అమ్మ లీలలలో ఒక తరంగమయి సాగిన తుంగభద్ర పుష్కర యాత్ర
>> Saturday, December 20, 2008
అనుకోకుండా తుంగభద్ర పుష్కరాలకు వెల్లాలని సంకల్పం కలిగినది. భక్తుల గోత్రనామాల్తోనన్నా పూజ చేసి దీపదానాదులు ఇచ్చి పుస్కర కాలం లో గాయత్రీ యజ్ఞము నిర్వహించాలని. విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసి గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకున్న దివ్యస్థలి సంగమేశ్వరం వెల్లాలను కోవటమే విచిత్రమను కుంటే ,ఆ యాత్రను జరిపిన అమ్మ తన లీలా తరంగాలలో మమ్మల్ని ఓలలాడించినది.
హఠాత్తుగా ప్రయాణ మంటారు ఎలా? మా ఆవిడ.నసుగుడు. అదంతే, అవి నా ఆలోచనలనుంచి పుట్టవు గనుక హఠాత్తుగానే వస్తాయిఅన్నాను. నేను.మాష్టర్ గారండీ మేమూ వస్తామని సిద్దమయినది పిల్ల మూక . అందరూ వద్దులే పదవతరగతి వాల్లకు పరీక్షల వస్తాయి తరువాత వాల్లను ఎక్కడకీ తీసుకెల్లలేము ,కనుక వాల్లకు చాన్స్ అన్నాను. అంతే ఇల్లకు పరుగులు పెట్టి పదిమంది పదవతరగతి పిల్లలు తల్లి దండ్రులను అడిగి వచ్చారు. కొద్దిముందుగా మాత్రమే బ్లాగు లో వ్రాసినప్పటికీ. చదివినవారు చాలామంది తమ పేరున పూజ జరిపించమని తమ గోత్రనామాలు పంపించారు. బయలు దేరేటప్పుడు నాకు సంగమేశ్వర క్షేత్రం గూర్చిన పూర్తి వివరాలు తెలియవు. ఆడ పిల్లలను కూడా తీసుకు వెల్తున్నాము.అక్కద అన్ని వసతులున్నాయో లేదో తెలుసా ? తెలియదు . అక్కడకు వెళ్లటం నా సంకల్పము కాదు. కనుక పంపిస్తున్నవారెవరో వారే చూసుకుఁటారు మిగతావి. అన్నాను నేను నా సహజ నమ్మకముతో. బాగుంది ఈయన వరస ......... మా ఆవిడ తన అలవాతైన అనుమానపు ప్రశ్నలతో సనుక్కుంటున్నది. పిల్లలు అన్నీ సర్దారు. వినుకొఁడలో బస్సెక్కి దోర్నాలలో దిగేసరికి సమయము 4 గంటలైనది. ఆత్మకూర్ వరకు వెల్ల టానికి అరగంట వేచిచూసినా బస్సు రాలేదు కాని, గుఁటూరు నుంచి వస్తున్న మహేంద్రా వాల్ల టాప్ లెస్ జీపు ఒకటి వెల్తున్నందున మమ్మల్ని ఎక్కించుకున్నాడు డ్రైవర్. ఇక 10 మైల్లు దాటాక ప్రారంభమయిన అడవి దారిలో పిల్లలు ఒకటే కేరింతలు. ప్రకృతి అందాలలో పరవసిస్తూ అడవిదాటాక వచ్చిన పొలాలలో విరగబూసిన సన్ ఫ్లవర్ అందాలను చూస్తూ ఆత్మకూర్ 6.30 కు చేరుకున్నాము. అక్కడనుండి సంగమేశ్వరం బస్ రడీగావున్నది. ఎక్కాక కొత్తపల్లి అనే మండల కేంద్రములో పోలీసులు బస్ ఆపారు. ఎవరూ రాత్రిల్లు సంగమేశ్వరం వెల్లటానికి వీలు లేదు. అక్కడ ఏవసతులు లేవు కరెఁట్ గాని.వుండటానికి సరయిన వసతులు కల్పించబడలేదు. కనుక మీరు వెనక్కు వెల్లి పొద్దుటే రమ్మని వారిస్తున్నారు. ఇప్పుడు వెనక్కేమి వెళతామండి. అక్కడికే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము అన్న వాల్లు ఒప్పుకోలేదు. మొన్న రాత్రి ఇద్దరికి తేళ్ళు కుట్టాయి. అంత అర్ధరాత్రి అంబులెన్స్ కూడా లేక వాల్లని తరలించటం మాచావు కొచ్చినది. మామాటవిని వెనక్కు పొమ్మంటున్నారు. బస్ డ్రైవర్ ను సంగమేశ్వరం వెల్లవద్దని శాసించారు. ఇంతలో ఒకాయన మా వూర్లో వుఁటారు లెండి .పొద్దునే పోతారని సర్ది చెప్పాడు. ఐతే వీల్ల బాధ్యత నీదేనని అతని అడ్రస్ తీసుకుని బస్ కదలనిచ్చారు.
