శనిత్రయోదశి సందర్భంగా శనిప్రదోషపూజ,జ్యోతిర్లింగార్చనలకు గోత్రనామాలు పంపండి
>> Friday, November 13, 2009
శనిత్రయోదశి విశేషమైన రోజు .అదీ కార్తీకం లాంటి విశేషమైన మాసం లో రావటం మరింత శుభకరం . ఈ కార్తీకం లో రెండు త్రయోదశులు శనివారమే రావటం ఇంకా విశిష్టమైన సంగతి . అలాగే పౌర్ణమి అమావాస్య తిథులు సోమవారం రావటం ఈసంవత్సరం ప్రత్యేకత . రేపు శనివారం త్రయోదశి కనుక పీఠం లో నవగ్రహ శాంతి పూజలు ,శనీశ్వరునకు తైలాభిషేకం అర్చనలు జరుగుతాయి . శనీశ్వరునకు ప్రీతి కలిగించి , దుష్ప్రభావాలను తొలగించి శుభాలను కలిగించే పూజ ఇది . జనకళ్యాణం కొరకై శ్రీ పీఠం ఇక్కడ గోత్రనామాలు పంపిన వారి కొరకు శనీశ్వరునకు అభిషేకాలు అర్చనలు జరుపుతుంది.
ఇక ఇప్పుడు " కోటి పంచాక్షరీ జపయాగము" జరుగుతున్నందున హోమాదులు కూడా జరుపబడుతున్నాయి.ఆదివారం పూర్ణాహుతి జరుగుతుంది . అలాగే శనివారం సాయంత్రం శనిప్రదోషపూజ జరుగుతుంది . రుద్రాభిషేకములు ,జ్యోతిర్లింగార్చన జరుపబడుతుంది . జ్యోతిర్లింగార్చనలో తమ తరపున జ్యోతులు వెలించాలని కోరుకునేవారు కోరి ఆ ఖర్చును తామే భరిస్తే వారి తరపున శివలింగాకారం లో జ్యోతులు వెలిగించి పూజ జరపటం చేస్తారు. పూర్ణాహుతి రోజున జరిగే అన్నదానం లోను తాము పాలుపంచుకోవచ్చు. అలాగే ఆదివారం పూర్ణాహుతి అనంతరం యజ్ఞ శేషం గా మిగిలిన భస్మ ప్రసాదం ,రక్షలు పోస్ట్ ద్వారా,లేక కొరియర్ ద్వారా పంపాలని కోరుకునేవారు .ఆఖర్చును తామే భరించాలి . ఏదైనా దైవ కార్యక్రమం లో తాముకూడా పాల్పంచుకున్న ఫలితం భక్తులకు కలగాలనే ఉద్దేశ్యం తో మాత్రమే ఈ సూచన చేయటం జరుగుతున్నది . మామూలుగా గోత్రనామాలను పంపిన వారందరి తరపున నిత్యం సంకల్పం చెప్పబడుతున్నది .
******************** సర్వే జనా సుఖినో భంతు *****************************
1 వ్యాఖ్యలు:
చిలమకూరు విజయమోహన్,లీలారాణి,విజయచైతన్య, సాలమ్మ(అమ్మ)
గోత్రం: ఎర్రచెరకు
అక్టోబర్ నెల 25 వరకు జపసంఖ్య 8316
అక్టోబర్ నెల 25 నుంచి నవంబర్ 14 శనివారం వరకు 22572
మొత్తం = 30888
ధన్యవాదములతో,
మీ చిలమకూరు విజయమోహన్
Post a Comment