ఇప్పుడు మనమేధర్మాన్ని అనుసరించాలి ?
>> Wednesday, December 30, 2009
శిష్యుడు : ఇప్పుడు మనమేధర్మాన్ని అనుసరించాలి ?
స్వామీజీ : హనుమన్మహావీరుడే మనకిప్పుడాదర్శపురుషుడు .రామాజ్ఞతో అతడు సాగరాన్ని ఎలా లంఘించాడో చూడు. అతనికి ప్రాణభీతిలేదు.మృత్యుభయం లేదు .అతడు జితేంద్రియ చక్రవర్తి . అత్యద్భుత వివేక మహిమాన్వితుడు. మనం ప్రస్తుతమున్న దాస్య భావ నిర్మూలనకోసం హనుమంతుని జీవితాదర్శంగా ఎన్నుకోవాలి . దానివల్ల మిగతా ఆదర్శాలన్నీ జీవితం లో క్రమంగా అభివ్యక్తమవుతాయి . ఎదురు చెప్పకుండా గుర్వాజ్ఞను పాటించటం.కఠోర బ్రహ్మచర్య పాలన - ఇవే జయం పొందటానికి కీలకాలు .
----------------------------- స్వామి వివేకానంద
4 వ్యాఖ్యలు:
ఎప్పుడైతే మన పురాణేతిహాసాలను మన వారే ఎగతాళి చేయడం ఫ్యాషన్ అయిందో అప్పటి నుండే మన పతనం ప్రారంభమైంది. హనుమంతుని జీవితాన్ని ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా పెడితే చిన్నప్పటి నుండే అతని జీవితం, కృషి, పట్టుదల ,ధైర్యసాహసాలు ,మరియు కార్యదీక్ష అర్థమవుతాయి.
@ సురేష్ : చాలా బాగా చెప్పారు హనుమంతుని జీవితాన్ని ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా పెట్టాలి
@ రచయిత : మంచి మాట చెప్పారు
జై హనుమాన్.
మంచి విషయం చెప్పారు.
ముఖ్యంగా యువతకు హనుమంతుని వలె ధీశక్తిని నింపుకోగల శిక్షన అవసరమంటున్నారు స్వామీజీ .
స్పందించిన యువతకు శుభాశీస్సులు. దిగ్విజయోస్తు
Post a Comment