కదలివచ్చిన కనకదుర్గ . ఇది జరిగిన వాస్తవగాథ
>> Wednesday, July 2, 2008
శ్రీవెంకటేశ్వర జగన్మాత పీఠ స్థాపకులు వెంకయ్య గోవిందమ్మ దంపతులు dhnayajIvulu.
ఇది 80 సంవత్సరాల క్రింద ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కనికరించి కదలివచ్చి భక్తజనరక్షణ చేసిన ప్రత్యక్ష గాధ ఇది.
ఇందులో నమ్మ లేని నిజాలు ఏభేషజము లేకుండా భగవంతుని శరణాగతి పొందగలిగినవారికి మాత్రమే అర్ధమవుతాయి. అనుమానాస్పద జీవులకు ఆలీలలు అర్ధముకావు. దయచేసి మన చిన్న ప్రమాణాలతో వీటిని కొలవటానికి ప్రయత్నించకండి. అపార కరుణారాశి అమ్మప్రేమకు హద్దులు వుండవని గమనించండి.
మాజేజినాయన [నాన్నగారితండ్రి] బల్లేపల్లి వెంకయ్య గారి స్వగ్రామము గంగన్నపాలెం. ఇది గుంటూరుజిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట మధ్యలో రహదారి మీదనేవున్నగ్రామము. కోటప్పకొండకు దగ్గరే . ఈయన తల్లిగారు కోటమ్మగారుశివభక్తురాలు. మాలకిచ్చన్న అనేసిధ్ధపురుషుని గురువుగా భావించి రామలింగేస్వరుని కొలచేదట. ఈ మాల కిచ్చన్నగారు బహిర్భూమికి వెళ్ళిన సమయములో సహితము శివనామ స్మరణఏమరక చేసేవారట. తనదగ్గరున్న చెంబులో నీళ్ళను అక్కడున్న ఏరాయిపయనో పోస్తూ నమశ్శివాయాని జపిస్తూ వుండేవారట. సర్వముభగవన్మయముగా దర్శించిన అవధూత స్థితి అది. తక్కువకులము వాడని , తగనిపనులు చేస్తున్నాడని ఆక్షేపించిన పండితులకు ఆత్మబోధగావించిన మహాపురుషుడు మాల కిచ్చన్నగారిని మా పూర్వీకుల గురు పరంపరను స్మరించుకుని ముందుకు సాగుతున్నాను. మాజేజినాయ నగారితండ్రిగారిపేరు ఓబయ్య పరమ అమాయకుడట.
మాజేజినాయన గారికి రవ్వవరములో పెద్దరైతులైన కొమిరిశెట్టి పెదబ్రహ్మయ్య చిన బ్రహ్మయ్య గారల చెల్లెలు గోవిందమ్మ [మా నాయనమ్మ] గారలతో వివాహమయి మానాన్న గారు కాక మరి ముగ్గురు పిల్లలు కలిగారట. ఈయన నాటకాలు వేస్తూ గ్రామములో సరదాగా తిరిగే వాడట. పూర్వకాలములో చదువు పట్ల అంతగా శ్రధ్ధ చూపరుగనుక ఈయనకూడా ఏదో అక్షరాలు గుర్తుపట్టేవరకు చదువుసాగించారు. శనివారము మాత్రము వేంకటేశ్వరునికి పూజచేస్తూ వుండేవాడేగాని పెద్దగా భక్తిభావన కలిగినవాడుకాదు.
కొతకాలము సాగిన తరువాత ఈయన జీవితములో అనుకోని కష్టాలు ప్రా రంభమయ్యాయి. ఈయన కు విరోధిగా ముద్రపడిన ఈయన బాబాయి ,పిన్నిలు మరణించగా మనిశితో శత్రుత్వము మరణానంతరము మరచిపోయే పాతకాలము వారుగనుక ,నీటమునగవలసిన దాయాదిగనుక ఈయన కూడా పెద్దఖర్మకు హాజరయి నాడు .అంతేకాక తన పిల్లలను కూడా మానాయనమ్మ వద్దంటున్నా వినకుండా తీసుకెళ్ళీ వారి ఖర్మ కాండలో పాల్గొన్నాడు. మానాన్న గారికి మాత్రము ఆరోజు జ్వరముగా నున్నందున మా జేజి పంపకుండా ఇంటివద్దే వుంచినదట. పెద్దఖర్మకు వెళ్ళి వచ్చిన సాయంత్రమునకు పిల్లలకు జ్వరము వచ్చి అదిపెరిగిపోయి ఒంకరి వెంట మరొకరు నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురుపిల్లలు మరణించటముతో దంపతులు గుండెలు పగిలేలా రోదించారు. వారు జీవచ్చవాలుగా మారినారు. బంధువులు వాల్ల అమ్మగారు వీరిని ఎలా కాపాడాలో తెలియక తల్లడిల్లినారట. ఈదుః ఖముతో మానాయనమ్మ గారు అపస్మారక స్థితిలో కిజారుకున్నది. ఇది మరొక ఘాతమయినది ఆయనకు .రోదిస్తూ తనభార్య అయినా దక్కుతుందో లేదోనని తల్లడిల్లుతున్న ఆయనకు వాళ్ళ అమ్మగారు. నాయనా ఇది పిశాచ రూపులయిన మీ బాబాయి వాళ్ళు కల్పిస్తున్న కష్టం. దీనిని మానవ మాత్రులము మనమేమీ చేయలేము .అయినవోలు దగ్గరున్న పెద్దవరములో దేవీ భక్తులయిన బ్రాహ్మణులు వున్నారు వెళ్ళి వాళ్ళను ఆశ్రయించమని పంపినది. ఆదుః ఖ్ముతోనే ఆయన పెద్దాపురము వెళ్ళగా అక్కడవున్న బాలా వుపాసకులగు ఆమహాను భావులు, అయ్యో ఎంత పనిచేసుకున్నావయ్యా ఇప్పటికయినా తెలుసుకున్నావు అని వోదార్చి అమ్మవారి కుంకుమను ఇచ్చి, ఇది నీ భార్యకు పెట్టు , ఇది ఆపదసమయం .నీభార్యకు మెలకువ రాగానే కట్టుబట్టలతో ఆవూరినుంచి బయటకు వచ్చేయి. మరలా ఇప్పటిలో ఆ గ్రామము వెళ్ళకు అని చెప్పి దీవించి పంపారట. ఆయన ఇంటికి వచ్చి కుంకుమ పెట్టగానే మరుసటిరోజు తెల్లవారు ఝా మునకు మానాయనమ్మ గారికి మెలకువ వచ్చినదట. దాంతో ఆయన వున్న ఇంటిని తల్లిని తన ఇద్దరు అన్నదమ్ముల కప్పగించి అప్పటికప్పుడే బయకుదేరి నరసరావు పేటలో రైలెక్కి అయినవోలు స్టేషనులోదిగి 15 మైళ్ళు నడచి రవ్వవరము చేరుకోవటము, అదీ మూడురోజులుగా తిండిలేక మనసృహలో లేని మనిషి, అమ్మ అనుగ్రముకాక మరింకేమిటి. ఆతరువాత రవ్వవరము లోనే ఒఅక ఇల్లు తీసుకుని ఒక నెల గడచిన తరువాత ఆమెకు ఆరోగ్యము కుదుటపడిన తరువాత గంగన్న పాలెం వెళ్ళి ఇల్లూ వాకిలీ సరిచూసుకుని వెంటనే వచ్చేద్దామని బుద్ది పుట్టినది. ఇద్దరూ మా నాన్న గారిని ఇక్కడ మేనమామల దగ్గరే వుంచి మరలా గంగన్న పాలెం వెళ్ళారు. వెళ్ళిన రోజు సాయంత్రానికే మా నాయనమ్మకు ఐ దవనెల గర్భము స్రావముజరిగి మనసృహలో లేకుండా తీవ్రజ్వరములోకి వెళ్ళినది. ఇక ఈయన ఏడుపు మొదలుపెట్టాడు. వాళ్ళమ్మగారు దుఃఖించి వద్దని చెబితే వచ్చావేమిరా నాయనా ఇప్పుడేవరురా దిక్కు అని ఏడుస్తుండగానే ఆయన లేచి పెద్దవరము బయలుదేరి వెళ్ళీనాడు. అక్కడకు వెల్లగనే వాళ్ళు కోపపడి చెబితే వినక పోతివి. మేము ఇప్పుడల్లా ఆ గ్రామము వద్దని చెప్పాము కదా ? చేయగలిగినది ఏమీ లేదు అమ్మను నమ్మ టము తప్ప .ఈకుంకుమ తీసుకెళ్ళి పెట్టు .ఎప్పుడు నీ భార్య స్పృహ లోకి వస్తే అప్పుడూ క్షణము ఆలస్యము చేయకుండా బయలుదేరు అని జాగ్రత్తలు చెప్పి పంపినారు. మైల, నిష్ట గురించి చూసే సమయము కాదిది అని హెచ్చరించినారు. ఆయన కుంకుమ తీసుకుని వచ్చేసరికి పరిస్థితి తీవ్రముగా వున్నది. అక్క డున్న నాటువైద్యులు, తమకు తోచిన వైద్యము అం దించినా ఆమె మన సృహలో లేదు. రాత్రి గడుస్తున్నకొద్దీ ఈయన వేదన పెరిగిపోతున్నది. అమ్మా నాచేతులారా నా పెళ్ళాన్ని చంపు కుంటున్నానమ్మా. వద్దని చెప్పినా వచ్చాను అని విలపిస్తున్నాడట. అర్ధరాత్రి సమయానికి ఈమెకు స్వప్నములో దృశ్యాలు గోచరిస్తున్నాయి .కనులువిప్పి చూడలేకపోతున్నా తన భర్తవిలపించటము ,బంధువుల మాటలు వినిపిస్తూనే వున్నాయట. వాళ్ళున్న ఇంటిపక్కనే ఖాళీ స్థలము, చిన్న మురుగునీటిగుంట ,చెట్టు వున్నాయట. ఆచెట్టుక్రిద నిలబడి న చనిపోయిన మా జేజినాయన గారి బాబాయి తన భార్యతో దీనికోసం ఎంతసేపు చూడాలి వెళ్ళీ లాక్కురాపో అనగానే ఎక్కడినుండో నలుగురు విచిత్రవేషధారులు వచ్చి ఈమే మంచముదగ్గరకు వచ్చి రావేంది, ఈమొగుడేనా దిక్కు అంటూ కాలి వేళ్ళూ పట్టుకుని లాగుతున్నారంట. ఎక్కడికిరా వచ్చేది ? అంటూ ఈమె కాలు విదిలించి తన్నుతున్నదట. అయితే మాజేజినాయన గారు వాళ్ళ అమ్మతో ,అమ్మా దీనికి సంధికూడా సోకినట్లుంది, చనిపోతుందేమోనమ్మా కాళ్ళు కొట్టుకుంటున్నది అని పెద్దగా ఏడవట ము మొదలు పెట్టాడట. అయితే ఆమెకు నాడిచూడటము బాగావచ్చు. మృత్యునాడికూడా పసిగట్టగల నైపుణ్యము వున్నదగుటవలన నాడి పట్టీ చూసి. లేదురా నాయనా ఈ అమ్మాయికి ఛావు భయమ్లేదు. ఏదో జరుగుతున్నది .నువ్వు కొంచెంధైర్యం తెచ్చుకో అని ఓదారుస్తున్నదట. ఇవన్నీ మా నాయనమ్మకు వినబడుతూనే వున్నాయి. ఇకస్వప్నములో ఆ ఆత్మల వికటవిన్యాసాలు చూస్తూ భయపడుతుందగా తళుక్కుమని ఆకాశమంత ఎత్తున పెద్ద కాంతి మెరిసినది. అందులో శంఖు చక్ర దివ్యాయుధాలతో 18 చేతులతో అమ్మ జగన్మాత దుర్గాదేవి గోచరించి ఆ ఆత్మలను జుట్టుపట్టుకుని నేలకు వేసి కొట్టి తన కాలితో అక్కడున్న నీటిమడుగులో తొక్కి వేసినది. బ్రతికుండగా ఈ దృశ్యాన్ని వర్ణించి చెప్పే తప్పుడు మానాయనమ్మ. ఎంతో భావోద్వేగానికి గురయ్యేది. ఈదృశ్యము చూచి ఆనందము పెరిగి ఆమె బిగ్గరగా నవ్వటము ప్రారంభించినదట. మాజేజినాయన గారేమో .అమ్మా నవ్వుతున్నదే అని భయపడుతూ ఆందోళన చెందుతున్నాడు. ఇక అమ్మవారు తన రూపు మార్చుకుని మగవానిలా పంచె తలకట్టు కట్టుకుని తన ఆభరణాలన్ని మూటగట్టుకుని ఆదారిన నడచి వెళ్ళుతున్నట్లుగా ఆమెకు స్వప్నములో కనిపిస్తుండతముతో ఆమె, అన్నా అన్నా అని పిలుస్తున్నది .బయటేమో తనభర్త అమ్మా వాళ్ళ అన్నగారిని వాళ్ళను తలుచుకుం టున్నదమ్మా. ఇంకేమి చేయాలమ్మ అని ఏడవటము వినిపిస్తున్నది. ఈమెపిలుపు వినగానే వెళ్ళుతున్న
పురుషరూపములో వున్నఅమ్మ తిరిగివచ్చి అక్కడున్న ఒక మొండిగోడమీదకూర్చుని ఏమికావాలని అడిగినది. అప్పుడు ఈవిడ నువ్వు అన్నవా? లేక అమ్మవా? ఎలా పిలవాలి అని అడిగినదట. ఎలా పిలిచినా పరవాలేదు. నేను మీ అమ్మనే అనుకో అన్ననే అనుకో బాధలో వున్నప్పుడు నన్ను తలచుకో ఇదిగో పట్టు అని తన దగ్గరున్నా బంగారు రూపాయలు ఈవిడ దోసిలిలో పోసి అదృశ్యమయినది. ఈమే ఆనందముతో ఆ రూపాయలన్నీ పోగుచేస్తున్నట్లుగా చేతులు లాక్కుంటున్నది. ఇదిచూసి మాజేజినాయన అంతా అయిపోతున్నదమ్మా అని బాధపడుతూ వుండగా, వాళ్ళ అమ్మగారు ఏమి కాలేదురా యేదవకు అంతా శుభమే జరుగుతున్నది అని వోదార్చటము వింటూ ప్రశాంతముగా నిద్రలోకి జారుకున్నది. వుదయాని కల్లా జ్వరము తగ్గి పోవటము తో అమ్మా ఈవూరితో నాకు ఋణము తీరిపోయింది అని తల్లికి చెప్పి భార్యను తీసుకుని అత్తగారివూరు రవ్వవరం వచ్చాడు. ఇక్కడే బావమరుదుల దగ్గర వుండటము ఇష్టములేక ప్రక్కన ఖాళీ వున్న స్థ్లములో చిన్న గుడిసె నిర్మించుకుని కాపురము పెట్టాడు. ఆయన పొగాకు తెచ్చుకుని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకుంటూ కాలము గడుపుతున్నారు. తెచ్చిన కుంకుమను మట్టి గోడల లోనున్న గూట్లో దాచివుంచి మరచిపోయింది. మానాన్నగారు కాక మరలా ముగ్గురు పిల్లలు కలిగారు. మామూలు వ్యవహారిక ధోరణిలో సాగుతున్నది కాపురము. మా నాన్నగారు రామలింగయ్య గారు పక్కనే వున్న తిమ్మాపురం అగ్రహారం లో బ్రాహ్మనుల దగ్గరకెళ్ళి చదువుకునే వారు. పక్కవాళ్ళ పుస్తకాలు చూసి చదుకోవలసిన కష్టకా.లము.ఈస్థితిలో కరువులు రావటము ,భార్యా పిల్లల కోసం సంపాదించాలని వ్యాపారము కోసం దూర ప్రాంతాలకు కూడా వెళ్ళాడట. ఇక్కడేమో పిల్లలు ఆకలి అని అల్లాడుతున్నా ,పుట్టింటికెళ్ళి యాచిస్తే భర్తకు అవమానమని అభిమానవతి అయిన మానాయనమ్మ వెళ్ళేది కాదు. అక్కడ బావి తవ్వకము జరుగుతుంటే గర్భవతి అయికూడా. కూలిపనికి వెల్లేది. .16 సంవత్సరాలవాడు అయిన మనాన్న గారుకూడా పగలు కూలికి వెళ్ళి ,రాత్రి నడచి దరిశి వెళ్ళి కూరగా యలు తెచ్చుకుని పక్కనే పెట్టుకుని అమ్ముకునే వాడట. ఈ కష్టాలు చూడలేక తల్లి