శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నేతాజీకు స్ఫూర్తి నిచ్చిన నేత ఎవ్వడు !?

>> Saturday, August 15, 2009

భగవంతుని కరుణమనమీద ఎప్పుడూ వున్నది. దానిని మనం గుర్తించం గాని మనజీవితాలలో అనుక్షణం గుర్తించవచ్చు..అయితేమనందరము [నిజానికి] నాస్తికులమే . అందుకే ఆయన కరుణయొక్క గాంభీర్యాన్ని గుర్తించలేకున్నాము. బాధలు వచ్చినప్పుడు మాత్రం ఆయననను ప్రార్ధిస్తాము. .అది కొంతవరకు హృదయపూర్వకమై ఉండవచ్చుగాక . కానీ మనకష్తం గట్టెక్కిన,పరిస్థితులు మెరుగుపడిన మరుక్షణం ఆయనను ప్రార్ధించటం మానివేస్తాము.
ఆయనను మరుస్తాము. అందుకే కుంతీదేవి అన్నది " ప్రభూ ! నన్నెల్లప్పుడు కష్టాలలో వుంచు. నేను ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ప్రార్ధించ్గలుగుతాను.సుఖాలు నిన్ను మరచేలా చేయవచ్చు. కనుక నన్ను సుఖంగా వుండనివ్వవద్దు. అని.

మానవజీవిత సారమంతా -జనన మరణ పరంపర రూపమైనది. శ్రీహరికి సమర్పణమే. అదిలేకుంటే జీవితం అర్ధ రహితమే. నాకూ జంతువుకు బేధమేమిటంటే అది భగవంతుని ఉనికిని గుర్తించలేదు .ఆయనను ప్రార్ధించలేదు. .మనం ప్రయత్నించి ప్రార్ధించగలము. కనుక ఆయననౌ కీర్తించకపోతే నాజన్మే వ్యర్ధమవుతుంది.నాకు భక్తి,భగవంతుడున్నా డన్న నిస్సంశయమైన విశ్వాసం ఆవస్యకము. విశ్వాసం భక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. భక్తి జ్ఞానానికి దారితీస్తుందని మహర్షులన్నారు. మేధను పదునుబట్టి వివేకాన్ని వికసింపజేయటమే విద్యయొక్క లక్ష్యం .ఈరెండు ప్రయోజనాలు సిద్దించినప్పుడు విద్యసార్ధకమైనదనవచ్చు. విద్యావంతుడైన వ్యక్తి ఎవడికైనా నైతికత లోపిస్తే వాణ్ణి విద్యావంతుడనగలమా? ఎన్నటికీ అనలేము. విద్యా రహితుడైనా తన నడవడికలో హృదయసిద్ధి కలిగివుంటే ,అతడు భగవమ్తుని ప్రేమిస్తుంటే అతడే మహాపండితుడని అంగీకరించగలను. .నాలుగు మంచిమాటలు నేర్చినంతనే పండితుడు కాజాలడు.నిజమైన జ్ఞానం భగవదనుభూతి వలన వస్తుంది. తదన్యమైనది జ్ఞానమే కాదు. కేవలం చదువుకున్న పండితుణ్ణి నేను గౌరవించలేను..భగవద్భక్తి పొంగిపొరలే హృదయం కలవారినే నేనారాధిస్తాను..అతడు న్యూన కులానికి చెందినవాడైనా ,అతని పాదధూళిని పరమ పవిత్రమైనదిగా స్వీకరించగలను.ఎవరు హరి ,దుర్గ .అన్న దివ్యనామం వినగానే స్వేదము ,ఆర్థత చెందుతారో అట్టి భక్తి చిహ్నములు కలవాడి నిస్సందేహంగా దైవస్వరూపమే..అట్టివార్తి ఉనికి చేతనే ప్రపంచమంతా పావనమవుతుంది. మనం బొత్తిగా వ్యర్ధజీవులం.

నిరర్ధకంగా మనం సిరిసంపదల కోసం తపిస్తాము గాని నిజమయిన శ్రీమంతుడెవరో ఆలోచించము. ఈప్రపంచము లో ఎవరైతే భగవద్భక్తి మొదలయిన వెలలేని సద్గుణ సంపదలు కలిగియుంటాడో అతడే శ్రీమంతుడు. అతడితొపోలిస్తే మహామహారాజులు కూడా బిచ్చగాళ్ళే . అటువంటి సంపదను కోల్పోయి కూడా ఎలా బ్రతుకుతున్నామా అన్నదే ఆశ్చర్యం .!

పరీక్షలు సమీపిస్తున్నాయని మనం ఆందోళన చెందుతాము గానీ ,అనుక్షణమూ మనము పరీక్షింపబడుతున్నామని గుర్తించము .మనము భగవంతుని ఎదుట విచారణకు గురి అవుతున్నాము. మనధర్మం ఎదుట పరీక్షింపబడుతున్నాము. విద్యాలయాలలో ని పరీక్షలు చాలా అపప్రధానాలు- అశాశ్వతాలు కానీ ఆ యితర పరీక్షలు శాశ్వతమైనవి. వాటి ఫలితాలనుఈ జన్మలోనో రాబోయే జన్మలోను కూడా అనుభవించాలి.
[నేతాజీ లేఖలనుండి]



1 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల August 17, 2009 at 8:01 PM  

కరెక్ట్ గా చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP