
అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా
వెతుకుతున్నాను.

అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ
స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి
ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక
దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి
వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ
అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత
కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము
ఆలస్యమవుతున్న మెగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన
కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు
సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి
కాదు.




సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం


క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే |
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే ||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే |
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం ||

సర్వ సంపత్ స్వరూపత్వం సంతుష్టా సర్వ రూపిణీం |
రాశేశ్వర్యధిదేవీత్వం త్వత్కళాః సర్వయోషితః ||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోదే సింధుకన్యకా |
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే ||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవ దేవీ సరస్వతీ |
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః ||

కృష్ణ ప్రాణాధి దేవీ త్వం గోలోకే రాధికా స్వయం |
రాశే రాశేశ్వరీ త్వంచ వృందావన వనేవనే ||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే |
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ ||

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే |
కుంద దంతీ కుంద వనే సుశీలా కేతకీ వనే ||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ |
రాజ లక్ష్మీ రాజ గేహే గృహ లక్ష్మీ గృహే గృహే ||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వ మునయో మనవస్తథా |
రూరూదుర్నమ్ర వదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః ||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం |
యః పఠేత్ ప్రాతరుత్థాయ సవైసర్వం లభేత్ ధృవం ||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం |
సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీం ||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం ||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశశ్వినం |
భ్రష్ఠ రాజ్యో లభేత్ రాజ్యం భ్రష్ఠ శ్రీర్లభతే శ్రియం ||

హత బంధుర్లభేత్ బంధుః ధన భ్రష్ఠో ధనం లభేత్ |
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాచ లభేత్ ధృవం ||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనం |
హర్షానందకరం శాశ్వత్ ధర్మ మోక్ష సుహృత్పదం ||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

[ మిత్రులు రాజశేఖరుని విజయ్ శర్మ గారు అందించిన శుభకరమైన స్తుతి ]

10 వ్యాఖ్యలు:

Anonymous August 19, 2010 at 5:50 AM  

ఈ స్తోత్ర౦ యొక్క ఆడియో ఎక్కడ దొరుకుతు౦ది? శబ్ద ఉచ్చారణ కూడా ముఖ్య౦ కదా.

రామమొహన్ August 19, 2010 at 7:55 AM  

చాలా గొప్పగా చెప్పెరు స్వామి ఆదిమ సమాజం నుంచి కార్మిక వర్గం ఇలాంటి పూజలు , శ్రమలు చెస్తూనె ,వుంది మరి వాళ్ళకు ఐస్వర్యం ఎందుకు సిద్దించలెదు ఏనాడొ శ్రమలు చెయ్యటం మానుకున్నా వాళ్ళకుమాత్రం ఐస్వర్యం. మీలాంటి విష సర్పాలు సమాజంలొ వున్న సమస్యలకు సమాజంలొకాక యక్కడొ ఆత్మ పరమాత్మ అని సమస్యలపై పూరాటం గాక ఇలాంటి వాటిల్లొ పరిస్కార మార్గాలు వెతుకుతారు

Anonymous August 19, 2010 at 8:40 AM  

మంచిది . మరి మీరు మీకు తెలిసిన మార్గం లో ఎన్ని సమస్యలు పరిష్కరించారు ? ఎంత సమాజ సేవచేసారు ? పరదూషణ ఆత్మస్తుతి తప్ప మిగతావి తెలియకుండా ఆలోచించేవారికి ఇంతకంటే తెలిసే అవకాశం లేదు రామ్మోహన్ గారు .

--------durgesvwara

Rajasekharuni Vijay Sharma August 19, 2010 at 9:48 AM  

దుర్గేశ్వరగారికి : ఈ టపాను మీ బ్లాగులో మళ్లీ ప్రచురించి మరింత మందికి పరిచయమయ్యేటట్లు చేశారు. ధన్యవాదాలు.

రామమోహన్ గారికి: ఐశ్వర్యం అంటే డబ్బు అని మాత్రమే మీరు భావిస్తున్నారు. పెద్దల దృష్టిలో ఆనందం అనేది కూడా ఐశ్వర్యమే.. అది లభించి ఉండవచ్చు కదా ఈ పూజలు చేసిన వారికి. నిత్యం పరమేశ్వరుని యందు శ్రద్ధా భక్తులతో పూజించిన వారికి ఆనందం లేకపోవడమన్నది నేనెరుగను.

ఇక కష్ట సుఖాలంటారా అవి రెండూ అనుభవించడానికే మానవులుగా మనం పుట్టింది. కేవలం పుణ్యం చేసుకుని ఉంటే ఏ స్వర్గంలోనో, బ్రహ్మలోకంలోనో ఆనందాన్ని, భోగాలను అనుభవిస్తూ ఉండేవారిమి. కేవలం పాపమే మన ఖాతాలో ఉంటే ఏ అల్ప ప్రాణిగానో జన్మించేవారిమి. పాప పుణ్యాలు రెండూ ఉన్నాయి కనుకనే కష్ట సుఖాలు అంటే ఏమిటో తెలిసిన మానవులుగా జన్మించాం. వీటికి అతీతమైనది ఆనందం. గుడిసెలో ఉన్నవాడికీ ఉండవచ్చు, మిద్దెలో పుట్టినవాడికీ ఉండవచ్చు.

" మీలాంటి విష సర్పాలు..." అయ్యబాబోయ్ చాలా భారీ పదాలు వాడేస్తున్నారండీ.. మీ కేమైనా దుర్గేశ్వరగారు వ్యక్తిగతంగా పరిచయమేమిటీ...? అలా అయితే వారెంతమందికి విషాన్ని పంచారో ఏమైనా చెప్పండీ.. మేమంతా వారిని ఏదో మంచివారని తలపోస్తున్నాం.. :)

రాజేశ్వరి నేదునూరి August 22, 2010 at 10:44 AM  

చాలా మంచి విషయం చెప్పరు దుర్గేశ్వర్ గారు పెళ్ళి గాని అబ్బాయిలకి పఠించ వలసిన " స్తోత్రం " గురించి " పెళ్ళి కావలసిన అమ్మాయిలు " సంతోషి మాతని పూజించి విజయం సాధిం చిన వారున్నారు .కొందరు హేళన చేసి పదుగురితొ నిందలు పడి ఎన్నటికీ పెళ్ళి కుదరక నానా బాధలు పడి చివరికి " సంతొషి మాతను " పూజించి కోరుకున్న దాని కంటె నాసి రకం సంబధం " రాజీ " పడి చేసుకున్న వారున్నారు .అందు చేత భగ వంతుని [ వ్రాసిన వారిని ]నిందా స్తుతి పనికి రాదు 1.కొంత మన అదృష్టం .మరి కొంత దైవ నిర్ణయం .అంతె రాజ శేఖరుని విజయ శర్మ గారు చక్కగా చెప్పారు ధన్య వాదములు

Sesirekha Munagala August 22, 2010 at 10:51 PM  
This comment has been removed by the author.
Sesirekha Munagala August 22, 2010 at 10:53 PM  

Pujya Durgeswara garu
Thank you very much for giving such a wonderful hymn of Divine Mother especially for boys to get a very nice girl as wife in these ages. Please keep posting hymns like these which helps people in different ways. I also read your istha kameswari ammavari yatra. Such a wonderful darshan you had. After reading your i felt when Divine Mother permits me?? My humble pranams to you.
sesi

Anonymous September 12, 2010 at 10:49 PM  

Can you please provide the links for "rukmini kalyanam". I have audio but i want to read the slokas in telugu.

srinivas gitam August 27, 2011 at 8:42 AM  

sir lakshmi kalyanam gadyam from where we can have it.

srinivas gitam August 27, 2011 at 8:42 AM  

sir lakshmi kalyanam gadyam from where we can have it.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP