అయ్యప్ప స్వాములకు మాంసాహారం .... హరిహరీ ! ఏమిటీ ఘోరం ?
>> Monday, January 4, 2010
చెన్నయ్, జనవరి 3(ఆన్‌లైన్): అండమాన్ నుంచి శబరిమలై వెళ్లే అయ్యప్ప మాల ధారణ భక్తులకు ఓ నౌకాయాన సంస్థ మాంసాహారం వ డ్డించడమే గాక మహిళల పక్కన సీట్లు కేటాయించడం తీవ్ర వివాదాస్పదమైం ది. ఈ మేరకు స్వాములు ఆదివారం చెన్నయ్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా వున్నాయి. అండమాన్ నుంచి శ బరిమలై బయలుదేరిన అయ్యప్ప భ క్తులు ఆదివారం ఉదయం చెన్నయ్ చే రుకున్నారు. అనంతరం వారు తమ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇక్కట్లను మీడియాకు వివరించారు. తాము ప్ర యాణించిన నౌకలో తమకు సాంబారులో మాంసం ముక్కలు, రసంలో చే పలు కలిపి వడ్డిం చారని, అంతే కా కుండా మహిళల పక్కనే సీట్లు కేటాయించారని చెప్పారు. ఈ విషయాన్ని నౌకలోని ఫుడ్ కాంట్రాక్టర్ సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు.
అయ్యప్ప భక్తులకు మాంసాహారం వడ్డించడమే కాకుండా తనను 16 యేళ్ల అమ్మాయి పక్కన కూ ర్చోవలసిందిగా వత్తిడి చేశారని 60 యేళ్ల భక్తుడొకరు ఆవేదన వ్యక్తం చే శారు. అయ్యప్ప భక్తులకు జరిగిన అ న్యాయం గురించి తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ వెంటనే హార్బర్‌కు చేరుకుని వారితో చర్చించారు. అనంత రం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి యేడాది అండమాన్ నుంచి వందలా ది మంది భక్తులు చెన్నయ్ ద్వారా శబరిమలై వెళ్తుంటారని తెలిపారు. అయి తే ఈ దఫా ఇలా జరగడం విచారకరమన్నారు. ఈ విషయమై తాను పోర్టు అధికారులతో మాట్లాడానని, వివాదానికి కారణమైన ఫుడ్ కాంట్రాక్టర్‌పై చ ర్యల తీసుకుంటామని తనకు హామీ ఇ చ్చారని రాధాకృష్ణన్ తెలిపారు. ఇదిలా వుండగా పోర్టు నుంచి సెంట్రల్ వెళ్లేందుకు ఎంటీసీ బస్సు ఎక్కిన అయ్యప్ప భక్తులకు అక్కడ కూడా తిప్పలు తప్పలేదు. వారి వద్ద అధిక లగేజీ వుందని, అందువల్ల బస్సు ఎక్కనిచ్చేది లేదని కండక్టర్ పట్టుపట్టడంతో వారు బిక్క మొహం వేయాల్సి వచ్చింది. మళ్లీ రా ధాకృష్ణన్ జోక్యం చేసుకుని దురుసుగా ప్రవర్తించిన ఎంటీసీ సిబ్బందిపై చర్య లు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు
4 వ్యాఖ్యలు:
హేతువాదం, నాస్తికులం, మేథావులం అంటూ వాళ్ళమెడలో వాళ్ళే మూర్చబిళ్ళ్లలను వేసుకు తిరిగేవాళ్ళకు, మకరజ్యోతి ఎవరో వెలిగిస్తారు, ఇదంతా నాటకాలు బోడీబొచ్చు అనివాగే మేధావులు ఈసమస్యను భక్తులకు జరిగిందిగాగాక కనీసంతోటిమనుషలకు జరిగిందిగా భావిస్తారా. లేక హహహహ అంటారా? ఈసమస్య మానవహక్కులకు సంబంధించిందికాదా? ఇక్కడ మనోభావాలు గాయపడవా? ఒకవర్గంపై చేసిన దాడికాదా?
హిందూ దేశంలో, హిందువుల మీద జరిగే దాడి, నేరం కాదు
అదే మైనారిటీలకు జరిగితే నేరం ఘోరం.
ఇంత కంటే దారుణం మరొకటి వుండదు......
అయ్యొ...ఇదేదో పెద్ద విశేషమని చదివా....చాలా మామూలు విషయం... మీరు అనవసరం గా రాద్ధాంతం చేస్తున్నారు....హిందూస్థాన్ లో ఇవి సర్వ సాధారణం...సోదరులకు యాత్రలలో రాయితీ లు ఇవ్వకుంటే అది విషయం,వేరే మాలలు వేసుకొనే వాళ్ళకు(కెరళ మరో రకం మాలలు-ముష్కరిణి మాలలు అనొచ్చు ) ఏ సి కోచ్ లు ఏర్పాటు చెయ్యక పోతే విశేషం ...కానీ ఇదో పెద్ద విశేషమా? ఇంకా నయం మీ భక్తే గొప్పదైతే పైవాడే(?) రక్షిస్తాడు అని సముద్రం లొ తొసెయ్యలేదు... మీకొ విషయం చెప్పాలనుంది ..... మా పూర్వపు ఆఫీస్ లొ అయ్యప్ప మాలలు వేసుకున్నా డ్రస్ కొడ్ పాటించాలి..లేకపోతె కాండక్ట్ సమస్య అట... అదే సొదరీమణులైతే వారి దేహాన్ని పూర్తిగా నల్ల ముసుగులో దాచెయ్యొచ్చు... అప్పుడు మాత్రం organizational rules గుర్తుకు రావు (అట )!! మన ప్రారబ్ధం ఇంతేనేమొ...
Post a Comment