పరీక్షలలో విజయం కోసం హనుమత్పూజ
>> Wednesday, February 24, 2010
జైశ్రీరామ్
బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
వేడినవారికి కొండంత అండ హనుమత్ స్వామి . ఆయన చెంత చేరినవారికి అన్నింటా దిగ్విజయమే . సకల మనో వికారాలను అణగించి బుద్ధిబలాన్ని పెంచి నిర్భయత్వాన్ని ప్రసాదించి సర్వత్రా జయాన్ని చేకొనేలా అనుగ్రహిస్తాడు తనను వేడినవారికి. కనుకనే పరీక్షలు వచ్చినప్పుడు స్వామి అనుగ్రహాన్ని కోరి భజించి జీవితంలో ఎదురయ్యే ఆపరీక్షలను దిగ్విజయంగా దాటగల శక్తినిపొందుతున్నారు అప్పుడూ ,ఇప్పుడూ కూడా.
ప్రస్తుతం రాష్ట్రం లో పలువురు పిల్లలు చదువులో పెద్దపరీక్షలనెదుర్కోబోతున్నారు . రాత్రింబవళ్ళు చదువుతూ మంచి రాంకులు ,మార్కులకోసం పోరాడుతున్నారు. ఇలా బద్దకించకుండా తమశాయశక్తుల కృషిచేసే వారంటే స్వామి కెంతో ఇష్టం . ఎందుకంటే అనుకున్నది సాధించాలంటే నిర్విరామంగా ఎలా కృషిచేయాలో స్వామి ఆచరించి చూపించాడుకదా ! అందులోనూ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న విద్యార్థులంటే మరీ ఇష్టం స్వామికి. ఆయన శక్తి పూర్ణంగా ప్రసాదిస్తాడు పిల్లలకు .
ఐతే కొద్దిమందికి ఆరోగ్యకారణాలు కానివ్వండి ,పూర్వజన్మకృతం వలన కానియ్యండి ఇంకా ఇతరకారణాల వలన కానివ్వండి ఏకాగ్రత రాక ,మనసు నిలకడ కుదరక ,భయమావరించి చదువులో వెనుక బడుతుంటారు. రాత్రింబవళ్ళు చదివినా గుర్తుండటం లేదని మంచి స్థాయితెచ్చుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు.పాసవ్వలేమని నిరాశ చెందుతుంటారు.
అలా భయపడవలసిన పనిలేదని మన పెద్దలు మనకు ఆంజనేయుని అభయాన్ని పొంది సులభంగా విజయాన్ని పొందవచ్చని సలహా ఇస్తున్నారు పూర్వకాలం నుంచి పెద్దలు.. ఆర్తులకు కొండంత అండగా నిలచి నడిపించే ఆంజనేయుడు మన తోడున్నాడని గ్రహించండి ఎటువంటి భయము అక్కరలేదు.ఆయనను ఆశ్రయించినవారికి ఎక్కడా అపజయం లేదు. వీళ్ళుపాస్ కావటం అసాధ్యం ,అని మాస్టర్లచేత నిర్ణయిచబడి తోటివారితో గేలి చేయబడ్ద పిల్లలనుకూడా హనుమదుపాసన చేపించి నతరువాత అద్భుతమైన ఫలితాలు చూసిన అనుభవముంది నాకు. తమ శక్తివంచన లేకుండా కృషిచేసి స్వామి నాశ్రయిస్తే తప్పనిసరిగా ఆయన అనుగ్రహంతో పరీక్షలలో కృతార్ధులుకాగలరు. అలాగే మంచి రాంకుల ను కోరుకున్నవారు అనుకున్న స్థాయిలో మార్కులను సంపాదించుకోగలరు . ఇది సిధ్ధయోగం.
ఈక్రింది సూత్రాలను పాటించాలి
------------------------
౧ .. విద్యార్థి గోత్రనామాలను మాకు మెయిల్ చేస్తే ఆపిల్లల పేర ఇక్కడ అర్చన జరుగుతుంది.
౨... ఈ సాధనలో పాల్గొనే విద్యార్ధి ఉదయాన్నే హనుమంతుని స్మరిస్తూ వేకువఝామునే నిద్రలేచి . చదువుకున్న తరువాత స్నానానంతరం పదినిమిషాలు ఇక్కడిస్తున్న చాలీసాలోని సంపుటీకరణ మంత్రాన్ని పఠించాలి
ఈ మంత్రాన్ని నడుస్తున్నప్పుడు ,ఖాళీ సమయంలోనూ ,భయం కలిగినప్పుడు స్మరించాలి.
ఎవరితోనూ తగాదాలు పెట్టుకోవడం ధూషించటం చేయకూడదు. చెడు మాటలు మాట్లాడితే మీ శక్తి తగ్గిపోతుంది . మంచి మాటలు పలకడంద్వారా మీరు శక్తివంతులవుతారు గ్రహించండి.
౩. మీకు సమీప ఆలయంలోగాని ,లేదా మీదగ్గర రున్న హనుమంతుని చిత్రపటాన్ని తులసికోటలోనో లేక కుర్చీలోనో పెట్టుకుని కనీసం 27 ప్రదక్షిణములు చేయాలి. ప్రతిరోజు ఉదయం వేళలో.
4. మాంసాహారం తీసుకోకుంటే మంచి ఫలితముంతుంది . శక్తికోసం పళ్ళు,పాలు ఎక్కువగా తీసుకోవచ్చు.
5. ధ్యానించవలసిన శ్లోకం
" బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్
బలబుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశవికార్ ."
పై శ్లోకాన్ని పదే పదే స్మరించటం ద్వారా మంచి జ్ఞాపకశక్తి కలిగి చదువు బాగాసాగుతుంది.
విద్యార్ధులెవరన్నా మనసులో పరీక్షలపట్ల భయంకలిగినా ,ఇంకా ఏదన్నా సందేహాలొచ్చినా నాకు మెయిల్ చేసినా లేక ఫోన్ చేసినా మీ సందేహాలు తీర్చటానికి ప్రయత్నిస్తాను . మీకోసం ఇక్కడ స్వామికి అర్చనలు జరిపిస్తాము .
ఇందుకోసం విద్యార్థులు మాకివ్వవలసిన దక్షిణ స్వామి పట్ల మీరుచూపే శ్రద్ధాభక్తులు మాత్రమే. ఆయనలాగా మీరుకూడా సకల సద్గుణవంతులుగా తయారవ్వడమే .
దిగ్విజయోస్తు .
_________________
సంప్రదించవలసిన చిరునామా
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం
durgeswara@gmail.com
9948235641
మీ తోటి విద్యార్థులకు కూడా ఈ విషయం అందజేయండి
3 వ్యాఖ్యలు:
మంచి మాట దన్యవాదాలు
చాలా మంచి ప్రయత్నం గురువు గారూ.
Thank you uncle.
Post a Comment