శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దారిద్ర్యాలను దూరంచేసే కనకధారాస్తవం

>> Thursday, August 7, 2008

బ్రహ్మచారిగా విధ్యాభ్యాసం చేస్తున్న శంకరాచార్యులవారు ఒకరోజు భిక్షార్థియై ఒకరోజు ఒక నిరుపేద ఇంటిముందు నిలబడి, భవతీ భిక్షాందేహి అని అడిగారట. పాపం దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న ఆఇల్లాలు ఇంటిముందుకొచ్చి యాచించిన వారికి ఏమీ ఇవ్వటానికి లేక బాధపడుతూ అంతావెదుకుతున్నది. అర్ధిని రిక్తహస్తాలతో పంపితే అది దోషమవుతుంది. అదితెలియక మనం యాచించిన వారిని కసురుకుంటాము. కానీ ధర్మంతెలిసిన ఆఇల్లాలు, ఇల్లంతావెదకగా ఎండిపోయిన ఒక ఉసిరికాయ మాత్రమే దొరికినది. ఎంతో ఆవేదనతో కుమిలిపోతూ, ఆ కాయనేతెచ్చి శంకరుల భిక్షాపాత్రలో వేసి కళ్ళలో నీరుకుక్కుకుంటూ నమస్కరించినదట. సర్వజ్ఞులైన ఆచార్యులవారి మనస్సు ఆతల్లి ధర్మనిష్ఠకు, వారిపేదరికపు బాధకు కరగిపోయినది. వెంటనే సకలసంపదలనొసగే ఆ మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ స్తోత్రం చేసారట. అండుకు మిగుల సంతోషించిన ఆజగన్మాత ప్రత్యక్షమై ఏమికావాలినాయనా అని అడిగినదట. అప్పుడు తల్లీ ఈ ఇల్లాలి దారిద్ర్యాన్ని తొలగించమని వారువేడుకొనగా, ఈ గృహిణీ పూర్వజన్మమున ఏ పుణ్యకార్యము చేయనందున నా అనుగ్రహము కలుగలేదు ఈమెపై అని తల్లిసెలవిచ్చినది. అప్పుడాయన ఈమె నాకిపుడొసగిన ఉసిరికాయ వలన వచ్చిన పుణ్యమును పరిగణించి కనికరించమని వేడగా ,ఆఇంటిలో బంగారపు వుసిరికాయలను కురిపించినది అమ్మ. అందువలనే ఈ స్తోత్రమునకు కనకధారా స్తవమని పేరు. ఇప్పటికీ దారిద్ర్య బాధతో కుమిలిపోతున్న వారెందరో ఈ స్తోత్రాన్ని జపించి తమ దరిద్రాలను దూరంచేసుకుంటున్నారు. నేను కూడా ప్రత్యక్షప్రమాణంగా కొందరిచేత పారాయ\ణం చేపించగా వారికి ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి. లక్ష్మీదేవికి ఇష్టమయిన ఈ శ్రావణమాసములో ఈస్తోత్రాన్ని పఠించి ఆతల్లి కరుణను అందరూ పొందాలని కోరుకుంటున్నాను.


కనకధారాస్తవం

అజ్గం హరేః పులక భూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభారణం తమాలం
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్య దాస్తు మమ మంగల దేవతాయః!


ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్జ్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని,
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభవాయః !

విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష
మాననంద హేతు రధికం మురవిద్విషో పి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం
ఇందీవరోదర సహోదర మిందిరాయః !

ఆ మిలితాక్ష మధిగమ్య ముదాముకుంద
మానందకంద మనిమేష,మనంగ తంత్రం
ఆ కేకరస్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః !

కాలాంభుదాళి లలితో రసి కైటభారే
ర్దారాధరే స్పురతి యా తటి దంగనేవ
మాతు స్సమస్త జగతాం మహనీయమూర్తి
ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయః!

బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తు భేయా
హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతో పి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః !


ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్య భాజి మధు మాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః !

దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంభువాహః !

ఇష్టా విశిష్టమతయో పి య యా దయార్ధ్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం భజంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !

గీర్దేవ తేతి గరుడ ద్వజ సుందరీతి
శాకంబ రీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యైనమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫల ప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై !

నమోస్తు హేమాంబుజపీఠికాయై
నమోస్తు భూమండలనాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమొస్తు శార్జాయుధ వల్లభాయై !

నమోస్తు దేవ్యే భృగునందనాయై
నమోస్తు విష్ణో రురసిస్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై !

నమోస్తు కాన్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై!


సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మా మేవ మాత రనిశం కలయంతు మాన్యే !

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్ధ సంపదః
సంతనోతి వచనాంగమానసై
స్త్యాం మురారి హృదయేశ్వరీం భజే !

సరసిజనయనే! సరోజహస్తే!
ధవళతరాంశుక గంధమాల్యశోభే!
భగవతి!హరివల్లభే మనోజ్ఞే !
త్రిభువనభూతికరి! ప్రసీద మహ్యం !

దిగ్ఘ్నస్తిభి కనకకుంభముఖావసృష్ట
స్రగ్వాహినీ విమలచారు జలఫ్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రీం !

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మామకీంచనానాం
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః !

బిల్వాటవీ మధ్య లసత్సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ !

కమలాసన పాణినాలలాటే లిఖితా
మక్షరపంక్తి మస్య జంతోః
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ద్రీమ్ !

అంబోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృ గృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మేహృదయారవిందమ్ !

స్తువంతి యే స్తుతిభి రమూభిరన్వహం
త్రయీమయీంత్రి భువనమాతరం రమాం
గుణాధిక గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధభావితాశయాః !


ఫలశృతి

సువర్ణధారాస్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేనిత్యం స కుబేరసమోభవేత్

2 వ్యాఖ్యలు:

జ్యోతి August 8, 2008 at 2:43 AM  

కనకధారాస్తవం పూర్తి పాఠం

ఇక్కడ

చిలమకూరు విజయమోహన్ August 8, 2008 at 4:41 PM  

కనకధారాస్తవమ్ పూర్తి స్తోత్తాన్ని నా టపాలో ఇస్తున్నాను చూడండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP