శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బ్లాగ్లోక సోదరీ,సోదరులందరకు,ఆహ్వానం.

>> Sunday, September 28, 2008


65 సంవత్సరాలక్రితం మా జేజినాయన గారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులై స్థాపించిన శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠములో సర్వజిత్ నామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవములు ఈ నెల 30 వతేదీ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతిఏటా మాకుతెలిసిన వారిని,బంధువులను,స్నేహితులనందరినీ ఆహ్వానించటం ఆనవాయితీ. అమ్మ సంకల్పమేమో కంప్యూటర్ రంగములో ప్రవేశమేలేనినేను మూడున్నర నెలల కాలము క్రితం బ్లాగులోకంలోకి ప్రవేశించటం, ఎందరో భక్తజనులు,మేధావులు,దార్శనికులు, స్వాప్నికులను పరిచయంగా పొందటం అమ్మ సంకల్పమని నేను భావిస్తున్నాను. ఏ ఋణానుబంధం లేనిది ఎవరికి ఎవరు తటస్థపడి పరిచయమవరని నానమ్మకము. "ఎదుటా ఎవ్వరులేరు అంతా విష్ణుమయమే ,వదలక హరిదాసవర్గమైన వారికీ....................అని పాడిన అన్నమయ్య పాటలోని అర్ధమే మాబాట. కనుక మీరంతా నాకు ఆత్మ బంధువులే. మేము అమ్మకు చేస్తున్న ఈ సేవలలో మీరందరూ పాల్గొనేందుకై సకుటుంబ బంధువర్గ సమేతంగా ఆహ్వానిస్తున్నాము. మంచిమనసున్న మీరంతా వ్యక్తిగతముగా వచ్చి పిలవలేదని భావింపక మన్నించి రాగలరని మా కోరిక.
భక్తజన పాదదాసుడు
దుర్గేశ్వరరావు
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం,నూజండ్ల మండలం గుంటూరు జిల్లా

4 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ September 28, 2008 at 5:23 PM  

ఏ ఋణానుబంధం లేనిది ఎవరికి ఎవరు తటస్థపడి పరిచయమవరనే మీనమ్మకమే నా నమ్మకము కూడా. మీ అత్మీయ అహ్వానానికి ధన్యవాదములు.అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరగాలని అమ్మవారిని ప్రార్తిస్తూ.....హరేకృష్ణ !

సురేష్ బాబు September 29, 2008 at 2:06 AM  
This comment has been removed by the author.
సురేష్ బాబు September 29, 2008 at 2:07 AM  

అమ్మవారి ఉత్సవాలు నిర్విజ్ఞంగా సాగాలని ఆకాంక్షిస్తూ అమ్మవారినే ప్రార్థిస్తూ,ఆ అమ్మ అందరికీ శుభం చేకూర్చాలని ఆశిస్తూ
సురేష్ బాబు

durgeswara September 29, 2008 at 8:03 AM  

ధన్యవాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP