సిద్ధివిఘ్నేశ్వరా, నిన్నుప్రసిద్ధిగా పూజింతు
>> Tuesday, September 2, 2008

మాకు విఘ్నేస్వరుని పూజసమయమ్లో పత్రిపూజకు పెద్దలు నేర్పిన పాటయిది.
సిద్ధి విఘ్నేశ్వరా ! నిన్ను ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ ఇరువదినొక్కపత్రి.
దానిమ్మ మరునిమ్మ దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్తదూర్వారు ఉత్తరేణు.
గరగరా మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగుదేవదారు
జాజిబలరక్కసి జమ్మి దాసాని పువ్వు ఆరెమాసిపత్రి మంచివెలగ
అగరుకురువేరు గంధ పుష్పముల తోడ
భాద్రపద శుద్ధ చవితియందు పట్ట పగటివేళ
కోరిపూజింతు నిన్ను మాకోర్కెల ఒనర సాగ.




0 వ్యాఖ్యలు:
Post a Comment