దేవుడా ! రక్షించు ఈ దేశాన్ని.......................
>> Friday, December 11, 2009
చరిత్ర గుర్తులేని జాతి జనం మధ్య చిచ్చుపెట్టటం ఎంత తేలిక !? జాతిని విభజించటమెలాగో తెలిసిన మాకియవెల్లి వారసత్వగుణాలుగల విదేశీ శక్తుల కుటిల క్రీడలెంత తేలికగా కొనసాగుతున్నాయో ఏ మాత్రం ఆలోచించుకోలేని యువత ఈరాక్షస క్రీడకు బలయిపోతున్నది . ఎక్కడాలేని నీతి,రీతి మనం చూస్తున్నాం. మా బస్సులు ఆస్తులు మేం తగలెట్టుకుంటాం ,రేపు అడుక్కుతింటాం అనేచందంగా ఈ ఉద్యమకారులనబడె మౌఢ్యంతలకెక్కిన ఉన్మాదపు గుంపు దురాగతాలకు పాల్పడుతుంది. తమ చర్యలకు పరిణామాలేంటో ఏమాత్రం యోచనా జ్ఞానం లేని మేధావుల కుంచితపు ఆలోచనలతో
మారణహోమం రగుల్కొంటున్నది. అసలు వీల్ల లక్ష్యమే దేశాన్ని బలహీనపరచి ఆక్రమించాలనే విదేశీ శక్తుల కుట్రలకు ఇతోధికంగా సహకరించటమేనని అనిపిస్తున్నది.
ఇక ఈ జాతిని రక్షించటానికి భగవంతుడు తప్ప వేరు దిక్కులేదేమో ?
జనం అభిప్రాయానికి విలువనిచ్చి విభజనకు మద్దతిస్తామని , మరలా విభజన వద్దని రెండు నాలుకలతో మాట్లాడే నాయకులు
తెలంగాన ఉద్యమం గూర్చి గోరంతను కొండతలుగా చేసి చూపి రెచ్చగొట్టిన పత్రికలే .మరలా సమైక్యాంధ్ర ఉద్యమం గూర్చి మరింత రెచ్చగొట్టెలా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. వీటి తీరేమిటో ? ఉద్దేశ్యమేమిటో ,వీరి వెనుకున్నదెవరో ? ఆలోచించే శక్తి ఉద్రేక పూరిత మనస్కులకు ఉండదు . కాబట్టి వీల్లకెదురు ఉండదు.
మన చదువులు మనవి కాకపోయె ! మన భూములు మనవి కాకుండా పోతుండె ! మన సంపదలు మనవి కాకపోయినా పరవాలేదు గాని మన మనసులు . ఆలోచనలు కూడా మనవి కాకుండా పోతున్నాయి
.దేవుడా ! రక్షించు ఈ దేశాన్ని మా మూర్ఖత్వపు ఆలోచనలనుండి. అమ్ముడు పోయిన మా జాతి నాయకుల పైశాచిక ,స్వార్ధపూరిత యోచనలనుండి .
9 వ్యాఖ్యలు:
దెవిడి బొమ్మ పెట్టుకున్నవని నువ్వేమైన మహర్షి వనుకుంటున్నవా ఏంది... తెలిసిన విషయాల పై రాస్తే .ఏమైనా మర్యాద... చిచ్చు అనేది..కనిపిస్తుంది.. మరి మా ఊళ్ళళ్ళో ప్రజెక్ట్ లు నీళ్ళు మాత్రం పక్కూరొళ్ళకి... ఇలాంటి వాటిపై ఏమైనా రాసినావా...???
మీ ఆవేదన అర్థం అయిందండీ. మీతో నేను ఏకీభావిస్తాను
100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.
యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
see this link for answer
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_2177.html
అయ్యా ! రమన గారూ .
విజయవాడ వెళ్ళి రావటం తో మీకుఇ సమాధానమివ్వటం లో కొద్దిగా ఆలస్యమైనది. క్షమించండి
ఏమన్నారూ ! మహర్షి నా ..నేనా ! వాల్లకాలిగోటితో పోల్చడానికి సరిపోను . వారు చెప్పిన మార్గాలలో నడకనేర్చే పనిలో పడుతూ లేస్తున్నాను. మీలా కొత్తజ్ఞానం పొందేంత శక్తి లేకపోయె.అదట్లుంచండి.
నేను తెలంగాణా విభజనను వ్యతిరేకిస్తూనో ,ఇంకొక వాదనను సమర్ధిస్తూనో కాదు మాట్లాడుతున్నది . ఈ పైశాచిక క్రీడల వెనుకున్న లక్ష్యాలు ,రాబోయే పరిణామాల గూర్చి భయపడుతున్నాను .అంతే !
మా ఊరిలోగూడా కాలువపక్కనే మెరక భూములకు నీరెక్కడం లేదు .పల్లం భూములకు అందుతున్నాయి.
అది నీటిప్రవాహ లక్షణం అనుకుంటా . కాకుంటే పురుషప్రయత్నం తో మెరక భూములకు సైతం నీరెక్కించి సస్యస్యామలం చేయగల మేధస్సు భగవంతుడు మనకిచ్చాడు .దానిని ఉపయోగించుకోగల నాయకత్వ లోపమే మన సమస్యలకు ప్రధాన కారణము .
రహంతుల్లా గారికి .బొల్లోజు బాబా గారికి ధన్యవాదములు.
అయ్యా ! రమన గారూ .
విజయవాడ వెళ్ళి రావటం తో మీకుఇ సమాధానమివ్వటం లో కొద్దిగా ఆలస్యమైనది. క్షమించండి
ఏమన్నారూ ! మహర్షి నా ..నేనా ! వాల్లకాలిగోటితో పోల్చడానికి సరిపోను . వారు చెప్పిన మార్గాలలో నడకనేర్చే పనిలో పడుతూ లేస్తున్నాను. మీలా కొత్తజ్ఞానం పొందేంత శక్తి లేకపోయె.అదట్లుంచండి.
నేను తెలంగాణా విభజనను వ్యతిరేకిస్తూనో ,ఇంకొక వాదనను సమర్ధిస్తూనో కాదు మాట్లాడుతున్నది . ఈ పైశాచిక క్రీడల వెనుకున్న లక్ష్యాలు ,రాబోయే పరిణామాల గూర్చి భయపడుతున్నాను .అంతే !
మా ఊరిలోగూడా కాలువపక్కనే మెరక భూములకు నీరెక్కడం లేదు .పల్లం భూములకు అందుతున్నాయి.
అది నీటిప్రవాహ లక్షణం అనుకుంటా . కాకుంటే పురుషప్రయత్నం తో మెరక భూములకు సైతం నీరెక్కించి సస్యస్యామలం చేయగల మేధస్సు భగవంతుడు మనకిచ్చాడు .దానిని ఉపయోగించుకోగల నాయకత్వ లోపమే మన సమస్యలకు ప్రధాన కారణము .
రహంతుల్లా గారికి .బొల్లోజు బాబా గారికి ధన్యవాదములు.
దుర్గేస్వర గారు నేను రమను కొత్తజ్ఞానం అంటే నా కనిపించింది బహుశా నన్ను రమణ అనుకుంటున్నారేమో అని నేను ఆ కామెంట్ రాయలేదు. మీరు ఏ మహర్షి కి తక్కువ కారు ఎవరో ఏదో రాసారని ఏమి అనుకోకండి దైవ చింతన ఉన్నవాళ్ల గురించి వీళ్ళకేమి తెలుస్తుంది. మీ భావం ఆటగానికి అర్ధం కాలేదు. బస్సులు ఆస్తులు తగులబెట్టద్దురా అని డైరెక్ట్ గ చెప్పిన వాళ్ళకి అర్ధం కాదు. అర్ధం కాదు చెబితే వినరు అందుకే నిజాముల పాలనలో అంత దెబ్బ తిన్నారు ఎం చేస్తాం మన తమ్ముదోకరు మంద బుద్ధైతే మనమే ఓర్చుకోవాలి కదా
బాబాగారూ
మీరిచ్చిన సమాచారం బాగుంది.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రతిపాదనపై యానాంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.మీరు చెప్పినట్లు యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.
Post a Comment