ఎంతవగచినా !ఏమితలచినా !జరిగేదీ నీచిత్తమే స్వామీ![నన్ను సికిందరాబాద్ పంపినది ఇందుకా!]
>> Monday, May 25, 2009
మనం ఎంత తలచుకున్నా కొన్ని కార్యక్రమాలు మనాలోచనలకు మించి ,మన మనమేసుకున్న ప్రణాళికను తోసిరాజని ఎవరో అజ్ఞాత శక్తి నడుపుతున్నట్లుగా సాగుతుంటాయి. మనమేమో ఆశ్చర్యపోతుంటాము. ఆదివ్యశక్తి సంకల్పానికి అనుగుణముగానే పనిచేస్తున్నామే గాని మనమేధస్సు నిర్ణయాలప్రకారం కాదనే విషయమ్ నిదానంగాగ్రహిస్తుంటాము.
హనుమత్ రక్షాయాగము మొదలు పెట్టినప్పుడు,గ్రామ రక్షణకొరకు పీఠము జరిపే సామూహిక హనుమదభిషే
కములను జంటనగరాలలో ని ఆని హనుమన్మూర్తులకు ఏకకాలం లో జరపాలనే తీవ్ర ఆకాంక్షతో హైదరాబాద్ వచ్చి చాలాప్రయత్నం చేశాను.అక్కడ నివాసమున్న సకలజనులకు విరోధినామ సంవత్సరాన ముంచుకొస్తున్న వ్యాధి, పీడలు ప్రమాదాలనుండి రక్షణకల్పించాలని స్వామిని వేడుకుంటూ చేసే క్రతువిది. .కాని ఫలితం శూన్యము. కనీసము ప్రోత్సాహము కూడా లేదు. ఇక్కడ నేను చేపించాలి అనే అహం మనసు లోతు పొరలలో ఎక్కడో మినుక్కుమినుక్కు మంటున్నది. అంతే స్వామి నవ్వుకున్నాడు .అవునా నీవు చేపించగలసమర్ధుడవా ? ఏదీ ప్రయత్నించుఅని స్వామి నాశక్తికి పరీక్ష పెట్టాడు. అదెంత అల్పమైనదో అర్ధమైనది , మన సొంత తెలివితేటలేవీ పనిచేయవని తేలి పోయినది.
ఈపాఠాలు మాబాస్[ఆంజనేయ స్వామి వారు] కాస్త ఒల్లు పొంగి అతికి పోయినప్పుడలా చెపుతుంటారు కనుక అర్ధమైపోయినది. చేసే పని ఆయనమీదకాకుండా నామీద వేసుకోవటం ఎంతబుద్దితక్కువపనో అని.
ఇక యాగమై పోయినది. ప్రసాదాలు పోస్ట్ లో పంపుతున్నాము. కాని హఠాత్తుగా సికిందరాబాద్ వెళ్ళి తాడిబందు ఆంజనేయ స్వామి ఆలయం లో పంచాలని అది చేరవలసిన కొందరు అక్కడికొస్తారని మనసుకు సంకేతాలు అందుతున్నాయి. నేను వస్తున్నాని మన బ్లాగర్ సతీష్ కు ఫోన్ చేశాను .ఆకుర్రవాడైతే బ్రహ్మచారి కనుక ఇబ్బంది లేదని సంసారుల ఇల్లలోకి హఠాత్తుగా వస్తున్నామని చెబితే ఏదన్నా ఇబ్బంది పడతారని ఆలోచననాది. ఏంపర్వాలా ! మనకు హైదరాబాద్ వెళ్లినా వసతికి ఢోకాలేదు అనే కాస్త గర్వం కూడా వచ్చినట్లున్నది ,ఇక్కడాఒక లీల చూపాడు. మన పలకా బలపం బ్లాగర్ సత్యప్రసాద గారు మధ్యప్రదేశ్ నుంచి వారి నాన్నగారికి ఫోన్ చేసి మాశ్టర్ గారు హైదరాబాద్ వస్తున్నారని చెప్పారట . ఆయన గుంటూర్నుంచి హైదరాబాద్ ఎప్పుడొచ్చారో నాకు తెలియదు.యాగానికి మధ్యలో ఒకసారి వచ్చివెళ్ళారు. మాఆవిడ బయలుదేరేటప్పుడు అడగనే అడిగింది .ఏమండి ఆ హైదరాబాద్ లో స్నానాలు జపాలు ఎలా కుదురుతాయి అని. మనకేం చాలామందివున్నారు అని గర్వంగా అన్నాను , అన్నమయ్యసినిమాలో లక్కమాంబగారి టైపులో ఆవిడ ఆ ఏమోలెండి ! రైల్వేస్టేషనో. బస్టాండులోనో కాకుండా చూసుకోండి .లోకజ్ఞానం లేనిదాన్ని ...... అని .అన్నది. గతుక్కుమన్నది మనసు. ఏమిటె నీశకునం చల్లంగుండా.అనుకునిబయలుదేరాను. నావన్నీ హడావుడి ప్రయాణాలే ఎప్పుడు బయలుదేరుతానో? తీరా బయలు దేరాక వెళతానోలేదో ఇంట్లోవాళ్ళకి అర్ధం కాదు.నాకు కూడా
.
తీరా సికిందరాబాద్ లో దిగాక ఫోన్ చేస్తే , పాపం ఆపిల్లవాడు రాత్రి నాలుగుగంటలదాకా పనిచెసి నిదరమత్తులోనే ఫోన్ ఎత్తి ఆటో లో వెస్ట్ మారేడ్ పల్లి పోలీస్ స్టెషన్ దగ్గరకు రండి అక్కడుంటాను అన్నాడు. ఆటోవాడు కూడా పొద్దున్నే ఎవడు మీటర్ మీదవస్తాడు అని పాపం ధర్మంగనే అడిగి ఏబైతీసుకుని నామానాన్ నన్నొదిలేసి వెళ్ళాడు.ఇంకా తెల్లవారలేదు. ఇక ఫోన్మీద ఫోన్లు ఎన్నిసార్లు చేసినా రింగవుతుందేగని సమాధానం లేదు. పావుగంట గడిచాక గాని అర్ధం కాలేదు నాకు ఏరా! నీపరిచయాలు నీతెలివితేటలే నిన్ను నడుపుతాయా అని మా బాస్ వెక్కిరిస్తున్నారని.బుద్దొచ్చిందిస్వామి నాపూజ చేసుకుని ఆలయానికి వెల్లెసరికి ఆలస్యం కాకూడదు. ఏడుగంటలకల్లా అక్కడకు వెళ్లాలి దారి చూపమని చెంపలువేసుకున్నాను. వెంటనే సత్యప్రసాద్ వాల్లనాన్నగారు రామ్మోహన్ శర్మగారు గుర్తుకొచ్చారు ,ఆయనకు ఫోన్ చేశాను .చిత్రమేమిటంటె ఆయన ఉన్నది కూడా మారేడ్ పల్లి లోనే ఆయనకూడా మాస్టర్ గారూ మీరు వెస్ట్ మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు రమ్మన్నాడు . ఆయన అక్కడకు వచ్చి నన్ను తమఇంటికి తీసుకు వెళ్ళి ఆయన వారి వదినగారు పెద్దవారైనా చాలా ఓపికతో నాకు అన్నీ సమకూర్చారు.
ఆయన కూడా చిన్నతనం లో వెల్లటూరులో వారి నాన్నగారితోపాటు స్వామి సేవచేసినవాడినని ,నన్ను కూడా ఈ కార్యక్రమం లో భాగం చేశారని నాతో పాటు వచ్చారు. బయలుదేరేముందు పదిగంటలు దాటేదాకే ఆలయం లో వుంటామని ఆలోపల ఎవరిని స్వామి పంపితే వారికి మాత్రమే ఇస్తామని చెప్పుకున్నాము .
ఆలయానికెళ్ళి దర్శనమ్ చేసుకుని ఒకపక్కన అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాము. విషయం తెలిసినవారు బ్లాగర్లేకాక వారిద్వారా తెలిసినవారు ఒక్కొరొక్కరుగా వచ్చి పోతున్నారు.అమెరికానుంచి సూర్యనారాయనగారు చెప్పగా వాల్ల తమ్ముడు.చక్రవర్తిగారు సతీ సమేతంగాను ఇలా తెలిసినవాల్లు వచ్చి రక్షలు తీసుకుంటున్నారు. ఇది గమనించి వచ్చి అడిగినవారికి ,లేదా నాఅకు ఇవ్వుఅని మనసుకు స్పందనకలిగితె వాల్లకు ఇస్తున్నాను. ఒకతను నాపక్కన కూర్చున్నాడు అతనికివ్వాలని మనసులో బలంగా నిపించి ప్రసాదం ఇచ్చాను.రోజుకు పదకొండుసార్లు చాలీసా పారాయణం చెస్తూండు నీ సమస్యతీరుతుంది అను అనాలోచితంగా చెప్పాను. ఆయనవెంతనే సంతోషించి స్వామి నాపట్ల స్వామి కరుణవున్నది అని ఆనందంగా తన్మయుడయ్యాడు. ఏమిటయ్యాసంగతి అని అడగగా ., నాపేరుశ్రీనివాసరెడ్ది సార్. గ్రనైట్ మార్బల్స్ వ్యాపారం సాహసించి పెట్టాను ,కాని దిగాక చాలా కష్టంగావున్నది. ఐదువారాలు స్వామికి ప్రదక్షణాలు తిరిగితే ఆయనే మార్గం తెలియజేస్తాడని ఒక పెద్దాయన చెప్పగా ప్రదక్షిణలు చేస్తున్నాను. ఈరోజు ఐదు శనివారాలు పూర్తయ్యాయి. నేను ప్రదక్షిణలు చెసికూర్చోగానే అయాచితంగా స్వామి ప్రసాదమిచ్చి ఏమిచేయాలో చెప్పారు, అని వివరించాడాయ. నీభక్తుల మేలు చేకూర్చటమ్ కోసం నన్నొక పరికరంగా వాడుకున్నావు చాలుస్వామీ అని నమస్కరించాను.
అలా వస్తూనే వున్నారు. వారి సమస్యలు తీర్చడానికి రక్షలు ఇప్పిస్తున్నాడనే నమ్మకం నాకు బలపడిపోతునది. సమయము అయిపోతున్నది. శర్మగారూ ! ఈపని అయిపోతున్నదిగానీ అభిషేకాలవిషయం ఎవరిని లింక్ చేస్తాడోతెలియటం లేదు అని మేము మాట్లాడ్తూవుండగనే ఒకాయన వచ్చి కూర్చుని ఎంతో మధురంగా స్వామి గానామృతంతో సేవిస్తున్నాడు. ఆయనకు రక్షలివ్వగానే వివరాలడిగాడు. స్వామి అనుగ్రహం కలిగి ఆపదలుదాటాలంటే ఏమిచేయాలో వివరిస్తున్నాడు. నాపక్కనున్న శర్మగారు ,ఆంజనేయ స్వామి అభిషేకాల ఆలోచనగురించిి చెప్పాడు. తనపేరు సుబ్రహ్మంణ్యం గారని తానొక హనుమదుపాసకుడనని తెలుపటమేగాక ,మాకు ఆప్తులు గురు సమానులైన అన్నదానం చిదంబరశాస్త్రిగారి గూర్చి చెప్పారు. నేను కూడా చిదంబరశాస్త్రి గారి మిత్రవర్గము లోవాడినని తెలిసి ఆయన సంతోషం తో మరికొన్ని వివరాలు చెప్పారు.
సమయము పది దాటగనే మేము ఆలయ కమిటీ చైర్మన్ గారిని కలిసి వివరాలు చెప్పగా ఆయన మాకు సహకరించగల ఈ కార్యక్రమన్ని నిర్వహించగల ఒక ప్రముఖునికి ఫోన్ చేసి విషయం చెప్పారు ,అతను ఒకపదినిమిషాలు ఆగండి పూజ పూర్తిచేసుకుని ఆలయం దగ్గరకు వస్తానని మాటిచ్చాడు. నేను బయటకు వస్తుండగా చెన్నైనుంచి వెబ్ దునియా వెంకటేశ్వర్లుగారు పంపగవచ్చిన వారి మిత్రుడు వచ్చి స్వామి సన్నిధిలో రక్షలివ్వమని అడిగాడు, నాకిచ్చిన సమయము అయిపోయినదికదా నుకుంటూనే లోపలి కెల్లి ఆయనకు రక్షలిస్తుండగా యమకింకరులవలె ఇద్దరు అటెండర్లు వచ్చి .ఏమిటి ఇక్కడదుకాణం పెట్టావు లే అని గదమటం మొదలెట్టారు. పాపం శర్మగారు వివరించబోయినా వారు వినిపించుకోవటం లేదు. వాల్ల కల్లకు నేనుచెట్లకింద తాయెత్తులమ్ముకునే మోళీవాని లాగా కనపడివుంటాను.మరలావచ్చినందుకు నువ్వేనన్ను ఇక్కడనుండి తరుముతున్నావులే స్వామీ అనుకుని వారికి సర్దిచెప్పి బయటకు వచ్చాము.తరువాత్ బయటకు కూడా వచ్చి న వారికి రక్షలనిచ్చి ,మాటప్రకారం వచ్చిన ఆప్రముఖునితో మాట్లాడగా ఆయన సంతో షించి తనసహాయం తప్పనిసరిగా అండజేస్తానని ఈ కార్యక్రమము గ్రౌండ్ వర్క్ కే నెలపడుతుంది కనుక స్మయం కావాలన్నారు..
ఆతరువాత సాయంత్రము ఆదివారము కూడా మరికొందరిని కలసి సోమవారం ఉదయానికల్లా పీఠానికి చేరుకున్నాను.
మన ప్రయత్నాలేవీ కావని ఇవి తన సంకల్పము తోనే జరుగుతున్నవని మరొకసారి సోదాహరణగా స్వామి నాకు పాఠం నేర్పారు.
ఈ పాట నాకు గుర్తొచ్చింది. ఎంతవగచినా ఎమితలసినా జరిగేది నీ చిత్తమే .......
7 వ్యాఖ్యలు:
మీది హరిసేవ. మాది మానవ సేవ. ఏ సేవ గొప్పది?
Abou Ben Adhem
Abou Ben Adhem (may his tribe increase!)
Awoke one night from a deep dream of peace,
And saw, within the moonlight in his room,
Making it rich, and like a lily in bloom,
An Angel writing in a book of gold:
Exceeding peace had made Ben Adhem bold,
And to the Presence in the room he said,
"What writest thou?" The Vision raised its head,
And with a look made of all sweet accord
Answered, "The names of those who love the Lord."
"And is mine one?" said Abou. "Nay, not so,"
Replied the Angel. Abou spoke more low,
But cheerily still; and said, "I pray thee, then,
Write me as one who loves his fellow men."
The Angel wrote, and vanished. The next night
It came again with a great wakening light,
And showed the names whom love of God had blessed,
And, lo! Ben Adhem's name led all the rest!
-- James Leigh Hunt
హరిసేవగా మానవసేవ
హరిసర్వాంతర్యామి . కనుక మీరుచేసినా నేను చేసినా అది జీవజాలానికి మేలుచేస్తే అది హరిసేవయే .ఇందులో సందేహమేమీ లేదు.
ippati kaina a satish badyata rahityam ,chanchala swabavam , yeduti vanni vennu potu podavadam, itagadu vere blagars ni vimarsistu kotta blags open cheyyadam.poni lendi mi dwara oka nijam bayata padindy .akkadaki mottam yenta mandi vachharo , vallallo mana blogers yevaro rasi vunte bavundedy .
Post a Comment