"నారాముడు కలలోకూడా అబద్దమాడడయ్యా ! " [అవును తనప్రతిజ్ఞానుసారం కురిపిస్తున్నాడు వర్షం ఇక్కడ]
>> Friday, August 14, 2009
రామనామ మహిమతో కురుస్తున్నవర్షం
ఎక్కడ పరమ పవిత్రమైన రామ నామము జపించబడుతుందో అక్కడ సర్వదోషాలూ తొలగి పోయి శుభాలు ప్రాప్తిస్తాయంటారు పెద్దలు. వర్షా భావస్థితి తో తల్లడిల్లుతున్న ఇక్కడ పరిస్థితిని చూసి కరుణించమని వేడుకుంటూ మన పాఠశాల పిల్లల చేత పది గ్రామాలలో గత శనివారం మొదలు వారం రోజులుగా రామనామ జపము ,పీఠములో యజ్ఞమూ నిర్వహించబడుతున్నది. పిల్లల సాధనచూసిన కొంతమందిపెద్దలు కూడా రామ నామాన్ని జపిస్తూ వున్నారు .ఆరోజునుంచి వాతావరణం చల్లబడింది..
ఈరోజుకు ఖచ్చితంగా వారం రోజులైనది ఈకార్యక్రమాన్ని.సప్తాహంగా కదా మొదలుపెట్టినది., ,తన నామ స్మరణచేసిన వారి నాదుకోవటం లో జాగుచేయని ఆధర్మ ప్రభువు తన కరుణ చూపించారు .ఈరోజు తెల్లవారుఝామున మబ్బులు కమ్మి నాలుగునుంచి ఐదున్నరదాకా వర్షమ్ కురిసినది. ఇక గంటనుంచి వర్షం పోతపోస్తున్నది ఇప్పుడు ఇది వ్రాస్తున్న సమయానికి..
మన భక్తిలో లోపముండవచ్చుకానీ .ఆయనన నామానికున్నశక్తి లోనూ ఆయన కరుణలోనూ లోపం లేదని మనసా గుర్తించి ప్రణామాలర్పిస్తున్నాము.శరణన్నవారిని కాపాడటమే తననియమమని స్వామి ఆరోజు మాటఇచ్చాడుకదా. .భక్తరామదాసు సినిమాలో భక్తురాలి పాత్ర పలికిన ఒకమాటగుర్తుకువస్తుంది ,"నారాముడు కలలోకూడా అబద్దమాడడయ్యా "!అని , అవును యుగాలుదాటినా ,జగానలు మారినా మాటతప్పడు స్వామి. రేపు ఆదివారమ్ ఏకాదశిరోజున పూర్ణాహుతి హోమము జరపటానికి సిద్ధమవుతున్నాము
ముక్తిదము శ్రీరామనామము ,భుక్తిదము శ్రీరామనామము
కోరి కొలచినవారికెల్లను కొంగుబంగరు రామనామము
7 వ్యాఖ్యలు:
మన ఊర్లో రాములవారికి చెప్పి కొంచెం ఎక్కువ కురిపించండి. కాలువ లేకపోతే జనాలు అల్లాడకుండా :)
జై శ్రీరాం.
మన సంకల్పం మంచిదయితే ఆ రామచంద్రప్రభువు కరుణ చూపకుండా ఉంటారా !
జై శ్రీరామ్.
"....మన ఊర్లో రాములవారికి చెప్పి...."
ఒక మానవుడి గురించి ఇంకో మానవుడు రాములవారి వద్ద సిఫారసు చేయనక్కరలేదు. ఎవరు ప్రార్థించినా ఆ ప్రభువు వింటాడు. అనుగ్రహిస్తాడు.
భాస్కర రామిరెడ్డిగారూ!
