పరమగురువులు శ్రీరాధికా ప్రసాద్ మహారాజ్ [నాన్నగారు]
>> Tuesday, September 23, 2008
భువిలో ప్రేమభక్తిని పంచగా దిగివచ్చిన రాదాసఖి, బృందావన విహారులైన రాదా కృష్ణుల ప్రియ సేవకు భువిపైన అవతరించిన మహానుభావులు రాధికా ప్రసాదమహారాజ్ [నాన్నగారు. ] పుట్టినదాదిగా నిరంతరం దైవతత్వాన్వేషకులయి
భారతదేశంలో ఉన్న పలు సాధనారీతులను అనుసరించి, కుసుమ హరనాద, రాదాస్వామి సత్సంగ్, మొదలయిన సాంప్రదాయాలను, గురుసిద్ధారూఢులచే పంచాక్షరిని, అనిబిసెంట్ గారిచే తత్వబోధను, జ్ఞ్జానప్రసూనాంబతల్లిచే దివ్యబోదను చివరకు సాక్షాత్తు దుర్గా దేవిచే రాధా షడక్షరిని మంత్రోపదేశముగా పొందిన సిద్ధపురుషులు. ప్రపంచములో నున్న ఆర్తులను చేరదీసి వారికి అమ్మ ప్రేమమార్గాన్ని అందించి, బృందావన వాసులై నిండు నూరేళ్ళకు పైగా ఆతల్లి లీలా విలాసాలను ప్రజలకు తెలిపి ముక్తిమార్గాన్ని చూపిన రసయోగి. ఏజన్మ లో చేసిన పుణ్యమో ఆ గురుపాదాలను తాకే అద్రుష్టం దక్కినది. పూజ్య గురుదేవుల జీవిత చరిత్రను త్వరలో మీకందించబోతున్నాను.
2 వ్యాఖ్యలు:
ఆతృతగా ఎదురుచూస్తూవుంటాము. హరేకృష్ణ.
వేచిచూస్తున్నాము ఆ మహాత్ముని గురించి తెలుసుకోవడానికి.ధన్యవాదాలు.
Post a Comment