శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అదృష్ట - రేఖ

>> Thursday, August 21, 2008

( పూజ్య శ్రీ ఎక్కిరాల వేద వ్యాస్ గారి రచనలనుండి (3) )


భారత దేశంలో కీరో జాతక విద్యయేకాకా అతని, ఆధ్యాత్మిక అనుభవాలు కూడా పరిపూర్ణతకు చేరుకున్నాయి. మహారాష్ట్ర ప్రాంతం లోని పశ్ఛిన కనుమలలోని పురాతనమైన కొండ గుహలోవున్న ఒక శివాలయములో కూర్చుని మూడు రోజులపాటు ధ్యాన సమాధిలో మునిగిపోయి అన్నాహారాలు లేకుండా గడిపిన కీరో దివ్యదృష్టి, భవిష్యత్తును సినిమాలాగచూసే కాలజ్ఞాన దృష్టి ఆయనలో సంపూర్ణంగా మరింత విచ్చుకున్నాయి ఇలా మూడేళ్లున్నాడు ఇండియాలో

ఇంతలోనే కీరో ఇంగ్లండుకు తిరిగి వెళ్లే ప్రయాణంకోసం బొంబాయి చేరుకుని లండన్ లోని తన సంబంధీకులతో బోగట్టా చేయగా ఒక ఆశ్చర్యం జరిగింది. ఒక ధనవంతుడైన దూరపు బంధువు మరణిస్తూ తన యావదాస్తినీ కీరోపేర వ్రాసి, అతడు ప్రపంచంలో ఎక్కడవున్నా సరే అతనికి ఈ భోగట్టాతెలిపి ఆసొమ్మును అందజేసే ఏర్పాటుచేసి తాను మరణించాడు.

భారతదేశంలోని నీ విద్యాభ్యాసం పూర్తి అయింది ఇక నీయొక్క ధర్మం జ్యోతిషం గురించి విదేశాలలో ప్రచారం చెయ్యడమే త్వరలోనే నీయొక్క కర్మయే అదృష్టంలాగా విదేశాలలో నీకు పిలుపు నిస్తుంది వెళ్ళు అన్న తన గురువు మాటలే అక్షర సత్యాలై అతనికి ఇంగ్లండు వెళ్ళేందుకు డబ్బును కూడా సనకూర్చాయి. విధి విధానానికి ఆశ్చర్య పడుతూ ఒక ప్రయాణపు ఓడలో ఫస్ట్ క్లాస్ ప్రయాణీకుడుగా సగౌరవంగా ప్రయాణించి క్షేమంగా లండను చేరుకున్నాడు.

తన చిన్నతనంలో తండ్రికి కీరో ఒక ప్రమాణంచేశాడు. ఏమని అంటే జాతకాలు గాని , జ్యోతిషాలుగాని, మంత్రతంత్రాలుగాని మన క్రైస్తవ కుటుంబ సాంప్రదాయానికి విరుధ్ధాలైనవి , ఒక వేళ వాటిని తాను నేర్చుకున్నా ప్రాక్టీసు చేసినా సరే తన కుటుంబం పేరు ఇంటి పేర్లూ బైట ప్రపంచంలో ఏ మాత్రం తెలియకుండా తాను ఒక కొత్త పేరుతో, మారుపేరుతో జీవిస్తానని.

ఆ విషయమే ఆలోచిస్తూ ఎలా చెయ్యడమా అని ఆలోచిస్తూ ఆలాపనగా ఊహాలోకంలో పడ్డ కీరో మనస్సు తెరపై స్పష్టంగా కొన్ని అక్షరాలు కనపడ్డాయి. టి.వి.పై తెరపై అక్షరాలవలే “CHIERO”
అన్న పెద్ద అక్షరాలుగల పేరు చూసి దాన్ని వెంటనే నోట్ చేసుకుని ఆ పేరులోని అంకెలన్ని కూడితే ఆశ్చర్యం సంఖ్యా శాస్త్రం లోకల్లా అదృష్టకరమైన అంకె 23 వచ్చింది.

జంట సంఖ్యలలోకెల్లా అదృష్టమైన అంకెగా 23 కు ఆకాశంలో నక్షత్రంలాగా వెలిగే సింహం రాజుల మద్య రాజువలె మృగరాజు లేక The “ Royal Star of the Lion” the king of the Heavens
అని అర్ధం వచ్చింది. వెంటనే ఈపేరు, సంఖ్యా తనకు సరిపోతుందని తాను నవంబర్ 1 తేదీన పుట్టినందున సూర్యుడికీ సింహరాసికి రెంటికీకూడా ఈ పోలిక బాగా నప్పింది.

మరుక్షణమే లండన్ లో బోర్డు వ్రాసే ఓ పెయింటర్ వద్దకు వెళ్ళి ఒక చిన్న అందమైన నోటీస్ బోర్డు వంటిది చెక్క పలక మీద పై పేరును అందంగా చెక్కించి బంగారం రంగుతో పెయింట్ చేయించాడు. మంచి అధృష్ట గడియ సమయం చూసి, ఆబోర్డును తన గది బయట మేకులుకొట్టి బిగించాడు. అలా కీరో కొత్త జీవితం లండన్ మహానగరంలో ప్రారంభమైనది.

అలా కీరో అన్న తన పేరుతో బోర్డును ఇలా తగిలించాడో లేదో మెయిన్ రోడ్డువెంట విలాసంగా వెళుతూ ఒక మధ్యవయస్కుడు ఒక సూటూ, నల్ల కళ్ళద్దాలూ తగిలించి సరదాగా పచార్లుచేస్తూ కీరో అన్న పేరు బోర్డుపై మనుష్యుల భవిష్యత్తు అదృష్టము తెలుపబడును. అనిఉంటే చూసి ముచ్చటపడి లోపలికి వచ్చాడు.

కీరో ఎదురుగావున్న టేబుల్ ముందు కూర్చుంటూనే నాకీ మూఢవిశ్వాసాలు లేవు అయినా మీరేం చెబుతారో చెప్పండి అంటూ మీఫీజు ఎంత అని అడిగి తన చేతినిచాపి టేబుల్ పై వుంచాడు. ఆ వ్యక్తి చేతిలోని గీతలు రేఖలు చూసి కీరో త్రుళ్ళి పడ్డాడు. ఆయన ఒక అసాధరణ వ్యక్తిలా కనిపించాడు. క్రమంగా అతని బాల్యము , మంచితెలివితేటలుగల ఉన్నత మధ్యతరగతిలో పుట్టుక అక్కడనుండి యూనివర్సిటీదాకా చదువూ, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలమూ , అప్పుడప్పుడే రాజకీయాలలో ఉన్నత రాజకీయ వేత్తలతో పరిచయమూ....... ఇలా అన్నీ పూసగుచ్చినట్టు చేతిలోని రేఖల్లో చదేవేశాడు.

బాబోయ్ మీరేమన్నా మనిషా లేకపోతే ఏదోరకమైన స్పిరిట్ వంటిజీవుడా అదేమిటి అన్నీ చెప్పేస్తున్నారు. అంటూ భయపడ్డాడు. కీరో నవ్వుతూ మెడిసన్ లో ఒక సైన్సుప్రకారం రోగి శరీరంలోని కండలు, నరాలు , చర్మం, గోళ్ళు వాటిరంగు చూసి ఆ మనిషి ఆరోగ్యాన్ని డాక్టర్లు ఎలాగ చదివేస్తారో అలాంటిదే ఇదీ ఒక రకమైన శరీర శాస్త్రం మీద ఆధారపడ్డ సైన్సు అటూ హేతువాద ప్రకారం హస్తసాముద్రికం పునాదిని సైంటిఫిక్ గా వివరించాడు.

ఆయన స్థంభీభూతుడై మంత్రించినట్టు ఆలా వింటున్నాడు. చివరకు మీరు చెప్పిన ఈ చిన్న వివరణకైనా నేనిచ్చే ఈ ఫీజు నష్టంకాదు. మనిషి గతంలో చేసిన పని గీతలు అరచేతిలోని మనిషి అరుగుదలను బట్టి వ్రేళ్ళ మడతలను బట్టి గతంలోని సంఘటనల తాలూకు గుర్తులు అచ్చులు పడవచ్చు. ఆది సాధ్యమే ఒప్పుకుంటాను. కాని మహాశయా ఎపుడో దూరంగా భవిష్యత్తు లో ఉన్న సంఫటనలు వాటి మార్కులు లేకగుర్తులను మన అరచేతిలో ముందుగానే వేస్తాయంటే నాకెందుకో ఎంత ఆలోచించినా అదేలాగ సాధ్యమో బోధపడుటలేదు.ఆన్నాడు.

కీరో ఆయన పుట్టిన తేది, నెలా, సంవత్సరమూ, అన్నీ తీసుకొని సంఖ్యాశాస్త్రం ప్రకారం గణితం చేస్తూ ఒక్కొక్క అంకెనూ, ఆయన పుట్టిన సంవత్సరానికి కలిపితే జీవితంలో ఆ తరువాత వచ్చే మలుపూ లేక ముఖ్య సంఘటనలూ ఎలా వస్తున్నాయో లేఖ్ఖవ్రాసిమరీ చూపించాడు. ఆ అంకెలన్నీ లిష్టువేసి చూపిస్తూ ఆయన అరచేతిలోని రేఖలు దగ్గర పెన్సిలు గుర్తులు పెట్టి చూపుతూ భవిష్యత్తులో ఆయన రాజకీయాలలోకి ఎలా ప్రవేశిస్తాడో క్రంమంగా బ్రీటీషు పార్లమెంటు లోకి ఎన్నిక కావడం పార్లమెంటు మెంబరుగా ఉన్నత గౌరవం ఆధికారం అన్నీ, ఎలా సూచించబడ్డాయో కీరో తన మనస్సులో సినిమాలాగ కనిపించిన వన్నీ ఒక్కొక్కటే వర్ణించి చెప్పాడు.

