తుంగభద్రానదీ పుష్కరాలకు రాలేకపోయినవారికోసము సంగమేశ్వరములో పీఠము నిర్వహిస్తున్న గాయత్రీ హోమానికి మీ గోత్రనామాలు పంపండి.
>> Monday, December 15, 2008
పన్నెండేళ్లకొకసారి ప్రతి నదికీ వచ్చే పుష్కరములు ఈసారి తుంగభద్రా నదీమతల్లికి వచ్చాయి. ఈసమయములో సర్వతీర్ధాలు ఆనదిలో లీనమయి ఉంటాయి. ఆ నదీ స్నానముచేయటము అక్కడ పూజ, యజ్ఞము,దానములు చేయడము చేయించడము మానవుల పాపాలను కడిగివేస్తాయని ,అనంత పుణ్యాన్ని చేకూరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అందరమూ అన్ని పుష్కరాలలో పాల్గొనే అవకాశము కలగక పోవచ్చు. భౌతికముగా పాల్గొనలేకపోయినా మానసికముగా నైనా అక్కడపాల్గొనటము,కార్యక్రమాలను జరిపించటముకూడా సత్ఫలితాలనిస్తాయి.
ఈరోజు పూజలో కూర్చున్నప్పుడు. భక్తుల సేవ సాధనా మార్గముగా ఎన్నుకున్నవాడివి పుష్కర కాలములో వారికొరకు ఏమైనా చేయవచ్చుగా అని భావన కలిగినది. అది గురుపరంపరనుండి వచ్చిన సందేశముగా భావిస్తూ భక్తజనుల శ్రేయస్సు కాంక్షిస్తూ ఆ నదీమతల్లి సన్నిధిలో అందరి తరపున గాయత్రీ హోమము చేయాలని సంకల్పము కలిగినది. ఈకార్యక్రమానికి మీఅందరినీ ఆహ్వానిస్తున్నాము . ఇక్కడొక చిన్న విషయం చెప్పాలి. నేను ఎక్కడ ఈ కార్య క్రమాన్ని నిర్వహించాలా అని ఆలోచిస్తుంటే సంగమేశ్వరము అనే క్షేత్రము స్మృతి పథములోకొచ్చినది. కాని నేనెప్పుడూ అక్కడకు వెళ్ళి చూడలేదు. విన్నానంతే.
అక్కడ పరిస్తితులను గూర్చి తెలుసు కోవాలని మార్కాపురం లో ఆర్.టి.సి. లో ఎస్.టి. ఐ . గాపనిచేస్తున్న నామిత్రుని ఫోన్ లో సంప్రదించగా ఆయన చెప్పిన విషయాలు విన్నతరువాత ఆశ్చర్యము కలిగినది. నాసంకల్పము భ్రాంతి కాదని ఖచ్చితముగా పరమ గురువుల ఆదేశమేననే నమ్మకము ఏర్పడినది.
క్షేత్రవివరాలు:- అక్కడ తుంగ,భద్ర, కృష్ణ ,వేణి, మలాపహారిణి, భీమరథి,భవనాశిని అనే ఏడు నదులు సంగమిస్తున్నాయి. నల్లమల అడవులలో ఉన్న ఈక్షేత్రం చాలా శక్తి వంతమయినది. ఒక సారి కృష్ణా నదీ పుష్కరాల సమయములో నదిలో వున్న సంగమేశ్వరాలయ ప్రాంతములో ఒక దివ్యజ్యోతిప్రవేశించటము పలు పత్రికలలో వచ్చిన ఫోటో చూసాము. మహత్తర శక్తి నిండివున్న క్షేత్రము. ఇక్కడ విశ్వామిత్రుడు గాయత్రీ ఉపాసన చేసి ఆతల్లిని ప్రత్యక్షము చేసుకున్నాడట. అలాగే శాఁడీల్య మహర్షి తపస్సు చేశారట. ధర్మ రాజు చే ప్రతిష్ఠ చేయబడిన సంగమేశ్వరుడు ఇక్కడ అధిదైవము.
ఇవి విన్నతరువాత నాకు వచ్చిన ఆజ్ఞలో సందేహము కనపడలేదు. మనము చేసే ప్రతిపనీ ఇతరులకు ఉపయోగపడాలని అదే" తవసుఖేన మమసుఖం " అనే గోపికా భక్తిభావన కు మూల సూత్రమని మా పరమ గురువులు చెప్పిన మార్గములో నడస్తున్నాము. కనుక మేము మాత్రమే వెళ్ళి కార్యక్రమము జరుపుకోవటము కాక అక్కడ కార్యక్రమాన్ని తమకోసము కూడా జరపాలని కోరుకునే భక్తులందరి కొరకు గాయత్రీ హోమాన్ని నిర్వహిస్తున్నాము.
ఈకార్య క్రమములో పాల్గొనాలని భావించినవారు మీ గోత్రనామాలను మెయిల్ ద్వారా పంపండి.
అక్కడ జరిగే కార్యక్రమము :-
----------- ------------------- తేదీ: 18 -12-2008 గురువారము
పురోహితుని చేత మీతరపున గోత్రనామాలతో నదీ పూజ జరుగుతుంది. పసుపు కుంకుమ పూలు ,మరియు దీపదానము నదీమతల్లికి సమర్పించబడుతుంది.
మీ అందరి పేర్లను వ్రాసిన వస్త్రాన్ని నదిలో స్నానము చేపించటము ద్వారా భావనాత్మకంగా మీరు స్నానం చేసినట్లవుతుంది.
ఇక దీపదానాదులకు పెద్దగా ఏమీ ఖర్చుండదుకాని, ఎక్కువమందికి కొరకు చేయాల్సి వచ్చినప్పుడు అందరికొరకు ఖర్చు పెట్టటము భారమవుతుంది కనుక అవి మీ ఖర్చుతో చేస్తేనే మంచిది కనుక తరువాత తెలుపుతాను వాటిని ఎమ్.ఒ చేయఁడి. చాలు
తదనంతరము: పీఠముతరపున అక్కడ గాయత్రి హోమము నిర్వహించబడుతుంది మీ ఫోన్, మరియు మెయిల్ తప్పని సరిగా పంపండి.
మరొక చిన్న విన్నపము. ఆప్రాంతములో ఎవరన్నా బ్లాగర్ లు లేక ఇది చదివిన వారుంటే మాకు ఒక రొజు మీ సమయాన్ని వెచ్చించి సహాయ పడగలరు.
భక్తజన దాసుడు
దుర్గేశ్వర
durgeswara@gamil .com cell 9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment