రేపుసికిందరాబాద్ తాడుబందు ఆంజనేయ యం లో హనుమత్ రక్షాయాగం లో పూజించిన రక్షలనందుకోండి.
>> Friday, May 22, 2009
రేపుసికిందరాబాద్ తాడుబందు ఆంజనేయ యం లో హనుమత్ రక్షాయాగం లో పూజించిన రక్షలనందుకోండి.
ఈరాత్రికి బయలుదేరి హైదరాబా ద్ చేరుకుని స్వామి వారు కొలువైయున్న మహాశక్తివంతమైన తాడుబందు ఆలయం లో రక్షాయాగం లో పూజించిన హనుమత్ రక్షలను భక్తులకందజేయనున్నాము. దీనికి కారణమున్నది.
యాగానంతరము కోరినవారికి పోస్టద్వారా రక్షలు పంపుతామని బ్లాగులో చెప్పాము. సహజంగా నాకు ఏకార్యక్రమము చేయాలన్నా శుక్రవారము పూజలో అమ్మ ఆజ్ఞ మనసులో ప్రేరణ గా అందుతుంది .ఈరోజు పూజలో వున్న నాకు హైదరాబాద్ వెళ్ళి తాడుబందు హనుమదాలయం లో 1008 రక్షలు పంచితే ఇవి అందవలసిన స్వామివారి భక్తులకు చేరుతాయని సంకల్పము కలిగినది. ఎందుకిలా?
మాచిన్నప్పుడు మా జేజినాయన గారు [నాన్నగారి తండ్రి] పూజ అయి పోయాక శనివారం కొబ్బరిముక్కల పళ్ళెం ఇచ్చి బజారులో నిలబడి వచ్చి పోయే వారికందరకు పంచిపెట్టమనే వారు .అప్పుడదొక సరదా . కాని పెద్దాయ్యాక తెలిసినది దానిలో ఆంతర్యం .భగవప్రసాదాన్ని ఒంటరిగా కాకుండా పదిమందితో కలసి పంచుకోవలనే సత్యాన్ని.
స్వామి వారి అనుగ్రహం తో ఈ యాగాన్ని పూర్తి చేసి పొందిన స్వామి వారి ప్రసాదాన్ని కూడా పదిమందికి పంచాలనేది స్వామి వారి ఆనతనుకుంటున్నాను. యాగములో పూజించి శక్తివంతమైన రక్షలను ,యజ్ఞశేషాన్ని [విభూతిని ] తాడుబందు ఆలయం లో పంచాలన్నది నాకు అందుతున్నా ఆజ్ఞగా భావిస్తున్నాను.
మరి హైదరాబాద్ లోనే ఎందుకు పంచాలి.? దానికి కారణాలున్నట్లున్నాయి.
మొదటిది .దీక్షాధారణ అయిపోగానే నేను ఏదైనా ప్రముఖ హనుమత్ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చెసుకుని వస్తాను. ఈసారి కుదరలేదు. 2000 సంవత్సరం లో బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి పర్య వేక్షణలో జరిగిన కోటి హనుమాన్ చాలీసా మహాయాగానికి మమ్మల్ని రమ్మనిపిలచారు, కార్యక్రమము తాడుబందుఆలయం లో అని చెప్పారు. కానీ తీరా కార్యక్రమము మొదలయ్యే సమయానికి అక్కడ ఆలయ కమిటీ వారికి యాగనిర్వాహకులకు కుదరక కార్యక్రమాన్నిసికిందరాబాద్ లోని స్వరాజ్ ప్రెస్ లో ఏర్పాటుచేశారు. ఆ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించలేక పోయాము.తరువాతెప్పుడు వచ్చినా పనులవత్తిడివలన హడావుడిగా రావ టం తోస్వామిని దర్శించలేదు.
కనుక ఇప్పుడు సమయమొచ్చి స్వామి దర్శనానికి రమ్మని పిలుస్తుండవచ్చు.
రెండవది యాగము నకు సహకరించిన ,ప్రచారము చేసి పదిమందికి తెలియబరిచిన వారు ఎక్కువమంది ఇక్కడున్నారు. వారిలో చాలామంది యాగమునకు వారి వృత్తులవలన పనులవత్తిడివలన రాలేక పోయారు. వారందరకు స్వామి వారి సన్నిధిలోనే రక్షలు అందజేయాలనే సంకల్పముకావచ్చు.
ఇక స్వామి వారి ఆంతరింగిక భక్తులు ఈకార్యక్రమము గూర్చి తెలియకున్నా ఈ రక్షలు అందవలసి వున్న వారెవరికో ఇవి అందజేయవలసిన బాధ్యత మనమీదున్నట్లున్నది.
ఇన్ని కారణాలున్నయనుకుంటున్నాను నా మనసుకు స్పురించిన సంకేతానికి. అదీగాక మొన్న ఎన్నికల హడావుడి వున్నందున జంటనగరాలలో వున్న స్వామి వారి అన్ని ఆలయాలలో సామూహిక అభిషేకాలు జరిపించే కార్యక్రమం గూర్చి కొందరు భక్తజనులతో సంప్రదించాలనుకుంటే కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందేమో చూడాలి.
ఇక నేను రేపు ఉదయం ఐదుగంటలకల్లా హైదరాబాద చేరుతాను.అక్కడనుండి ఒక బ్లాగమిత్రుడు సతీష్ గారి రూమునకెళ్ళి స్నానాదికాలు పూర్తిచేసుకుని ఏడుగంటలకల్లా ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుని ఏదో ఒక చోటకూర్చుని అనుష్ఠానం చేసుకుంటుంటాను . స్వామి వారు ఎవరిని పంపితే వారికి వెయ్యిన్నెనిమిది రక్షలు పంచినదాకా కూర్చుని ఆతరువాత వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇది తెలిసిన బ్లాగర్లు కాని ,వారిద్వార తెలుసుకున్నవారు కాని లేదా స్వామి ప్రేరణద్వారా వచ్చేవారికి గాని అక్కద అప్పటికప్పుడు అడిగినవారికి ,రక్షలు పంపిణీచేస్తాము. నేను పసుపు రంగు వస్త్రాలు ధరించి వుంటాను. నానంబర్ 9948235641 . శనివారము అదీ మాసశివరాత్రి అందులోనూ ఏబదినాలుగురోజులు పారాయణాదులు సాగించి పూజించిన రక్షలు స్వామి సన్నిధిలో అందుకోవటము. ఎవరికి చెందాలో వారు వస్తారు. కనుక మీ రు మీమిత్రులకు తెలిసినవారికందరకు ఈవిషయము చెప్పగలరు. ధన్యవాదములు
స్వామి వారిసేవలో
దుర్గేశ్వర
2 వ్యాఖ్యలు:
will try
"ఎవరికి చెందాలో వారు వస్తారు"
మీకు చెందాలనుకుంటే తప్పక వెళ్ళాల్సిందే
Post a Comment