శని ప్రదోషపూజ అంటే ఏమిటి ?
>> Monday, September 8, 2008
పరమేశ్వరునకు ఇష్టమయిన ఆరాధనలలో శనిప్రదోషపూజ విశిష్టమయినది. శనివారం త్రయోదశి రోజు సూర్యాస్తమయం తరువాత ప్రదోషకాలములో [సూర్యాస్తమయ సమయమునుండి 1-36ని. నుండి2-24 గంటలపాటు ఉండే సమయం] శివునకు రుద్రాభిషేకములతో ,అర్చనలు సాగిస్తారు .దీని ప్రభావాన్ని తెలిపే గాథలు చాలావున్నాయి. శ్రీ గురుచరిత్రలో ఎనిమిదవ అధ్యాయమ్లో వున్న గాథఇది.దీనిని సాక్షాత్తూ దత్తావతారమయిన శ్రీపాదవల్లభస్వామి ఆత్మహత్యచేసుకోబోతున్న ఒకతల్లీబిడ్దలకు వుపదేశించి కరుణించి కాపాడారు.
ఉజ్జయనీ నగరాన్నిఏలే చంద్రసేనుడు,అతని మిత్రుడు మణిభద్రుడు పరమ శివభక్తులు. ఆయనను శనిప్రదోషకాలములో ప్రత్యేకముగాకొలచి శివుని వరప్రభావమువలన చితమణిని పొందుతారు. ఆమణిప్రభావము తెలుసుకున్న కొందరురాజులు దానినెలాగయినా దక్కించుకోవాలని చతురంగబలాలతో యుద్ధానికి సన్నద్ధులై వచ్చారు. ఆసమయములో మిత్రులిరువురూ ఏకాగ్రమనస్కులై శివారాధనలో శ్నిప్రదోషపూజలో నిమగ్నమైవున్నారు. అంతకుముందు వారిపూజచూసిన కొందరు గోపబాలురు తమైళ్ళముంగిల్లలో అలాగే ఆకులు ,పూలతో పూజ చేయసాగారు. వారి తల్లులు ఆపిల్లలను భోజనాలకు లాక్కుపోయారు. ఒకబాలుడు తనపూజకు విఘ్నంకలగటం సహించలేక ,దు:ఖపడి,ఆ దోషపరిహారానికి మరణించడానికి సైతం సిద్ధమయ్యాడు. అపుడు విశ్వసాక్షిఐన పరమేస్వరుడు. ప్రత్యక్షమై వరం కోరుకోమనాడు. ఆ బాలుడు ఆదివ్యమూర్తికి ప్రణామంచేసి,తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు , వత్సా భక్తి చేత నీవు నా సాయుజ్యాన్ని పొందావు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది .అయినా నీ అర్చనావిధానం అంతా చూసిందికనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చాడు.
అక్కడున్న లింగము దివ్యతేజసుతో వెలిగిపోతున్నది/ యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇదిచూసి
ఇక్కడ్ సూర్యుడు రాత్రిపూటకూడా ప్రకాశిస్తున్నాడని ,ఇంతటి భక్తిశ్రద్ధలు ప్రజలలో కలిగించిన రాజుకు అపకారంచేయబూనుట పాపమనితలచి పశ్చాత్తాపంతో చంద్రసేనుని వద్దకువెళ్ళిక్షమాపనవేడారు. వారితోకలసివచ్చి ఆదివ్యలింగాన్నిదర్శించి చంద్రసేనుడు, ఆబాలునికి గోపాదొపత్యమిచ్చాడు. తరువాతజన్మలో ఆబాలుని తల్లి యశోదగాజన్మించింది. , అని శివపూజా మహిమను శ్రీపాదస్వామి వర్ణించారు.
**********************************************************
ఈనెల
13వతేదీన మరల 27వ తేదీన శనిత్రయోదశివస్తున్నది. పీఠములో భక్తుల గ్రహదోశాలుతొలగుటకు,శని బాదలు బాపుటకు నవగ్రహ శాంతులు మరియు శనిప్రదోషపూజలు జరుపబడుతున్నాయి. తమగోత్రనామాలను పంపిన భక్తుల కోసం పీఠం పూజలు నిర్వహిస్తున్నది durgeswara@gmail.com కు వివరాలు పంపండి.
1 వ్యాఖ్యలు:
మీకృషి అభినందనీయం
Post a Comment