మీరు అమెరికాలో వుండటం వలన ఇక్కడ పరస్థితి తెలియటం లేదు .జనం మనస్తత్వాలు చాలమారాయి.మీరందరూ ఇక్కడకొచ్చినప్పుడు మీరు కొన్న మాబీడు భూములు రేగ్గాయలు పండేవి .వాటిని రాల్లుపగలగొట్టి ,చదునుచేసి సాగులోకి తెచ్చి అబ్బా !రాక్షసులయ్య పనులు చేయటం లో అని పొగిడించుకున్న గాంధీనగర్ రెడ్లు వేరు . ఇప్పుడు వేరు. గతనాలుగు సంవత్సరాలక్రితం కరు వొచ్చినప్పుడు ఈ ప్రాంతం లో తగాదాలు లేవు ,కొట్లాటలు లేవు .పోలీ్సులకు ఆదాయం లేదు . మరలా భగవంతుని దయవలన వర్షం కురవటం నాలుగుడబ్బులు వెనకెయ్యటం పశువులు మనకు అండగా వుండి సంపద పెంచటం తో కళ్లు మరలా నెత్తి కెక్కాయి .ప్రతివాడూ తాగటం ,తిరగటం గొప్పగా ఫీలవుతున్నాడు. అదిచాలక ఇప్పుడు రెస్టారెంట్లు పెట్టిమరీ ఖుషీలు చేయటం ఎక్కువైనది. మన కాలవకట్ట దగ్గర మనపీఠానికి సమీపంలోనే ఈమధ్య కొత్తగా రెస్టారెంట్ పెట్టి మరీ మధ్యం మాంశం విందులు,పేకాటలు జోరుగా సాగుతున్నాయి. మీవూర్లో కుర్రాలంతా ఇక్కడకొచ్చి కూర్చుంటూన్నారు.
ఇక నామ జపం చేయాలని కోరితే మీవూర్లో బంకు మాలకొండయ్య ,సుబ్బారెడ్డిగారి అబ్బాయి వెంకటేశ్వర్లు నలుగురైదుగురే నామాట కాదనలేక చేస్తున్నారు .ఏం చేద్దాం మాస్టర్ గారూ ఎంతబతిమాలినా గుడివైపుకు రావటం లేదు జనం .కావాలంటే డబ్బులిస్తాం మీరు చేపించండి అంటున్నారు .అని వాపోయారు.
ఇక నిన్న పూర్ణాహుతి విషయం మాట్లాడాలని రామూడుపాలెం వెళ్లాను .అక్కడ మాచుట్టాలే ఊరంతా . వెల్లేసరికి గుడి ఆవరణలో కూర్చుని పేకాటడుతున్నారు జనం మధ్యాహ్నం .ఏమిటయ్యా ఈపని అని విసుక్కుంటే .ఇది లేకపోతే జనం ఇక్కడ కూర్చోరోయ్ .జనం కోసం కదా గుడి అని చతుర్లాడుతున్నారు నాకు మామవరుసయ్యేవాల్లు ,అరవై సంవత్సరాలవాల్లుకూడా . అంతానరిసి న ఈవయసులోకూడా ఎక్కడ ఏది చెయ్యాలో కూడా తెలియనివాల్లకేమి చెబుతాము ,కానివ్వండి మీకు ఇప్పుడర్ధం కాదు ,బ్రహ్మం గారుచెప్పిన స్థితి దాపురించింది .ఈకరువురావటం లో తప్పేమీ లేదు .ఇక్కడ ఇలాంటి మనస్తత్వాల మధ్య రామనామాన్ని జపించమని చెప్పటం నాది బుద్దితక్కువ అని వాల్లు ఆగమని పిలుస్తన్నా వినకుండా వచ్చేశాను .ఇది ఈరోజు గ్రామాలలో ఆలయాలపరిస్థితి. బాగా వెలిగేవాటిని దేవాదాయ శాఖ ఆక్రమించుకుని వ్యాపారకేంద్రాలుగా మలచుకుంటూంటే .లక్షలు పోసి కట్టినా నలుగురు కూర్చుని నామస్మరణ చేసే అలవాటు కూడా మరుగునపడి తాళాలు వేసివుంటున్నాయి గుళ్ళు. బ్రతుకుతెరువు కోసం బ్రాహ్మణులు పట్నాలకు వలసపోవటం తో నైవేద్యాలు కూడా ఏదో ఒక పండక్కే.
