శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మచేతివంట.....ఆరోగ్యాల పంట.

>> Saturday, August 2, 2008

భారతీయులకు శుభ్రత , శుద్ధి వారిజీవిత విధానములో భాగాలు. విదేశీయులకు తాము తెలుసుకున్న విజ్ఞానమువలన పదార్ధాలను స్థూలముగా శుద్ధిపరచటమువరకే తెలుసు. కానీ ఆవస్తువును సూక్ష్మస్థాయిలో దానిప్రభావాన్నికూడా కనిపెట్టిన మహర్షులు ఎలాశుద్ధిపరచాలో మన ఆచారాలలో పొందుపరచారు. మామూలుగా ఆహారపదార్ధాలను సూక్ష్మజీవిరహితముచెయ్యటమువరకే మనము సుద్ధిపరచటము అనుకుంటాము. కానీ దానిస్తూలాంశము రక్తములోకలసి ధాతుపుష్టిని కలిగిస్తుంది. కానీ ఆహారములో భావనాపరమయిన సూక్ష్మాంశాలు మనసుమీదప్రభావాన్నిచూపుతాయి. అది కనిపెట్టిన మనపెద్దలు ఎక్కడపడితే అక్కడ తినొద్దుఅని చెప్పారు. దానిని నిరూపించిన యదార్ధ సంఘటన ఇది.

కర్ణాటకప్రాంతములో ఒకయోగి వుండేవాడు. ఆయన ఒక నదీతీరములో చిన్న కుటీరము నిర్మించుకుని, దానిలో తనజపధ్యానాదులను సాగించుకుంటూ ఒంటరిగా ,ఎక్కువగా మానవ సంబంధాలు పెంచుకోకుండా తనసాధన తానుచేసుకుంటూవుండేవాడు. అక్కడికిదగ్గరలోనే వున్న గ్రామస్తులకు ఆయనంటే గౌరవభావం పెరిగింది. ఎప్పుడన్నా కనపడితే నమస్కారం పెడితే ఆయన నవ్వి పొడిపొడిమాటలతో వారితో అంతవరకే పలకరింపువరకే పరిమితంచేసేవాడు. తనకు కావలసినవి నెలకొకసారి దగ్గరలోని పట్టణానికి పోయితెచ్చుకోవడం తనమానాన తానువుటుండటము ఎవరినీ ఏదీ యాచించకపోవడం గ్రామస్తులకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఆగ్రామములో ఒక గృహస్తు ,అచారవంతుడు సాధుసేవపట్ల ఆశక్తి కలిగినాయన ఒకరుండేవారు. ఆయనకు ఈ యోగిపట్ల చాలా గౌరవభావం. ఇటువంటి యోగికి బిక్షనివ్వటం గృ హస్తులకు పుణ్యప్రదం .ఆయనకు ఒకరోజన్నా బిక్షనివ్వాలన్న తలంపు మనసులో గాఢంగా కలిగింది. కానీ ఎవరితో పదినిమిషాలు మాట్లాడటానికికూడా ఇష్టపడని ఆయన తనకోరిక మన్నిస్తాడా? అన్న సందేహంతో చాలారోజులు వూరుకున్నాడు. కానీ ఒకరోజు సాహసించి ఆయన దగ్గరకెళ్ళి తన కోరికను వెళ్ళడించాడు. ఒక్కపూట తమయింట్లో భోజనముచేసి తన గృహాన్ని పావనం చేయమని అభ్యర్ధించాడు. ఆయన యేకళనున్నాడో గాని, ఈయన మాటకు అంగీకారాన్ని తెలిపి ఈరోజు మీయింట్ళో భోజనానికొస్తానని మాటిచ్చాడు.

ఆగృహస్తు ఆనందముతో ఇంటికి వెళ్ళి తనభార్యకీవిషయము చెప్పి ఏర్పా\ట్లుచూడమన్నాడు. అయితే ఆమె " అయ్యో ఎంతపనిచేసారు. ముందుగానాకుచెప్పవలసినది. ఈరోజే నాకు నెలసరి వచ్చినది. ఇప్పుడేలా చేయాలి అని నొచ్చుకున్నది. మరెలాచేయాలి అని భర్తబాధపడ్డాడు. రాకరాక ఈ అవకాశము వచ్చినది . ఇప్పుడు వద్దుఅని చెప్పటం భావ్యంకాదు. ఏమిచేయాలని భార్యాభర్తలిరివురూ మధనపడ్డారు. చివరకు భార్య ఒక సలహాచెప్పినది. మనవూరిలో వం|టలు చేసేఆవిడ వున్నదికదా! ఆవిడను పిలవండి నేను బయటవుండే అన్నీ చెప్పిచేపిస్తాను ,అని సలహా ఇచ్చినది. ఎలాగోలా ఈ కార్యం గట్టేక్కించాలని ఆయన వెళ్ళి ఆ వంటలకు వెళ్ళే ఆవిడను తీసుకువచ్చాడు . ఆవిడచేత భార్య సలహాలిస్తూ వంట పూర్తిచేపించగా, భర్త మధ్యాహ్నం వెళ్ళి ఆయోగిని పిలుచుకుని వచ్చి తానే స్వయముగా వడ్డించాడు. చివరలో ఒక చక్కని వెండిగిన్నెలో పాయసం ఇచ్చాడు. ఆయోగికూడా తృప్తిగా భోజనం చేసి. పాయసం తాగుతూ ఆగిన్నెను పరిశీలించాడు. చక్కని నగిషీలతో అది ఎంతో అందముగా వున్నది. ఇది పూజాపీఠమువద్ద చాలా వుపయోగకరముగా వుంటుంది. ఈ గృహస్తు కూడా ధనవంతుడు. ఈ చిన్న గిన్నెతీసుకున్నందువలన వీరికేమీ బాధవుండదు, ఇలా ఆలోచనలు మొదలయ్యాయి యోగిమనస్సులో. ఆయన ఎవరూగమనించకుండా దానిని తనవెంటతెచ్చుకున్న చిన్న చేసంచిలోకి నెట్టాడు. తరువాత గృహస్తుఇచ్చిన తాంబూలాది సత్కారాలను స్వీకరించి తన కుటీరానికి వెళ్ళి పోయాడు. ఇటు ఈయనకూడా ఒకమహాత్మునికి తనైంటభోజనం పెట్టగలిగాననే సంతోషంతో గిన్నెసంగతి గమనించలేదు.
ఇక వెళ్ళిన యోగి కి సాయంత్రం స్నానం చేసిన వద్దనుండీ మనసులో అపరాధభావన మొదలయినది.అయ్యో ఎంతపనిచేసాను. ఎప్పుడూ ఎవరి నుండి ఏదీ ఆసించని నాకు ఇలా దొంగతనం చేయాలనే బుద్ధి ఎలా పుట్టింది? అన్నం పెట్టి ఆదరించిన ఇంట్ళో దొంగలుకూడా చెయ్య ని పనిని నేనెలా చేసాను? నాజపం తపం ఎందుకు తగలెయ్యనా? అని పరిపరివిధాల బాధపడుతున్నాడు. ఆబాధ తీవ్రమయిన దు:ఖముగా మారి రాత్రంతా ఏడుస్తూ గడిపాడు. తెల్లవారుతుండగనే హృదయభారాన్ని ట్టూకోలేకత పరుగు పరుగున ఆ గ్రామము వె\ల్లి గృహస్తు కాళ్ళమీద పడి ఏడ్వసాగాడు. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన ఇంటాయన తానేమి అపచారం చేసానోనని హడలిపోతూ. ఆయోగి కాళ్ళు పట్టుకుని తానూ ఏడ్వడము మొదలుపెట్టాడు. ఈ హడావుడికి అందరూ ప్రోగయ్యారు. ఏమిటంటే ఏమిటని వివరాలు ఆరాతీసారు. అప్పుడు ఆయోగి ఏడుస్తూనే తానెటువంటి నీచపుపనికి పాల్పడ్డాడో చెప్పాడు. అయ్యో దాని కేమిభాగ్యం అని ఇంటాయన ఓదార్చినా ఆయన దు:ఖము మానలేదు. అప్పూడు పెద్దలు అపరిగ్రహ నియమముతో వుండే యోగి దొంగతనానికి పాల్పడటాని కి మూలము ఏమిటా అని ఆలోచించి, అసలేమిజరిగినదీ చెప్పమన్నారు. అప్పుడు తనభార్య ఇంట్ళోకి రావటానికి వీలులేనందున వంటావిడ చేత వంటచేపించి తానువడ్డించిన విషయం అంతా వివరించాడు. అప్పుడు చెప్పారు శాస్త్రమెరిగిన పెద్దలు. ఆవంటావిడకు కాస్త చేతివాటం వుంది. అది వూర్లో అందరికీతెలుసు. తాను వంటకు వెళ్ళిన చోట ఏదోవొకటి నొక్కెయ్యడం ఆమె బుద్ధి. ఆబుద్ధితో వంటచేసిన కారణంగా అది ఆహారమును ఆశ్రయించుకుని తిన్న యోగిమనసును కూడా కలుషితం చేసినది అని వివరించి ఆయోగికి ప్రాయశ్చిత్త క్రియను సూచించి పంపివేశారు.
అందువలననే మన పెద్దలు ఎవరి దగ్గరపడితే వారివద్ద భుజించరాదు అని సూచించారు. అనాచారవంతులు, దుర్మార్గుల భోజనం స్వీకరిస్తే ఆభావాలు మనకు సంక్రమించేప్రమాదం ఉన్నది. తల్లి చేతిభోజనం బిడ్డకు బలాన్నిస్తుంది . కారణం, తనబిడ్డ కడుపునిండాతిని ఆరోగ్యంగావుండాలనుకునే తల్లి మనసులోని ప్రేమభావన ఆహారానికి ఆశక్తినిస్తుంది. దు;ఖముతో చేసేవంట తిన్న ఆఇంటివాళ్ళకు కూడా రుచి లేక తృప్తినీయకుండాఉంటుంది. తనపిల్లలూ ,తన భర్త చక్కగాతినాలనే భావనతో వంటచేస్తే పచ్చడిమెతుకులయినా పరమాద్భుతమయిన రుచినిస్తాయి. అలాకాక ఏ దిక్కుమాలిన టీవీ సీరియలో చూస్తూ ఆ హీరోయిన్ల బాధలు చూసి ఏడుస్తూనో, లేక పగప్రతీకారంవంటి పాత్రలస్వభావాలతో మమేకమవుతూ వంటచేస్తే అదితిన్న కుటుంబసభ్యులకు అనారోగ్యాలు కలగటం ఖాయం. కను క తల్లులందరూ తమ కు\తుంబానికి తాము వండిపెట్టాలని ప్రయత్నించాలి .హోటల్ కూడూ వంటవాల్ల తిండీ మీద అధారపడితే మనకు ఎంత ఖర్చుచేసి వండినా రుచీ పచీలేక, అనారోగ్యాలకు కారణమవుతాయి .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP