>> Saturday, November 28, 2009
చిరునవ్వులు చిందించిన శ్రీవారు [గీతాజయంతి పూజవివరాలు]
గీతాజయంతి రోజున పీఠములో శ్రీవారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి . ఉదయం నుండి పురుషసూక్త ప్రకారంగా స్వామి వారికి అభిషేకాలు నిర్వహించబడ్డాయి . స్వామి భక్తులు ఢిల్లీ నివాసులైన కౌండిన్యస గోత్రీకులు రామమూర్తి_ లక్ష్మీ దంపతులు తమ అతల్లిదండ్రుల తరపున శ్రీవారికి సమర్పించవలసినదిగా కోరుతూ పంపిన పట్టువస్త్రాలను ధరించి స్వామి చిరునవ్వు లొలకిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
తదనంతరం విష్ణుసహస్రనామ సహితంగా అష్టాక్షరీ మంత్రాన్ని అనుసంధానిస్తూ నారాయణ యాగము భక్తిప్రపత్తులతో సాగించబడింది . చెన్నై నుంచి సునీల్ వైద్యభూషణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ,వినుకొండనుంచి వచ్చిన భక్తులు పాల్గొని స్వామిని సేవించుకున్నారు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని " శ్రీరాధే జయరాధే జయజయ రాధే " అనే దివ్యనామాన్ని శనివారం ఉదయం ఆరుగంటలనుండి ఆదివారం ఉదయం ఆరుగంటలవరకు నిర్విరామంగా ఏకాహం గా జపించటం జరిగింది . పరమాత్మ యొక్క హ్లాదినీశక్తి అగు రాధామాత నామాన్ని పఠించటం ద్వారా ఆతల్లి దివ్యానుగ్రహాన్ని భక్తులు సులభంగా పొందగలుగుతారని శాస్త్ర రహస్యము . కృష్ణున్ని పట్టుకోవాలంటే బృందావనేశ్వరి రాధాదేవి అనుగ్రహం లేనిదే సాధ్యం కాదని శాస్త్రవచనం . సాయంత్రం భగవద్గీతా పారాయణం జరిగింది
// పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం ,పురాణమునినా మధ్యే మహా భారతం
అధ్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం //
0 వ్యాఖ్యలు:
Post a Comment