పరమేశ్వరానుగ్రహంగా పంచాక్షరీ జపయాగం పూర్ణాహుతి
>> Sunday, November 15, 2009
మహాదేవునికి ప్రీతిపాత్రమైన పంచాక్షరి జపమును జపింపజేస్తూ కార్తీక మాసం ప్రారంభం లో మొదలుపెట్టిన పంచాక్షరీ జప యాగం ఈరోజు ముగిసినది . స్వామికి ఉదయాన్నుంచి రుద్రసూక్త ప్రకారంగా అభిషేకాదులు అర్చనలు జరిగాయి. భక్తులు ఓం నమః శివాయ అని జపిస్తుండగా గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపునా ఆహుతులిస్తూ పూర్ణాహుతి ని నిర్వహించటం జరిగినది. మీసాల మురళి [అమెరికా] తన సోదరుని పంపి ఈసందర్భంగా అన్నదానం నిరవహించారు . అలాగే సునీల్ వైద్యభూషణ్ జ్యోతిర్లింగార్చన నిర్వహనకు అన్నదానమునకు సహకరించారు . స్వామి అనుగ్రహం నిన్న జరిగిన జ్యోతిర్లింగార్చనలోను ,ఈరోజు యాగానంతరం కురిసిన వర్షం తో ప్రత్యక్షంగా అనుభవమయినది భక్తులకు . పరమేశ్వరుని కృపా కటాక్షం తో మీ అందరకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని స్వామిని వేడుకుంటున్నాము .
3 వ్యాఖ్యలు:
ఓం నమఃశివాయ
ధన్యవాదాలు మాష్టారూ!!
ఎంతటి పుణ్య సత్‍ఫలమొ! ఇంతటి భక్తి ప్రపత్తు లొప్పగా
సంతసమందుచున్ విమల సద్గుణతేజులు పూజ చేసె. వా
రెంతటి ధన్య జీవులొకొ! ఈశ్వర సత్కృపఁ గొన్న వారికిన్
చెంతను నిల్చి దైవము సుచేతనతన్ కరుణించి గొల్పుతన్.
శివ శివ
Post a Comment