>> Wednesday, December 2, 2009
దత్తానుగ్రహముతో స్వామి జయంతి వేడుకలను వైభవంగా జరుపుకోగలిగాము . మార్గశీర్ష పౌర్ణమి బుధవారంరోజు అత్రి,అనసూయలకు కాలాగ్ని శమన దత్త మూర్తిగా ఆ విశ్వగురువు అవతరించిన సుదినం ఈరోజు . ఈ పౌర్ణమి ఈసంవత్సరం బుధవారమే రావటం విశేషం . ఈసందర్భంగా కొండగురునాథని క్షేత్రం లో ఈ సారి దత్తజయంతి జరపటానికి సంకల్పం కలగటం నూటఎనిమిది కలశాలతో స్వామికి అభిషేకాలు నిర్వహించటం ,దత్తహోమము జరుపుకోవటం అంతా స్వామి అనుగ్రహమే.
స్వామి పరీక్షా నిష్ఠుడు అనటానికి నిదర్శనంగా చిన్నచిన్న పరీక్షలు కల్పించిలీలగా జరిపాడు దివ్యమైన ఈ కార్యక్రమాన్ని . రాత్రి కొండమీద పౌర్ణమి ధ్యానం పొద్దుటే అభిషేకాలు కనుక రాత్రికే కొండమీదకు రావలసినదిగా స్థానికంగా వున్న అయ్యప్పదీక్షాస్వాములను ,భక్తులను పిలచాము . కలశాల ఏర్పాట్లకు కావల్సిన సరంజామా అంతా కొండ దగ్గరకు చేర్చాము . రాత్రి భజనానంతరం బిక్షచేసి వస్తాము సామానంతా పైకి తీసుకెలదామన్న స్వాములు భుక్తాయాసం చేతనో ,చలిదెబ్బకు భయపడో ,వీడి ఛాదస్తంగూలా.....వెళితే నిద్రపోనివ్వడనో ,లేక వీడుకూడా వెనిక్కితిరుగుతాడేమో చూద్దామని స్వామి లీలా విలాసం సాగించాడొ తెలియదు గాని పదకొండైనా భక్తస్వాములు అంతులేరు . ఈకార్యక్రమాన్ని జరపాలని పట్టుదలతో అన్ని ఏర్పాట్లకు ముందుకు వచ్చిన గణపతిసచ్చిదానంద స్వామి భక్తుడు అప్పాపురం ప్రభాకరరెడ్డి తనతో పాటు మరొక యువస్వామిని తీసుకుని వచ్చాడు .మా పిల్లలు సి.ఏ .చదువుతున్న వెంకట నారాయణరెడ్డి .లక్ష్మీరెడ్డి ,కాశయ్యలు మాత్రమే వెంట వచ్చారు . ఇక ఎవరికోసమో ఎదురుచూడటం కాదు స్వామి ,మనసంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనమీద మాత్రమే మనం ఆధారపడాలి అనిచెప్పి సామానులు ఎత్తుకుని పైకి బయలుదేరాము . చిన్నప్పుడు సెలవు దొరికితే గొడ్డలి తాడు చేతబట్టి లేడిపిల్లలా గంతులు వేస్తూ తిరిగిన ఆ కొండ బరువులు తీసుకుని ఎక్కడానికి దేవుడు కనిపించాడు . మీరెక్కద మోస్తారులే మాస్టారూఅ ని పిల్లలంటున్నా ఈరూపేనా అయినా ఖర్మక్షయమవుతుంది అని చెప్పి ఆయాసంతో అలాగే రాత్రి సామానులు చేరావేశాము రెండు మూడుసార్లు ఎక్కిదిగి . ఉదయాన్నే అభిషేకాలకు కొండమీదకు క్రిందనున్న బోరింగులనుంచె నీళ్ళు మోసుకెళ్ళాలి .పొద్దున నాలుగింటికే దిగివచ్చి నీళ్లకాన్లు తలకెత్తుకుంటే సగం దూరం ఎక్కేసరికి ఎగశ్వాస తో కళ్లుతిరిగాయేగాని అడుగు పడలేదు . లాభంలేదు మీరే తీసుకురమ్మని చెప్పి ఆబాధ్యత పిల్లలకే వదిలాను. ఈ ఉద్యోగం వచ్చాక పొద్దుగూకులు కుర్చీలో కూర్చుని ,ప్రయాణాలు వాహనాలమీద చేసి శరీరం ఎంత బలహీనపడిందో స్వామి బాగా గుర్తుంచుకునేలా చూపించాడు .
తరువాత అభిషేకాల సమయానికి ఊర్లోనుంచి స్వాములు కూడా కొందమీదకు వచ్చారు. స్వామి ఇప్పుడొస్తున్నారు స్వాములు నిదానంగా అని పిల్లలు అంటే వాల్లకొక విషయం గుర్తు చేశాను. ఇలా పూజలకొచ్చేవాల్లు భక్తులు . కనుక వాల్లకు స్వామిని చూదాలనుకున్నప్పుడొస్తారు . మనమలా కాదు సేవకులము కాబట్టి భగవంతునికి ఆయన్భక్తులకు కోపం రాకుండా సేవచెయ్యాల్సిన విధి మనది .కనుక వాల్లలానేవస్తారు మీరుకానివ్వండి అనిచెప్పి అభిషేకం మొదలెట్టాను .షిరిడి సాయి అనన్యభక్తురాలు శకుంతల గారు కూడా ఆసమయానికి వినుకొండనుంచి వచ్చి కొండమీదకు చేరుకున్నారు .పంచామృత అభిషేకం, పురుషసూక్త , రుద్రాసూక్త ములతో దారుశిలా మూర్తిగా వెలసిన ఆదత్తస్వామికి నూటాఎిమిది కలశాలతో జలాభిషేకములు జరిపాము . తదనంతరం అర్చనలు నైవేద్యాలు సమర్పించాము అక్కడే తయారుచేసి . ఆతరువాత కలశజ్యోతులతో బాలికలు ముందునడవగా దత్తపాదుకలను తీసుకుని పీఠమునకు వచ్చి స్వామికి ప్రీతిపాత్రంగా దత్తహోమము నిర్వహించటం జరిగింది . మాపిల్లలు కడుజాగ్రత్తతో కెమేరా తెచ్చి అందులో బ్యాటరీ మరచుటచేత ఛాయా చిత్రములు తీసుకొనుటకుదలేదని బాధపడితిరి . మనం చేస్తున్నది పూజ కదా ద్రుష్టి ఫోటోలమీద వద్దని స్వామి సూచన అనిచెప్పాను .
ఈకార్యక్రమానికి బాధ్యత వహించి అన్నీ సమకూర్చుకుని వచ్చిన ప్రభాకరరెడ్డికి భక్తులందరి తరపున ఆశీస్సులు .
ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాలు పంపి పాల్గొన్నవారి పేర్లు ఇక్కడ తెలియజేస్తున్నాను . వీరిలో మూడు నాలుగుపేర్లు ప్రతికార్యక్రమానికి పాల్గొనేవారు ,ఈసారేకారణం చేతనో పంపలేకపోయినందున నేనే చేర్చాను.
గోత్రం పేరు ధర్మపత్ని
లోహితస భాస్కర్_ హరిత
భారద్వాజస శ్రీనివాస్ _సుజాత
శ్రీవత్స వెంకటరాఘవరావు_శకుంతల
కాశ్యపస ఫాలశంకరరావు [తల్లి.శ్రీలక్ష్మి]
ఎర్రచెరుకు విజయమోహన్-లీలారాణి
మందపాళ్ల శ్రీధర్- భారతీదేవి
భారద్వాజస వెంకటమంగేశ్వరరావు-దుర్గాభవాని
పైడిపల్ల ప్రదీప్ -లక్ష్మి
మార్కండేయ రామారావు సత్యవతి [మురళి,సుమన్,భాగ్యరాజ్]
కౌశికస రామకృష్ణారావు-విజయలక్శ్మి
శివానం కృష్ణకుమార్ -ప్రమీల
0 వ్యాఖ్యలు:
Post a Comment