ఇక ఇక్కడ మొదలైనది అమ్మ లీల .నేనంటే దీక్షలో వున్నాను కనుక సరిపోతుంది. పిల్లల సంగతెలా ?అన్నంతినకుండా వీల్లకెలా నా? అని మనసు లో పీకుతున్నది. వీరికి తోడు ఆత్మకూర్ లో మమ్మల్ని చూసి మరి రెండు కుటుంబాలు వాల్లు బస్ ఎక్కారు. మా అమ్మ కూడా వస్తున్నది మాతో. బస్ ముసలి మడుగు అనే వూరు చేరగానే ఇందాక మమ్మల్ని తమ వూరులో దిగమన్నాయన ఇంకొక గ్రామస్తునికి మమ్మల్ని అప్పచెప్పాదు. వీల్లకు పంచాయతీ కార్యాలయం చూపించు అక్కడ పండుకుంటారు,అని. ఆయన ఒక ముస్లిం సోదరుడు. మమ్మల్ని పంచాయతీ కార్యాలయానికి తీసుకెల్లి అక్కడ సుబ్రపరచి వసతి కల్పించాడు. మీరు ఒక్క పాత్ర ఇప్పించండి. అలానే ఏదన్న కొట్తు చూపమని సరుకుల కోసం అడిగాను. ఆయన నన్ను తన ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ల నాన్న గారికి పరిచయంచేశాడు. ఆయన వయోవృద్దుడు. హజ్ యాత్రను నాలుగుసార్లు చేసిన పుణ్యాత్ముడు. మీలాంటివాళ్ళు రావటమే మా అదృష్టం మీరు వంట చేసుకోవద్దు మా ఆతిథ్యం స్వీకరించాలి అనీ ఆప్యాయతతో పలకరించాడు. అయ్యో ! ఎంతమాట ?పెద్దలు మీ లాఁటీవారిని కలుసుకుని నేర్చు కోవాలని అమ్మ పంపినది మీ ఇంటికని నేను వారికి చెప్పాను. ముక్కూ ముఖం తెలియని మాకు వాల్లు అప్పటికప్పుడు వంట చేసి పంపారు. పాలు కూడా తెచ్చి తీసుకోమని నన్న బలవంతం చేశారు. మా తో వచ్చిన వారితో సహా మా ఆవిడ కూడా ఆశ్చర్య పోయినది. ఈ బాంధవ్యాలను చూసి .గ్రామీణ భారతం లో ఇంకా సజీవం గావున్న ఆప్యాయతలు ధార్మికత, అతిథి సత్కారం సాక్షాత్కరించాయి అక్కడ. మా పిల్లలు జీవితం లో ఒక చక్కని పాఠాన్ని సోదాహరణం గా నేర్చుకున్నారు. నా కైతే ఒక చక్కని ఆథ్యాత్మిక బోధన లభించినది. అది మీతో చెప్పలేను.
ఉదయాన్నే టిఫెన్ లు ముగించుకుని వెలుదురుగాని అని వాల్లు బతిమిలాడుతున్నా వద్దని వారించి వారికి మరొక సారి కృతజ్ఞతలు చెప్పి పొద్దుట వచ్చే బసెక్కి సంగమెశ్వరం చేరాము.
నిజంగా అదొక అద్బుత ఆద్థ్యాత్మిక ప్రవాహం జాలు వారుతున్న సిద్దక్షేత్రం. ఏడు నదుల సంగమస్థలి .ఎంతెంత మంది మహా యోగులు తప మాచరించిన ప్రదేశమోగాని అక్కద ప్రవేశించగనే మనసు ఆనంద తాండవ మాడుతున్నది. ఈ సంవత్సరమే మట్టి దారి ఏర్పాటుచేశారు. అసలు ఆలయం నదిలో మునిగి పోయి వుంటుంది. ఒడ్డున ఉన్న చిన్న దేవాలయం దగ్గరే తాత్కాలిక ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం వారు. కొద్దిగా వున్న ఆచోటులో ఇరుకు గనుక పక్కనే కొండమీద వున్న ఒక పాత దేవాలయం పక్కన తాత్కాలికంగా యజ్ఞ కుఁడీని ఏర్పాటు చేసుకున్నాము. ఒక పురోహితుని మాట్లాడుకుని నదీ పూజ .గోత్రనామాలు పంపిన వారందరి తరపున నిర్వహించి దీపదానాలు చేశాము. ఆయన కూడా 18 సార్లు భవానీ దీక్ష వేసుకున్నానని మిమ్మల్ని చూడగానే అమ్మ పాట ఒకటి గుర్తుకొస్తున్నదనీ నా కుదగ్గరగా పాడి వినిపించాడా యన ,తన్మయత్వంతో. మరి అది అమ్మ లీలఏ తప్ప యాదృచ్చికమని నేననలేను. ఆ తరువాత మా పిల్లలే సహాయకులుగా గాయత్రీ హోమము చక్కగా సాగినది. అందరికీ పుష్కర స్నానఫలము కలగాలని మరొక మారు ప్రార్ధించి బయలుదేరాక శ్రీసైలం వెల్లాలని పిల్లలు గొడవ మెదలెట్టారు. అటునుంచి శ్రీశైలం వెళ్ళి శుక్రవారం అమ్మ కు కుంకుమ పూజ జరిపి ఇంటికి చేరుకున్నాము . నిజంగా ఇంతమంది భక్తులకు
ఈ రూపేణా సేవ జేసే భాగ్యము కలిగించిన అమ్మకు మరొక మారి ప్రణతులర్పించుకుంటూ ...........దుర్గేశ్వర. [ఇంకా వివరంగా వ్రాద్దామంటె సమయము లేదు ]
http://www.youtube.com/watch?v=జ౦ఉఈ౪క్పొర్క్
0 వ్యాఖ్యలు:
Post a Comment