శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

>> Thursday, August 28, 2008



నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.
అయితే ఈపూజలు భక్తిశ్రద్ధలతో జరపాలే తప్ప తప్పనిసరి పనిలా భావించి తంతు ముగిస్తే అనుకున్న ఫలితాలు రావు. చాలామంది ఈపూజలు చాలా ఖర్చుచేసి చేపిస్తుంటారు, కానీ అదేసమయమ్లో వాళ్ళు పక్కవారితో ఇతరవిషయాలు చర్చిస్తూ గడుపుతారు. అలాచేయటమువలన ప్రయత్నం వృధా అవుతుంది. మీభావనను బట్టి ఫలితాలువుంటాయికనుక జాగ్రత్తవహించండి.

1 వ్యాఖ్యలు:

Anonymous August 29, 2008 at 3:39 AM  

అయ్యా ! ఈ పూజలు స్వయంగా చేసుకోలేని వారి తరపున(మీకు కొంత డబ్బు పంపితే) చేయటానికి వీలవుతుందా! లేక నవగ్రహ ప్రదక్షిణ చెసుకొని లేదా స్తోత్రం చదువుకొని ఆయా రాళ్ళ ఉంగరాలు ధరిస్తే సరిపోతుందా.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP