పత్నీం మనోరమాం దేహి మనో వృత్తాను సారిణీం [ ఈ ప్రార్ధన ఫలించింది ]
>> Monday, May 25, 2009
ఈరోజు మాపెళ్ళి రోజు .భగవత్ సేవలో తన సంపూర్ణ సహకారాన్నందించగల సహచరిని నాకు అమ్మ ప్రసాదించి నేటికి పద్దెనిమిది సంవత్సరాలు దాటి పందొమ్మిదవ సంవత్సరం లో కడుగు పెట్టాము. నాకోపాన్ని తన సహనం తో గెలుస్తూ ,పట్టణం నుంచి వచ్చానన్న అహం లేకుండాఅవసరమైన సమయం లో నాతో పాటు శ్రమనుకాదు కాదు నాకంటే ఎక్కువగా కష్టపడుతూ గడ్డికోసి పాలు పిండి ,పిల్లలకు ఫాఠాలు చెప్పి ,నా పూజలకు అన్నీ సమకూరుస్తూ.వచ్చిపోయేవారికందరకు ఎప్పటికప్పుడు మంచీమర్యాదా చూస్తూ మాజీవిత నౌకకు తానే ప్రధానమైన ,రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలనిచ్చి నా అర్ధాంగి జయప్రద తానే అన్నీ అయి నడుపుతున్నది. ఏ అర్ధరాత్రి ఎవరొచ్చిన విసుక్కోకుండా వండివడ్డించి ఆకలితీర్చి ,నా ప్రయత్నాలకు బాసటగా నిలుస్తున్న తనకు నేను జన్మజన్మలకు ఋణపడివుండవలసి వస్తుందేమో.
"
పత్నీం మనోరమాందేహి మనోవృత్తానుసారుణీం . అని నేనుప్రార్ధించిన కోరికను అమ్మ తీర్చినదనుకుంటాను. మానాన్న గారు చెప్పేవారు ,ఒరే ! అన్నిసంపదలకన్నా అనుకూలవతి అయిన భార్యదొరకటం గొప్ప అదృష్టం తో కూడిన సంపదరా, అని. లక్షల రూపాయల కట్నాలిస్తానన్నా కాదని ఆయన ఏరి కోరి చేసిన వివాహం నాది. పెద్దవాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు కనుకనే వివాహవిషయం లో వారి అభిప్రాయాలకు విలువనివ్వటం క్షేమము నేటి యువత.
పొద్దుటె హైదరాబాద్ నుంచి రాగానే ఈరోజుమన పెళ్ళిరోజని అవిడ నాకు చెప్పినదాకా గుర్తురాలేదు. వెంటనే పందొమ్మిది సంవత్సరాలకు గుర్తుగా పందొమ్మిది జ్యోతులను వెలిగించి అమ్మవారికి విశేష నైవేద్యాలు సమర్పించి ఇంటికొచ్చిన అతిథులకు కూడా వాటిని పంచాము. ఎవరన్నా వస్తారేమో అన్నం తినే సమయానికని ఎదురు చూసాము కానీ ఈరోజెవరూ రాలేదు .అదొక్కటే లోపం .ఇలానే అమ్మసేవలో భగవద్ భక్తుల సేవలో సాగిపోయేలా ఆశీర్వదించమని పెద్దలందరికీ నమస్కరిస్తున్నాము.
6 వ్యాఖ్యలు:
పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకూ ...మీ శ్రీమతిగారికీ ....
అదృష్టవంతులు. ఆ తల్లి మీ దంపతులను, మీ పిల్లలను సదా బ్రోచుగాక.
వివాహ దిన శుభాకాంక్షలు.
అమ్మగారి దగ్గర ఆశీస్సులు తీసుకుందానుకున్నాను కుదరలేదు
మీకు, మీ సహచరికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.. ఆ అమ్మ దయ మీ కుటుంబంపై సదా ఉండుగాక..
its late ,howvr wsh u hapy margday
Happy Aniversary.
Post a Comment