జయజయ దుర్గే .[నవరాత్రి నివేదన]
>> Tuesday, September 29, 2009
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి అద్భుత వైభవం మైన నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి . భక్తజనుల అర్చనతో శోభిల్లిన ఆతల్లి దివ్యపాదాలను దర్శించి జన్మ ధన్యమైనది.
తొమ్మిది రోజులు నానావిధ అర్చనారీతులలో తన భక్తులు సమర్పిస్తున్న నివేదనలను స్వీకరించి భక్త జనులకరుణించినది అమ్మ.
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో పాఢ్యమినాటినుండి జరిగిన పూజలలో గోత్రనామాలు పంపిన వారందరి తరపున పూజలలో సంకల్పములు చెప్పబడి నివేదనలు జరిగాయి. ముఖ్యముగా అష్టమి రోజున అమ్మవారికి జరిగిన జన్మదిన ఉత్సవం లో సాయంకాల పూజలలలో గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున పేరు పేరున హారతులు సమర్పించబడ్దాయి . మహర్ణవమి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు హోమాదులను నిర్వహించటం జరిగినది.
ఈసందర్భంగా ఈ కార్యక్రమాలకు ,ఉత్సవాలలో కొన్నిసేవలకు తమ సహాయాన్నందించిన చిరంజీవి పెండేల వెంకట సూర్యనారాయణ,మధురవాణి ,లక్ష్మీనారాయణసునీల్ వైద్యభూషణ్ లకు ఆర్. ఎన్ .వి.రవి,శంకరరావుగార్లకు పీఠసేవానిర్వహణలో సహాయమందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము . ఈసేవాకార్యక్రమములను మాకుప్రసాదించిన ఆతల్లికి మరొకమారి ప్రణతులు సమర్పించుకుంటున్నాము . అలాగే ఈ కార్యక్రమాలకు తమగోత్రనామాలు పంపిన భక్తజనులందరికీ కూడా ధన్యవాదములు .





వివరాలకై [క్లిక్]
3 వ్యాఖ్యలు:
"జయజయ దుర్గే .[నవరాత్రి నివేదన]" chaalabagundhi alage naa telugu blogu kooda chudandi naa blogu URL:ramgopal-s.blogspot.com
mee bloglo telugulo skroling elapettaaro dhayachesi naku thelupagalaru
naa EMAIL ID:ramgopalpendota@gmail.com
Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.
Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.
Click here for Install Add-Telugu widget
సర్వే జనాస్సుఖినోభవన్తు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు.
ఆ అమ్మ అనుగ్రహం సకలప్రాణికోటిని కాపాడాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తున్నాను.
Post a Comment