ముఖ్యంగా ఆయన చేతిలోని అదృష్టరేఖ , చాకుతో గీసినట్టు నిటారుగా చూపుడు వ్రేలుక్రిందకు గీసినట్టు నిటారుగా చూపుడువ్రేలుక్రిందకు గీసినట్టుండి అక్కడ వున్న గురు స్ధానాన్ని చేరడంతో స్పష్టంగా ఆయనకు భవిష్యత్తులో మహోన్నతమైన పదవి, గౌరవం, కీర్తీ లభిస్తాయని ఆయన భవిష్యత్తునుగూడ చదివేశాడు.

తరువాత ఆయన బ్రీటీషు రాజకీయాలలో మహోన్నత పదవి చేరుకున్న లార్డ్ –బాల్ఫోర్ గా, రాజకీయాలలోనూ బ్రిటీషు పార్లమెంటులోనూ కూడా ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది.

చివరకు ఆయన చేతిలోని రేఖలను ఇటు, అటు త్రిప్పిచూస్తూ ఇలా అన్నాడు కీరో.
మహాశయా మీ చేతిలో ఒక విచిత్రమున్నది. నాకు ఎంత వెతికినా మీ హస్తరేఖలలో పెండ్లి గురించిగాని, వివాహం, సంసారిక జీవితం వాసనలు గాని చూపించే రేఖ ఏదీ కనిపించడం లేదు. ఇదేదో విచిత్రంగా వుంది. అన్నాడు.

దానికి ఆయన నవ్వుతూ కీరో మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు సత్యం , నేను జీవితాంతం బ్రహ్మచారిగానే వుండాలని చాలా కాలం క్రిందటే నిశ్చయించుకున్నాను. నా సమాజ జీవితానికి నా సొంత జీవితం అడ్డు రాకూడదని అలా చేశాను . నా అదృష్టంలో కూడా అలానే వ్రాసి పెట్టివుందా చాలా ధాంక్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి సెలవు తీసుకున్నాడు.

చాలా సంవత్సరాల తరువాత అతడు పార్లమెంటులో సభానాయకుడై తనకు, ముందే జ్యోతిషం చెప్పిన కీరోకి చెప్పిన కీరోకి కృతజ్ఞతగా ఒక పెద్ద డిన్నర్ ను గౌరవ సభనూ ఏర్పాటు చేశాడు. దానితో కీరో పేరు ప్రఖ్యాతులు లండన్ నగరంలోనే కాకుండా యూరప్ లోని అన్ని దేశాలలోనూ మారు మ్రోగింది. వార్తలద్వారా మరియు న్యూస్ పేపర్లద్వారా.

అలా ఫ్రారంభమైంది కీరో అన్న పేరు తగిలించిన మరుక్షణంనుంచే తనకు కొత్తజీవితం. ఆరోజునుండి దాదాపు పాతికేళ్ళు ఉపిరి సలపకుండా సమాజంలో మహోన్నత వ్యక్తులు , ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్లు, యూరప్ లోని రాజులు హాలివుడ్ సినిమా స్టార్ లు , అమెరికా బిజినెస్ లోని కోటీశ్వరులు, పేరుమోసిన కొందరు గూఢచారులు, వీరూ వారూ అనే తేడాలేకుండా కీరో వద్దకు జాతకాలు చూపించుకునేందుకు వచ్చేవారు. ఐనా తమకు కీర్తి, ధనము, పలుకుబడి ఎంత పెరిగినా కీరో మాత్రము తన గురువు చెప్పిన ఒక ముఖ్యసూత్రమూ , మాత్రం మరచిపోకుండా పాటించాడు.

అదేమిటంటే కష్టాలలో వున్నవారూ , అనాధలూ, స్త్రీలూ, జైలులో శిక్షలనుభవించేవారూ కీరో సహాయం ఎవరు కోరినాసరే వారికి తన జ్యోతిషంతో సహాయము, సలహా, తన ప్రేమా అభిమానం అందించేవాడు ఫీజులేకుండా.

దరిద్రనారాయణుని సేవలోనే పరమాత్ముని సేవ వుందని చెప్పే ఇండియాలోని తనగురువు మాటను కీరో ఎన్నడూ మరువలేదు. ఫలితంగా ఒకానొక అదృశ్యమైన దైవిక శక్తి కీరో వెంట నిత్యమూ రక్షణగా వుండేది. ఎన్నోసార్లు ఆయనను గొప్ప కష్టాలలోనుండి కాపాడింది అదే.

అదే నేను నమ్మే దైవం నిష్కారణమైన ప్రేమా, సానుభూతీ అవే నా దైవం. అంటూడు కీరో. బాగా పండిపోయిన తన 80 వ ఏట గతించిన తన అనుభవాలను నెమరువేస్తూ గతాన్ని గుర్తుచేసుకుంటూ.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP