శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మాయింటికి రండి అమ్మ వంట రుచిచూద్దురుగాని

>> Tuesday, November 18, 2008


అమ్మ చేతివంట ఆతల్లిబిడ్డలందరికి మధురమే .కాకుంటే మా అమ్మ చేతివంటమాత్రం అందరికీ మదురాతిమధురంగావున్నాయని అంటుంటారు. మా అమ్మవంటల స్పెషలిస్ట్ . చిన్నప్పటినుంచి చూస్తున్నా మావూర్లోగాని ఉద్యోగరీత్యా మానాన్నగారు వెళ్ళిన ప్రతివూర్లోనూ చుట్టుపక్కల వాళ్ళు ఏశుభకార్యం జరిగినా అమ్మ వంటలదగ్గర నిలబడాల్సిందే. మావూర్లోనయితే అమ్మ లెకుండా ఏశుభకార్యం జరగదు. కులాలతో సంబంధంలేదు. అంతేకాదు పెళ్ళిల్లు పేరంటాలంటే మా అమ్మకు మహాప్రీతి. మాచిన్నప్పుడు మమ్మల్ని వదలికూడా పెళ్ళిల్లకు వెళ్ళి పెళ్ళికూతురు ఏడ్చింది వస్తుంటేఅనో ,పెళ్ళికొడుకు ఏడ్చాడనో ఏదో వొకటి చెప్పి వెంటనేరాదు. ఇక్కడ నేను నాతమ్ముళ్ళిద్దరూ మాత్రం కసువులూడుస్తూ.అంట్లుతోమి వంటచేస్తూ అమ్మలక్కలు తిట్టేవాళ్లం ఆమెను, అంతేకాదు ఎవరికన్నా బాగాలేకపోతే హాస్పటల్ లో వాల్ల చుట్టాలన్న వుండరేమోగాని అవసరమయినప్పుడు అమ్మ మాత్రం తప్పకుండావుంటుంది. మావూర్లో పురుగుమందుతాగి [వైష్యులు] మేము పిన్నీ అంటాము నాగేస్వరమ్మ పిన్ని హాస్పటల్ లోవుంటే ఆవాసన భరించలేక వాళ్లచుట్టాలెవరూ దగ్గరలేకున్నా అమ్మె వారం వుండిసకలసేవలు చేసింది. అప్పుడుతెలియలేదుకాని ఇన్నాల్లైనా ఆమె మా అమంపట్ల చూపే ఆప్యాయతకు అర్ధం ఇప్పుడుతెలుస్తుంది.
ఇక శివభక్తి తొ శివ మాల వేస్తుంది. పూజకంటె ఇక్కడకూడా అమ్మకు వండిపెట్టటమే ఆమెకు తృప్తి .ఎప్పుడూ ఎవరు పూజకోసం వచ్చినా వాళ్లకు అమ్మవంటరుచిచూడటం తప్పదు. ఈమధ్య నెల్లూరు సియివొ పెంచలరెడ్డి ,బాంక్ హయ్యర్ ఆఫీసర్ మొదలయినవారు వచ్చారు. అమ్మ చేసిన పచ్చడితింటూ పచ్చడి అదుర్స్ సార్ అని సుమారు పావుకేజీ పచ్చడి ఆయనే తినేశాడు. ఇక కాకరకాయ వేపుడు చేస్తే చెప్పనలవికాదు. గుంటూర్ అధికారిఒకాయన ఈమధ్య పూజకొచ్చినప్పుడు అరకేజీకాకరకాయ హాంఫట్. వేపుళ్ళు చేయటం కాని పచ్చల్లు పెట్టటంలోగాని అమ్మ అందెవేసిన చేయి. కాకుంటె వంట ఎప్పుడు చేసినా ఇంకా పదిమందికి మిగలాల్సిందే. నిరుడు,ఈఏడాది ఇక్కడ జరుగుతున్న అన్నదానం లో అమ్మ పూజంతా ఇదేనన్నట్లుగా మమేకంవుతున్నది. పదిమందికి కడుపునిండితే అదేచాలనుకుంటుందేమో. అంతే కాదు ఎక్కడికెళ్ళినా ఆచుట్టుపక్కలవాళ్ళు గంటలో పరిచయమవుతారు అమ్మకు. మాతమ్ముడు నెల్లూరులో వుంటే వెళ్ళి అక్కడ అపార్టమెంట్స్ లో వున్నవాళ్లందరిని తిరగేసి వారి ఇంటిల్లపాది వివరాలు కష్టసుఖాలు మాట్లాదటంతో వాడు తలపట్టుకున్నాడు. .మా అమ్మకు ఇంగ్లీషురాదు. కాని మాకుకూడా పెద్దటీబివుంది అంటుంది. అదిటీవి కొచ్చిన తిప్పలులెండి. అల్లగెమరికొన్ని ఇంగ్లీషుముక్కలు కూడా వాడుతుంది. వద్దే నీయమ్మకదుపుమాడా అన్నమనుకో అబ్బో మీరేచ్దివార్లే మా అన్నకూడా [ఆయనొక సీనియర్ కాంగ్రేస్ నాయకుడులెండి] అని మొదలు పెట్తి వాళ్ల పుట్టింటి వాళ్ల గురించి మొదలుపెడుతుంది.
మనకెందుకు మనపని చేసుకోక అన్నమనుకో పొట్లపాదుల్లా మీరు ఇంకెవరూ వద్ద్నుకోనిబతకుతారు.నావల్లకాదు అని ఇంతెత్తున లేస్తుంది.
నాన్న పోయిన దగ్గరనుంచి ఆమెకు మనసులో వున్నవెలితిని మేము తీర్చలేకపోయినా మనౌమల్లు తీరుస్తున్నారు. ఓకసారి మీరూ రండి మా అమ్మ వంట రుచి చూస్తే మరచిపోరు. కాకుంటె అమ్మకు గంటగంటకు ఇచ్చినా టీ తాగే అలవాటుంది. అలాగే మాంసాహారం అంటేకూడా మక్కువ ఎక్కువ .వాళ్లపుట్టీంటివాళ్లకు అదిలేకుంటే ముద్దదిగదు. పక్కనే గుండ్లకమ్మ నది వలతీసుకెళ్ళి రెండు చేపలుతెచ్చుకుని కాల్చుకోనయినా వాళ్ళు తినాల్సినదే. మా ఇంత్లోనేమో మాంసాహారం రాకూడదు. అందుకే ఏదో వొక వంకచెప్పి వాల్లూరు బస్సెక్కుతుంది. మేము బ్రాహ్మణులం కాకున్నా మాజేజినాయన పీఠాన్ని స్తాపించినప్పటినుంచి మాఇంట్లోనేమో నియమాలెక్కువ. అందుకే మామేనమామ గారు ఎప్పుడు మాయింటికొచ్చినా ఏంపెట్టారోయ్ బాపనోళ్ళబువ్వ నోరుసవ్వంగా పప్పు పప్పు అనేవాడు. మాకు నవ్వొచ్చేది. మేము ఆచారరీత్యా అటువంటి సంస్కారాల్తో వుండేవార్ము. అదే కొద్దిగా ఇబ్బంది ఆమెకు ఆహారవిషయంలో. మాయింటికి రండి అమ్మ వంటరుచిచూద్దురుగాని.

13 వ్యాఖ్యలు:

Krishna K November 18, 2008 at 9:48 AM  

ఈ సారి ఇండియా వచ్చినప్పుడు, మీ ఊరు తప్పకుండా రావాల్సిందేనండి, పీఠం చూడటానికి కాకపోయినా, మీ అమ్మగారి వంట తినడానికి. పూనూరుకు మీ ఊరు ఎంత దూరం?
మా అమ్ముమ్మ ను (ఇప్పుడు లేదు) గుర్తుకు తెచ్చారు మీ అమ్మగారి గురించి చెబ్తూ. ఆమే బ్రతికి ఉన్న రోజులలో, అలాగే వండి వడ్డించేది. మా తాత ఇచ్చే డబ్బులు కంటే, ఆమె వంట కోసం మా పొలాలలో పని చేయటానికి వచ్చే వాళ్లు. ఆమె చేయి, చాలా పెద్దది (తక్కువ వండటం రాదు అని) అందరూ అనే వాళ్లు.
మీ టపాలో అచ్చు తప్పులు సరి చూసుకోగలరు.

దేవన November 18, 2008 at 11:16 AM  

guruvu gaaru,

maa ammaku kooda ganta ganta ki kaafi vundaalsindhe.

yeppudu rammantaaru mee intiki.

Rani November 18, 2008 at 12:03 PM  

ఈసారి ఇండియా వచ్చినప్పుడు చెప్పా పెట్టకుండ మీ ఇంటికి వచ్చెస్తా. అమ్మకి మా నమస్కారాలు చెప్పండి :)

సుజాత వేల్పూరి November 18, 2008 at 9:23 PM  

అర్రె, మొన్నా మధ్య మా వూరొచ్చినపుడే వస్తే బాగుండేది, నా ఫేవరెట్ కాకరకాయ వేపుడు కోసమైనా !అన్న పూర్ణమ్మ గారికి(ఆమె పేరేదైనా సరే) నమస్కారాలు చెప్పండి.

durgeswara November 18, 2008 at 10:01 PM  

@క్రిష్ణగారూ మీరు తప్పనిసరిగా రండి.ఇమ్తకీ మీవూరేదో చెప్పలేదు.వినుకొండకు 18కి.మీ.మావూరు.చక్కగా బసెక్కివచ్చెయ్యొచ్చు.
టైపింఘ్ అలవాటులేకపొవడము వలన తప్పులొస్తున్నాయి.సరిచేసుకుంటాను.
@దేవనగారూ మీకుఎళ్లవేళలా ఆహ్వానం మాయింటికి. ఎప్పుడు కావాలంటె అప్పుడు వచ్చెయ్యొచ్చు.

@అమ్మా రాణీ నువ్వు తప్పకుండారావాలి.మా అమ్మకు ఆడపిల్లలు లేరు కనుక ఆడపిల్లలెవరన్న వస్తే పండుగే.

@ అమ్మా సుజాతా ఈసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా రావాలి.అన్నట్లు చెప్పటమ్ మరచాను.మా అమ్మగారిపేరు అక్కమ్మ.ఆవి్డ అక్కలిద్దరిది లింగంగుంట్ల. అమ్మమ్మవాల్లు కూడా నాచిన్నప్పుడు అక్కడె వుండేవారు. మా జేజినాయన గారి అసలువూరుకూడా నరసరావుపేటపక్కనే గంగన్నపాలెం. మాచుట్టాలు చాలామంది నరసరావుపేటలో వున్నందున తరచు వెళుతుంటాము.

విరజాజి November 18, 2008 at 11:32 PM  

గురువుగారూ,

మా అమ్మమ్మని, నాయనమ్మని గుర్తు చేసారండీ... సరిగ్గా భోజనం చేసేవేళకి !! అమ్మ చేతి వంట ఎప్పుడైనా అమృతమే కందండీ ! వంటలో కారంతో పాటు మమకారం కూడా కలిపి వండి పెట్టే అన్నపూర్ణలు ప్రతీ ఇంటా తప్పక ఉంటారు ... వారందరికీ నా వేల వేల నమస్కారాలు. మీ అమ్మగారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలపండి. వినుకొండ దగ్గరా మీ ఊరు? మా అమ్మమ్మ పుట్టిల్లు అక్కడే... వినుకొండ దగ్గర కంభంపాడు ! మా అమ్మమ్మగారి తమ్ముడు కంభంపాడు కరణం గా పని చేసారు.... వాళ్ళ కొడుకులు ఇంకా ఆ ఊరిలోనే ఉంటున్నారు. మా తాతగారి ఊరు దర్శి. వినుకొండలో మా మావయ్య (మా చిన్నమ్మమ్మ కొడుకు) ఉంటున్నారు. ఈ సారి అక్కడికి వస్తే మీ ఇంటికి రావలసిందే మరి !!

durgeswara November 19, 2008 at 3:12 AM  

అమ్మా,
విరజాజి[మరినీపేరుతెలియదుకదా] కంభంపాడు కరణమ్ గారి చుట్టాలామీరు.వాళ్ళ పెద్దబ్బాయి సత్యం నాకు వ్యక్తిగతంగా చాలా మంచిమిత్రుడు. ఆయన నేను కలసి వార్త లో రిపోర్టర్లుగా పనిచేసాము కూడా. ఈమధ్యనే ఆయన భగవంతుని సాన్నిధ్యానికెళ్ళిపోయారు. వాళ్ళ చిన్నబ్బాయి సింహాద్రివాళ్ళు అక్కడే వుంటున్నారు. వినుకొండలోవున్న మీచిన్నమామయ్య గారు ఎవరు.పేరు చెప్పండి నాకు తెలిసి వుండవచ్చు. మీరు తప్పనిసరిగా రండి. 26 వతేదీన పీఠములో పంచాఅరీ జపయజ్ణ్జము పూర్ణాహుతి జరుగుతున్నది వీలైతే తప్పనిసరిగా రండి.

durgeswara November 19, 2008 at 3:14 AM  

kriShnagaaroo mIvooru poonooru EjillaalOnidi?

maadi guntur dt nujendla manadalam

vinukonadadaggara

durgeswara November 19, 2008 at 3:17 AM  

ammaa

virajaaji typing lotappupadinadi.

pamchaaxari japayagnamu poornaahuti

చిలమకూరు విజయమోహన్ November 19, 2008 at 5:59 AM  

అమ్మకు జై జై , ఇంత నిష్టగా ఉన్న మిమ్మల్ని చూసి నిజంగా బ్రాహ్మణులే అనుకున్నాను,ఇప్పుడు మీపై మరింత గౌరవంపెరిగింది.చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః అన్న కృష్ణభగవానుని మాటకు మీరు ప్రతిరూపం.గుణాల్ని బట్టే కాని జన్మను బట్టి కాదని.

విరజాజి November 19, 2008 at 10:23 PM  

గురువుగారూ

చాలా సంతోషమండీ.. మా వాళ్ళు మీకు తెలిసినందుకు.

మిగతా వివరాలన్నీ మీ జీమెయిలు కి ఉత్తరం రాసాను. ఒకసారి చూసుకోండి.

Anonymous November 21, 2008 at 12:31 AM  

maa manchi amma. kopam vaste kodutundi. etlaago telusaa.. 'vari gaddi peechutoo...'.
intaki nenevaroo cheppaledu kadaa..nenu durgeswararao gari chinna tammudini.

అన్యగామి January 23, 2017 at 7:53 AM  

మా అమ్మగారి సంస్కారం మీకు వచ్చింది. వారు అన్నం పెట్టి సేవచేస్తుంటే మీరు భక్తిని పెంచే సేవ చేస్తున్నారు. మీ అమ్మగారి నమస్కారాలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP