శనికి ప్రీతికరమయినవాటిని నేరుగా తీసుకోరాదు.
>> Thursday, September 11, 2008
మనం కొన్నివస్తువులను ఇతరుల చేతినుండి నేరుగా తీసుకోవడం చేయరాదని పెద్దలు చెబుతుంటారు. దానివలన మనకు చెడుజరుగుతుందని వారిభావం. అందులో ను ఉప్పు, నువ్వులు ఇనుము, నువ్వులనూనె లను నేరుగాతీసుకోరాదని హెచ్చరిస్తారు. దానికి కారణం ఉంది. ఈ వస్తువులన్నీ నవగ్రహాలలో ఒకరయిన శనికి సంభందించినవి. ఆయనకు ప్రీతిపాత్ర,మయినవి. శనిగ్రహ ప్రభావం వలన జాతకములో దోషం కలిగి కష్టాలు కలిగినప్పుడు, ఈవస్తువులను దానం చేయమంటారు. సహజంగా దానంచేసేచేయి పైనుంటుంది. అలాగే స్వీకరించేవారి చేయి కిందవుంటు0ది.
కనుక పై వస్తువులను మనం ఇతరుల చేతినుంచి నేరుగా స్వీకరించటం వలన వారిలోని శనిదోషాలనుల మనం స్వీకరించిన వారిమవుతాము. అంతేకాదు వాటిని ఉచితంగా అసలు తీసుకోరాదు. తీసుకోవలసివచ్చినప్పుడు,ఇచ్చేవారిని క్రిందపెట్టమని, లేక పక్కనపెట్టమని చెప్పి తరువాత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరో ముఖ్య మయిన విషయం ఆడవాళ్ళు చీపుర్లను ఉపయోగించిన తరువాత తలకిందులుగా వుంచితే పుల్లలు విరిగిపోతాయని దానిని ఎత్తిపెట్టినట్లుగా భద్రం చేస్తారు. చీపురు శని కి ఆయుధం కనుక అలా నిలబెట్టటం దోషము. దానిని పండుకోబెట్టటం ఉత్తమం. లేదా కొసలు క్రిందకు ఉండేలా వుంచటం మంచిది.
ఇక శనిత్రయోదశిరోజున ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆరోజు తలారా స్నానం చేసి
శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవటం దోషాలు వున్నవాళ్ళూ అభిషేకాలు చేపించుకోవడం మంచిది. శనికి ప్రీతిపాత్రమయిన శ్లోకాలు,మంత్రాలు జపించటం శాంతికరం .ఆరోజల్లాశివ పంచాక్షరి ని జపించటం విశేషఫలితాలనిస్తుంది.
శ్రీవేంకటేశ్వరజగన్మాత పీఠం లో ఈనెల 13 న శనిత్రయోదశి పూజలు ,నవగ్రహశాంతు లు, ప్రత్యేకించి ప్రదోషకాలం లో శివార్చన జరుగుతుంది. గోత్రనామాలు పంపిస్తే భక్తులకొరకు ఉచితముగనే పూజలు జరుగుతాయి. పంపించండి.
10 వ్యాఖ్యలు:
శనిగారి ఫేవరెట్ మెన్యూ మీచేతికెలా తగిలిందబ్బా!
మంచి సమాచారం ఇచ్చారు.నెనర్లు.
@కత్తి
ఎవరి ఇంటరెస్టులు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందరూ మీలాగే మొహానికి రంగులేసుకుని నోట్లో చొంగ కారే సినిమా ఏక్టర్ల గురించి పాట్లు పడుతూ రీసెర్చ్ చెయ్యాలని రూలెక్కడేనా ఉందా?
మీకు ఇంటరెస్ట్ లేకపోతే టైము వేస్టు చేసుకోకుండా నోరుమూసుక్కూర్చోండి. ఉత్తి ప్రేలాపనలు ఎందుకూ?
ఇచ్చేవారు కింద పెట్టి అక్కడనుండి మనం తీసుకుంటే అది ఉచితంగా తీసుకున్నట్లు కాదా?
ఇప్పుడూ .. ఒకాయనకి శనిదోషం ఉంది. అప్పుడాయన నువ్వుల నూనె, వగైరా ఎవరికన్నా దానం చేసేసి ఆ దోషం వదిలించుకుందామనుకున్నాడు. కానీ అవతలాయన తెలివిగా వాటిని కింద పెట్టించి అక్కడినుండి తీసుకున్నాడు. మీరు చెప్పే ప్రకారం అది దానం కిందకి రాదు (ఉచితం కాదు) కాబట్టి మొదటాయనకి నువ్వుల నూనె క్షవరమయ్యింది కానీ దోషం మాత్రం వదల్లేదు. కరెక్టేనా?
sir bagundi kani abrkadabra adigina daniki answer ivvara chusthamu.
@అనామకుడు (Anonymous): పేరుకూడా చెప్పుకోలేని నీలాంటి వాజమ్మలకన్నా, నేను అడిగే ప్రశ్నలకి (నేను వాటితో విభేధించినా)గౌరవప్రదంగా వేగుద్వారా సమాధానమిచ్చే ఈ బ్లాగరి నిబద్ధతకు నేనెప్పుడూ తలవంచి నమస్కరిస్తాను.
ఇక్కడ నన్ను నోరుమూసుకోమనే హక్కు ఎవరికైనా వుంటే, అది ఈ బ్లాగు ఓనరుకిమాత్రమే.కావాలంటే నా కామెంటుని చెరిపేసే సౌలభ్యంకూడా వారికే వుంది.
నీలాంటి వెధవలకూ,చేతకాని దద్ధమ్మలకూ,పేరుకూడా చెప్పుకోలేని అధములకూ నా ప్రశ్నల్లోని ఔచిత్యాన్ని,నా అభిరుచుల్లోని విలువలనీ ప్రశ్నించే అధికారం అస్సలు లేవు. ముందుగా ఒక ఊరూ,పేరూ, గుర్తింపు,ఉనికి లేకుంటే కనీసం అరువు తెచ్చుకుని అప్పుడు ధైర్యంగా చర్చకురా..ఏవిషయమైనా...ఎక్కడైనా..నేను రెడీ..(సమరసింహారెడ్డి స్టైల్లో చదువుకో).
@బ్లాగర్ గారికి: నేను వాడిన పదజాలానికి క్షమించండి. మీకు అభ్యంతరమనుకుంటే తొలగించండి.
పది దిశలనుండి సద్భావనలు ప్రసరించనీ....అనే ఋషిపుంగవుల వారసులము మనము. నిజాన్నయినా అప్రియంగా చెప్పటం పాపమని వేదం బోధిస్తున్నది. అంటె ఇతరుల మనసు నొప్పించడం వలన అక్కడ కొలువున్న పరమాత్మకు బాధకలిగించటం దోషమని కాబోలు. మీరంతా చదువులలో సంస్కారాలలో ,ఉద్యోగాలలో ,జీతాలలో నాకంటే చాలా పై స్తాయిలోనివారు. ఇంతకంటే నేనేమిచెప్పను.నేనొక మామూలు బడిపంతుల్ని. కాకుంటే పూర్వజన్మ సుకృతం వలన భగవంతుని సేవకునిగా విఙ్ఞానఖనులైన మన పూర్వీకుల ప్రసాదితమయి,మానవ శ్రేయస్సుకే ఉద్దేసించబడిన ఆచారాలను మరొక తరానికందచేయాలనే భావనతో వ్రాస్తున్నాను. అంత విలువయినవయితే పేటెంట్లు ఎందుకుతీసుకోలేదు వాళ్ళు అని తిరస్కరించకండి. తాము కనిపెట్టిన ప్రతిదీ ప్రకృతిప్రసాదించిన సత్యం కనుక దానిపై సర్వ హక్కులు జీవులందరివని భావించిఉంటారు. పేటెంట్ హక్కులు లేకుంటే విలువయినవి కాదని భావించి చిన్న చూపుచూస్తే రాబోయే తరానికి ఇవి బయట నుండి కొనితెచ్చుకోవలసిన దుస్థితివస్తుంది.
ఇక అబ్రక దబ్ర గారు నేను వ్రాసినదాంట్లో కొన్ని లోపాలు చూపారు. నేనేదో పిల్లలకు చెప్పినట్లు చెబితే కుదరదు అవతలున్నది మేధావి వర్గం కనుక పదాల పొందికలో సహితం జాగ్రత్త పడాలని గ్రహించాను.
అబ్రక దబ్ర[ ఏంటో నోరారా మిత్రుల పేర్లుకూడా సంబోధించలేకపోతున్నాను] గారూ. శనిదోష నివారణ కోసం వస్తువులు దానం చేయటం ఒక పద్దతి ప్రకారం జరిగే ప్రక్రియ. దానం తీసుకునేవ్యక్తి తన సాధన ద్వారా అవతలి వ్యక్తి చెడుఖర్మ ఫలితాన్ని కూడా ధ్వంసం చేయకలిగిన శక్తి మంతుడై వుండాలి. లేకుంటే వానితలకు చుట్టుకుంటుందీపీడ. దానం తీసుకుంటానని వచ్చి పక్కనపెట్టమంటే ఎలాకుదురుతుంది? అలా తీసుకోనప్పుడు ఈ ప్రక్రియకు ఎందుకు ఒప్పుకోవాలి? కనుక దానం చేయదలచినప్పుడు. తీసుకునే వారి చేతికే అందించండి. ఇక అక్కడ పెట్టు అని ఉచితంగా వచ్చినది తీసుకోవటం ఇంకా దరిద్రం. దోషం
ఇక నేను బ్లాగులో తీసుకోవలసి వస్తే పక్కన పెట్టమని తీసుకోండి అన్నాను. నాఉద్దేశ్యం లో కొట్లో కొన్నప్పుడు., అలాగే అవిమనవయినా తీసుకోవలసి వచ్చినప్పుడు, అలా చేయమని చెప్పాను. అబ్బా అలాగా మరి పెద్ద ఇనుప బీరువాతెస్తే? పెద్ద ఇనుపటేబిల్ తెస్తే పట్టుకోవద్దా? అనే చిన్నపిల్లల ప్రశ్నల జోలి మీవంటి పెద్దలుపోరనుకుంటాను.
ఇందులో గాని, నాబ్లాగ్ రచనలలోగాని, మీకు పనికొచ్చేవన్నీ మీకుశ్రేయస్సు కూర్చేవన్నీ మన పూర్వీకులైన పెద్దల దయవలన వచ్చినవి అలాకాక మిమ్మల్ని బాధించేవీ , మీకు నష్టం కలిగించేవన్నీ ఖచ్చితంగా నా అఙ్ఞానం వలన వ్రాయబడ్డవిగా పెద్దమనసుతో భావిస్తారని ఆశిస్తూ .......పదిమంచిభావాలను ప్రశాంత మనస్కులమయి పంచుకుందామని కోరుకుంటున్నాను. మావూర్లో కరెంట్ ఆశాఖవారి చిత్తానుసారంగావస్తూ పోతుంది, కనుక వ్రాయటం ఆలస్యమయింది. ధన్యవాదములు.
దుర్గేశ్వర గారు,
ఓపికగా బదులిచ్చినందుకు ధన్యవాదాలు. నాకిటువంటి నమ్మకాలు లేవు. అయినంతమాత్రాన వాటిని నమ్మేవారిని చులకన చేయటం, వేళాకోళమాడటం నా పద్ధతి కాదు. నేను కేవలం మీరు రాసినదాంట్లోని అస్పష్టతని ఎత్తిచూపానంతే. నా వ్యాఖ్యని సరిగా అర్ధం చేసుకున్నారు, వివరంగా బదులిచ్చారు.
బీరువాలు, ఇనప్పెట్టెలు తరహా పిల్ల ప్రశ్నలు వెయ్యన్లెండి :-)
మీరు నాకు 'గారు' తగిలించకుండా శుభ్రంగా అబ్రకదబ్ర అని ఏకవచనంతో పిలిస్తే మరింత బాగుంటుంది. (మీకు మాత్రం నేను అవసరమైనప్పుడల్లా గారు తగిలించేస్తా, పెద్దవారు కాబట్టి).
అలాగే మినుములు కూడా తీసుకోకూడదంటారు కదా.అది ఎంతవరకు నిజం?మరి నువ్వులతో చేసిన పదార్ధాల మాటేమిటి?పక్కింటివాళ్ళు ఇస్తే తీసుకోవచ్చా?
sir plz answer me
Post a Comment