శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అష్టోత్తరశతటపా [108]సమర్పయామి.[భరతమాత]

>> Wednesday, September 17, 2008

సగరమాంధాతాదిషట్చక్రవర్తుల
అంకసీమననిల్పినట్టిసాధ్వి
కమల నాభుని వేణుగాన సుధాంబుధి
మునిగితేలిన పరిపూత దేహ
కాళిదాసాది సత్కవికుమారులగాంచి
కీర్తిగన్న పెద్దగేస్తురాలు
బుద్ధాది మునిజనంబుల తపంబున
మోదభాష్పముల్ విడిచిన భక్తురాలు

సింధుగంగానదీ జలక్షీరమెపుడు
గురిని బిడ్డల పోషించుకొనుచున్న
పచ్చిబాలెంతరాలు మాభరతమాత
మాతలకు మాత సకలసంపత్సమేత.
ఇది మా వినుకొండ కవికోకిల గుర్రం జాషువా గారి కలమునుండి ,కంఠమునుండి జాలువారిన భరత మాత స్తుతి . నా బ్లాగును ఆదరించి న మీ అందరికీ ఏమి సమర్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే, మా మహాకవి మదిలోకి వచ్చారు. నాకు ఇంటర్వ్యూలో కూడా మంచిమార్కులు తెచ్చి వుద్యోగమిచ్చిన పద్యమిది. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకునే సందర్భం గాకూడా వుంటుందని భావించి మీకు వ్రాసి సమర్పిస్తున్నాను.
ఇక మొదలుపెట్టి న మూడున్నర నెలలలో 108 పోష్టులు వ్రాసి, 3880 మంది చూడగా 74 కామెంట్లను పొందిననేను మీఅందరికీ కృతతజ్ఞలను తెలుపుకుంటున్నాను. మన మహర్షులిచ్చిన ,మానవ వికాసానికి ,శ్రేయస్సుకు ఉద్దేశించబడిన విజ్ఞానాన్ని మీఅందరితో కలసి పంచుకునే చిరుప్రయత్నమ్లో నేనీ బ్లాగును ప్రారంభించాను. ఇందులో నాకు సహాయం చేసిన వారందరికీ నన్నుప్రోత్సహించిన వారెల్లరకూ మరొకసారి వినమ్రపూర్వక ధన్యవాదనులు.
ఇందులో మీఅందరికీ మేలుచేసేవి, మంచిని పంచేవన్నీ మనపూర్వీకులైన మహాత్ముల వలన లభించినవి. దోషముతో కూడినవీ, ఇతరులకు హానికలిగించేవన్నీ నాయొక్క..ఖచ్చితముగా నాయొక్క బుద్ధిహీనత వలన కలిగినవిగా పెద్దమనసుతో భావించగలరు. భగవద్భక్తులైన మీ ఎల్లరకూ ... ....భక్తజన పాద దాసుడు.
దుర్గేశ్వర

2 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ September 17, 2008 at 3:19 PM  

టపాలలో అష్టోత్త్తరం పూర్తి అయిన సందర్భంగా శుభాభినందనలు. రాశిలోనే కాదు వాసిలోనూ మీ టపాలు మమ్మల్ని అలరిస్తూవున్నాయి.అచిరకాలంలోనే సహస్రం చేరుకోవాలని,కృష్ణభగవానుని కరుణ మీపై ఎల్లప్పు
డూ ప్రసరించాలని కోరుకుంటున్నాను.

జ్యోతి September 19, 2008 at 7:58 AM  

అభినందనలు . చాలా మంచి విషయాలు చెప్తున్నారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP