సైన్స్ చెప్పే వేదాంతం
>> Saturday, February 20, 2010
"బ్రహ్మ" అనే పదం "బృంహణము " అనే ధాతువునుంచి పుట్టినది. బృంహణము అంటే అతటా ,అన్నింటా నిండియన్నది అని అర్థం ,ఆ బ్రహ్మం సత్యం అన్నారు..సత్యం అంటే వాస్తవమైన ఉనికి కలిగియుండుట,అంటే ఎన్నటికీ నశించినది,శాశ్వతమైనది అని అర్థం .అదిలేని తావేలేదు కనుక అనంతమైనదన్నమాట. బ్రహ్మ అన్నింటికీ ఆధార భూతుడన్నమాట. కుండలన్నింటికీ మట్టి ఆధారభూతమైనట్లు.అదే పరమాత్మ అన్నారు. అదే సర్వ వ్యాపకమని చెబుతారు ఋషులు .దానినే దైవమంటారు. ఈ గుణాలు గలది సృష్టికాధారంగా ఉన్నదని నిరూపిస్తే భగవంతుడున్నాడని నిరూపమైనట్లే .
ఆధునిక విజ్ఞానమేమని చెబుతోంది ? సృష్టి లోని పదార్థమంతా పరమాణుమయము అంటున్నది. ఈ పదార్ధమంతా ఒకే ఒక శక్తి లేక Energy యొక్క రూపమేనని చెబుతుంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త హైసెన్బెర్గ్ werner heisenberg "phisics and philosophy " అనే గ్రంథం లో నేటి విజ్ఞాన సారాన్నిలా చెబుతారు..."ప్రాథమికమైన కణాలన్నిటినీ చాలినంత శక్తి ప్రభావానికి గురిచేసినట్లైతే ఇతర ప్రాథమిక కణాలుగా మార్చవచ్చు. లేక గతిక శక్తి [kinetic energy] నుండి అటువంటి కణాలను సృష్టించవచ్చు. లేక ఆప్రాథమిక కణాలను నశింపజేసి శక్తిగా మార్చవచ్చు. కనుక మనకిక్కడ నిశ్చయమైన ఋజువు దొరికింది. పదార్థమంతటికీ ఆధారంగా ఒక ఏకత్వమున్నదని. ప్రాథమిక కణాలన్నీ శక్తి అనబడు ఒక్క ఆధారాన్ని కలిగిఉన్నాయని. అన్ని ప్రాథమిక కణాలరూపంలోనూ మనకు గోచరించేది ,ఇప్పుడాలోచిస్తే బ్రహ్మమని మన ఋషులు చెప్పినది దీన్నిగురించేనని తేలుతుంది. బ్రహ్మ సత్యం అన్న ఋషివాక్యాన్ని ఆధునిక విజ్ఞానమూ నిరూపిస్తుంది ! .
0 వ్యాఖ్యలు:
Post a Comment