బ్లాగ్లోకం లో ప్రవేశించి సంవత్సరం పూర్తయింది . ఏమి సాధించానిక్కడ?
>> Tuesday, May 26, 2009
భగవత్ సేవాకార్యక్రమాలలో మునిగివుండే నాకు భక్తజన సేవాకార్యక్రమం లో భాగంగా బ్లాగ్ లోకం లోకి ప్రవేశించి సంవత్సరకాలం పూర్తయింది.. నిరంతరం జగజ్జనని సేవలో మునిగి వుండే నేను సమయాభావంవలన నాకు ఆసక్తి గల పత్రికారంగం నుంచి కూడా తప్పుకున్నాను. కాని నాకు అలవాటైన ఈ అభ్యాసం భగవత్సేవా కార్యక్రమాలలో ఒక భాగమయ్యేందుకేమో ఇక్కడకు లాక్కురాబడ్డాను. ఇది ఆ జగన్నాటక సూత్రధారి లీలావిలాసం లో ఒక భాగము.ఎందుకంటే ఈ జగన్నాటక రంగం లో ఎవరి పాత్రను ఎక్కడ పోషించాలో ఆయన ఇఛ్చాను సారం సాగుతుంటుంది.
ఇక్కడేమి చేయగలిగాను?
...............................................
ఎందరో మంచిమనసుగల మనుషుల అభిమానాన్ని పొందగలిగాను.నా సిధ్ధాంతాలు వ్యతిరేకించేవారి నుండికూడా వ్యక్తిగతంగా గౌరవించబడ్డాను. .ఇది భౌతిక విషయాలగూర్చి.సమశ్సత్రౌచ మిత్రౌచ తథా మానావ మానయో అని గీతాచార్యులు చెప్పిన స్థితికి చేరుకోలేదుగాని ఆదారిలో కొద్దిదూరం పయనించగలిగాను .అందుకు ఇక్కడ నాకు కొన్ని అభ్యాసాలు లభించాయి. ఇది నాకువ్యక్తిగతం గా జరిగినమేలు. తిట్టినవారి పట్ల పొగిడినవారిపట్ల ఎలా సమస్థితిని అలవర్చుకోవాలో నేర్చుకోవటానికి ఇదొక అవకాశం.
ఇక అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న వారికి మన మహర్షులు చూపించిన దివ్య మార్గాలలో నాకు సాధ్యమైనంతవరకు పరిష్కారాలు సూచించాను .ఆచరించిన ఎందరో తమ సమస్యలను భగవదనుగ్రహం తో పరిష్కరించుకున్నామని తెలియజేశారు. అది వారి భక్తి కి,భగవంతుని ప్రేమ కు నిదర్శనము మాత్రమే. నాకు కూడా ఆయన లీలా ప్రదర్శనలో ఒక పాత్రనిచ్చినందుకు జన్మ ధన్యమయినదనుకుంటున్నాను.
ఈ సంవత్సరము భక్తజనుల శ్రేయస్సుకార్తీకమాసములో నలభై రోజులపాటు కోటి పంచాక్షరీ మహాయాగాన్ని ,ఏబది నాలుగురోజులపాటు మొన్నటివరకు సాగిన హనుమద్రక్షాయాగాన్ని ,నడపటానికి నావెనుకవుండి తమ ఆర్ధిక ,హార్ధిక సహాయాలనందించి న భగవద్భక్తులు భాస్కర్ రామరాజు,ఉమాశంకర్ రామరాజు, ఉప్పుటూరి శ్రీనివాస్ ,చెరుకూరి దుర్గాప్రసాద్.జడ్చర్ల శ్రీనివాస్ ,డాక్టర్ రజని , వెంకటసూర్యనారాయణ ,విజయమోహన్ లాంటి సహృదయుల ఋణం తీర్చు కోలేనిది. అలాగే భారతీయ యువతలో వుండవలసిన కార్యసాధకత ,సదాచారము ,సుశీలతలతో నిజమైన భారతీయ యువతకు ప్రతిరూపాలుగా కనిపించే చిరంజీవి రంజిత్,నాగప్రసాద్ ,మనోహర్ లాంటిఎంతోమంది యువత అభిమానాన్ని సంపాదించు కోగలిగాను .మాశ్టారూ అని అభిమానించబడ్దాను. బ్లాగ్ లోకం లో దిగ్గజాలైన తాడెపల్లి, చదువరి, వంశీ,విహారి సుజాత ,శిరీష ,దూర్వాసుల ,నరసింహ , మధురవాణి ,బొల్లోజు బాబా,జాన్ హైడ్ ఇలా వీరందరి అభిమానానికి పాత్రుడనయ్యాను.
నాబ్లాగును అందంగా తీర్చిదిద్దిన జ్యోతిగారికి , దీనిని పదిమందికి దగ్గరకు చేర్చిన వీవెన్ గారికి,జల్లెడవారికి ,బ్లాగ్ కుట్ గారికి తెలుగురత్న శివకు బ్లాగర్ .కామ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నానమ్మకాన్ని మరింతగా సానరాయి పై పెట్టి చూసుకునేలా ప్రోత్సహించిన విమర్శకులు కత్తిమహేష్ గారి లాంటివారికి నన్ను తీవ్రపదజాలంతో తిట్టిన నా సహనాన్ని పరీక్షించుకోగలిగే అవకాశం ఇచ్చిన రసూల్,మార్తాండ గారిలాంటి వారికి వేలసార్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీరందరి పట్ల నాకు మనసులో మిత్రభావమే తప్ప ఏమూలనా ద్వేషభావం లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను." ఎదుట ఎవ్వరు లేరు అంతావిష్ణుమయమే వదలక హరిదాస వర్గమైనవారికి " అని సందేహం లేకుండా నమ్ముతున్నాను.
ఇకపై ఏమి చేయాలి?
......................................
భక్తులకు సహాయపడటము భగవంతునకు అత్యంత ప్రీతి పాత్రము. కలిప్రభావము వలన,జాతక,జన్మ దోషాలవలన మార్గం కానరాక తల్లడిల్లుతున్న,బాధలతో సతమతమవుతున్నవారికి,వారికి నేను తెలుసుకున్నంతలో మహాత్ములు చూపిన మార్గం లో పరిష్కారాలు చూపించటము . నిరంతరం భగవత్ కార్యక్రమాలద్వారా భక్తజనులను వాటికి అనుసంధానించటము ద్వారా వారిలో భగవన్నామస్మరణను జరిగేలా ప్రయత్నించటము నేనెన్నుకున్న సేవామార్గము. ఈనాప్రయతనములో మేలు జరిగితే అది మహాత్ములు ప్రసాదించిన దివ్యవిద్యవలన కలిగినదని ఏదన్నా వ్యతిరిక్తముగా జరిగితే అది పూర్తిగా నా అజ్ఞానము వలన జరిగిన పొరపాటని మన్నించప్రార్ధన.
సాగుతున్న ఈ హరిసేవా మార్గములో ఈమజిలీకి నన్ను పంపిన ఆ పరమాత్మకు ఈదారిన నడుస్తున్న భగవద్భంధువులందరికీ మరొకసారి నానమస్సుమాంజలులు సమర్పించుకుంటున్నాను.
మానవజాతికి మార్గదర్శనం చేసిన జగద్గురువులు పుట్టిన ఈ పుణ్యభూమిలో ,పరమాత్మ పాదస్పర్శచే పునీతమైన ఈ భారత మాత ఒడిలో పుట్టి ,మానవత్వానికి పరిపూర్ణత్వం పొందే మార్గాన్ని మహర్షులు బాగానడిచి నలిగిన దారిని చూపించగల వారసత్వసంపదను వారసత్వంగా పొంది ధన్యత పొందిన నా భాగ్యాన్ని నేనే పొగుడుకుంటున్నాను."చాలదా బ్రహ్మమిది సంకీర్తనం" అన్న అన్నయ్య అన్నమయ్య పదసంకీర్తన చేసుకుంటూ
భక్తజనదాసుడు
దుర్గేశ్వర
.
14 వ్యాఖ్యలు:
Congratulations on completing one year.
I have been following your Blog but I didnot post any comment. I think I should have done this before.
సర్వేజనా సుఖినోభవంతుః
దర్మవలంబన విషయం లో కృషికి దన్యవాదాలు సార్
ఇది ఇలాగే కోనసాగాలని అశిస్తున్నాను
మీ వివాహ మహోత్సవ రోజు,బ్లాగు ద్వారా "హరిసేవ" ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాలు ఒకటే కావడం ఆనందాన్ని కలిగిస్తోంది. మీరిలాగే హరిసేవలో మమేకమై మమ్మల్నందర్నీ ఏకం చేసి భగవంతునివైపు నడిపించాలని మనస్పూర్థిగా కోరుకుంటూ....
వార్షికోత్సవ శుభాకాంక్షలు ..
ఎంత గొప్ప సంస్కారవంతమైన హృదయం మీది. మీరు బ్లాగ్ లోకానికి ధర్మపథ నిర్దేశకులు. చాలా బాగా మీ బ్లాగేడాదిని సమీక్షించుకున్నారు.
మాష్టారూ
అభినందనలు
శుభాకాంక్షలు ..
ఎందరో..మహాను భావులు ...అందరికీ వందనము
Congratulations and keep going Sir!!!
తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు దుర్తేశ్వరగారూ, మీ ఆధ్యాత్మిక పయనం నిరాఘాటంగా కొనసాగాలని కోరుకుంటున్నా.
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా tadbund ఆంజనేయస్వామి ఆలయం లో మా అమ్మ గారి తో సహా వచ్చి రక్షాబంధనం పొందిన కొద్దిమంది అద్రుస్తవన్తుల్లొ నేను ఒకణ్ణి, మిమ్మల్ని పొగిడిన వాళ్ళని , విమర్స్చించిన వాళ్ళనే కాకుండా మాలాంటి మౌన అభిమానుల్ని కూడా గుర్తు పెట్టుకోగలరు , మరిన్ని సంవత్సరాలు బ్లాగ్లోకం లో పరిమళాలు వేదజల్ల గలరు .
నేను సైతం,
వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ పీఠం,మీరు దాన్ని నడిపే తీరూ, అసలు పీఠం నెలకొన్నతీరు మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. అధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలంటే జనానికి దూరంగా వెల్లాల్సిన అవసరం లేదని, జనం మధ్యలో ఉంటూ కూడా నిరంతరం ఆ భగవంతుని స్పృహ కలిగి ఉండవచ్చని అర్ధం చేసుకున్నాము.
wefund
Post a Comment