మీరేమనుకోకండి .నాకైతే వర్షం పడకుండా నాలుగేల్లు మళ్ళీ ఎండితే గాని భగవంతుడు గుర్తుకురాడు మనకు అన్నంత కోపంవస్తున్నది. కానీ మేతలేక నీరు లేక తల్లడిల్లుతున్న మూగ జీవాలను చూసి ,వాటి బాధను చూసి దు:ఖం తో మాపిల్లలనడిగి ఒరే !వాటి బాధతీరాలంటె కాస్తవర్షం కురిసి పచ్చిక మొలవాలని స్వామిని ప్రార్ధిద్దాము రా అని చెప్పి ఈ కార్యక్రమానికి పూనుకున్నాము.
పది గ్రామాలలో జపం చేపించి ఒకేసమయం లో అన్నిగ్రామాలలో యజ్ఞము ,పూర్ణాహుతి జరుపుదామనుకుంటే రేపు ఎన్నిచోట్ల చేయగలుగుతున్నామో తెలుసా ? పీఠం లో కాక ,మీవూరిలోను ,తిమ్మాపురం లో మాత్రమే ి
ఇవీ మనభక్తి శ్రద్దలు. మిగతావారికి తీరిక లేదు. గుడికి వచ్చి ఒకగంట కూర్చోవటం దండగమారి పనిలావుంది వారికి,నామస్మరణ చేయటం నామోషీ అయిపోతుందేమో ఖర్మ .
భక్తి తో తలచితేకదా ఆప్రభువు ఆదుకునేది. తిరుణాల్లజరుగుతుంటేముఠాలుగట్టి పోటీలుపడి లక్షలు తగలెట్టి ప్రభలు కట్టి దరిద్రపుగొట్టు డాన్సులు వేపిస్తూ తమ గర్వాన్ని ఆపాపపుచర్యలద్వారా వెల్లడించుకుంటూన్న వీరికి .భక్తిగా నామ చేయాలంటె నోరు రావటం లేదు. కలి పురుషుని ప్రభావం తాండవిస్తుంది .జరుగుతున్న అపచారాలను చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.ఏదో మా బాస్ ఆంజనేయులవారున్నారుగదా అని మొండి ధైర్యం తో ఇక్కడ ఊరు బయట పీఠం లో హరిసేవలో గడుపుతున్నాము.
ధన్యవాదములు అందరికీ . జైశ్రీరాం
దుర్గేశ్వర గారూ,ఇవన్నీ కాదన లేని సత్యాలు. గత సంవత్సరం గాంధీనగర్ వెళ్ళి నప్పుడు నేనూ గమనించాను.నాకు చాలా వరకు రాజకీయ పార్టీల స్వలాభం కోసం ఆలోచింపలేని జనాలను పావులుగా వాడుకోవటానికి రంగం సిద్ధంచేసింది.ఒకే పార్టీ గా వున్న వూరి మొత్తంలో ఎప్పుడైతే లంచ రూపేణా ( చిన్న చిన్న పనులు/ డబ్బులు/అధికారం ) రాజకీయం ప్రవేసించిందో.. సర్వ నాశనానికి తెర లేచింది. పెద్దలు లేరు, ఎవడూ ఎవడి మాట వినడు..వూర్లో జూదము మొదలైంది, దానికి తోడు త్రాగుడు. వేసవిలో మరీ ఎక్కువ. కండువ మీదేసుకొని పొలానికి వెళ్ళే వాళ్ళు రూటు మార్చి వినుకొండ కెళుతున్నారు. ఊర్లో డబ్బుకు కొదవలేదు, పనులకూ కొదవలేదు. స్వయం సమృద్ధి, ఇంకా చుట్టు ఒక పది గ్రామాలకు పనినివ్వగల ఊరు ఇప్పుడు ఇలా తగులపడి పోతుంది. ఇవి మార్చాలంటే ఇప్పుడు చదువుకోవటానికి ఊర్లనుంచి మీస్కూల్ కివచ్చే పిల్లల వల్లే సాధ్యం. గురువుగా వారి మనసుల్లో చెరగని ముద్రలు వేయండి. విద్యార్థి దశలో పడిన గుర్తులు జీవితంలో అంత సులభంగా చెరగిపోవు. మీ ప్రయత్నాలు మీరు చేయండి.
జై శ్రీరామ.
Post a Comment