బాధను తగ్గించాలని అరోజులలో మిలటరీలో చేరాలని చెప్పా పెట్టకుండా ఇంటినుండి వెళ్ళా డు. . ఇంకేముంది పొద్దున్నే బిడ్డలేకపోవటం తో మా నాయనమ్మ గుండెలవిసేలా ఏడుస్తున్నదట. స్నేహితులు కొందరు రామలింగయ్య మిలటరీ చేరాలని వెల్లాడుఅని చెప్పటముతో ఆతల్లి దుః ఖముతో తల్లడిల్లుతూ ఏడుస్తున్నది. ఈవూరికి దగ్గరలోనే రాముడుపాలెం గ్రామములో ఈవిడ మేనమామ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడొకాయన వుండేవాడు. ఆయన రాత్రి నిదుర లో స్వప్నములో బంగారు వర్ణములో 8 సంవత్సరాల వయస్సుండే చిన్న పాప కన పడి ఒరే! నీ మేనకోడలు నన్ను గోడలో గూట్ళో పెట్టి మరచిపోయింది. నీవు వెళ్ళి గుర్తుచేయి అని చెప్పటముతో ఆయన వులిక్కి పడి లేచి తన భార్యను లేపి తనకొచ్చిన కలగురించి చెప్పాడు. ఆవిడ విసుక్కుని సింగినాదమేమికాదు పనీ పాటాలేకపోతే ఇలా నేకలలొస్తాయి పనుకోవయ్యా ,అని కసురుకున్నది. మరలా నిద్రలో ఆపాప కనపడి నవ్వుతూ, ఒరే! అది పిచ్చిది దాని మాట నమ్ముతావా? నామా ట నమ్ముతావా? రవ్వ వరము వెళతావా లేదా? అని అడుగుతుండటముతో లేచి తెల్లవారు ఝాముననే రవ్వవరము వచ్చి అమ్మా గోవిందూ ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఇలా అంటున్నదమ్మా ఏమిటి సంగతి అని వివరమడిగాడత. అప్పుడు గుర్తు కొచ్చినది ఆవిడకు అమ్మవారి సంగతి. అయ్యో మరచిపోయాను మామా .అని జరిగినది చెప్పినదట. ఆయన అలా ఆతల్లిని నిర్లక్ష్యము చేయకమ్మ అని చెప్పి వెళ్ళాడట. ఆరాత్రి అమ్మవారు కలలో కనపడి నీబాధ చూడలేకుండా వున్నాను గానీ నాపూజచేసుకో నిన్ను రక్షిస్తాను అన్నదట. అప్పుడీవిడ. అమ్మా దీపారాధనకునూనెకు కూడా దిక్కులేని దరిద్రురాలిని నేను ఎలా చెయ్యాలమ్మా నీపూజ? ఏమిపెట్టగలనమ్మా నీకు ప్రసాదము ? అని ఏడ్చినదట. అప్పుడు ఆతల్లి కరుణతో పక్కనున్న బావి చూపి అందులో నీళ్ళు చాలు నాకు. భక్తితో నా బిడ్డలు ఏమిచ్చినా నాకు తృప్తి కలిగిస్తుంది ,అనిపలికి అదృశ్యమయినది. పొద్దుననే లేచి తలారా స్నానము చేసి స్వప్నములో ఆతల్లి చెప్పిన విధముగా ఆనీళ్ళే తెచ్చి ఆ కుంకుమ భరిణనే దేవతగా తలచి సమర్పించుకున్నదట. బిడ్డకోసం దుఃఖిస్తూనే పూజ చేస్తున్నది. ఈలోపల గ్రామాంతరము వెళ్ళిన మాజేజినాయన వచ్చి పిల్లవాని కోసం కన్నీరు మున్నీరవుతూ వెతకటానికి వెళ్ళాడు. అక్కడ విజయవాడలో మిలటరీ సెలక్షన్ కెళ్ళిన మా నాన్న గారి ని చేతి ఎముకలో ఏదో లోపమున్నదని తీసుకోకుండా పంపించారు. అయితే డబ్బులేకుండా వెళ్ళి తల్లికి ముఖము చూపించటము ఇష్టములేక మానాన్నగారు అక్కడే ఒక హోటల్ లో పనికి కుదిరాడు. ఆన్ని చోట్లా వెతుకుతూ విజయ వాడలో వున్న తన చుట్టాలను కలిసి హోటల్లన్నీ వెతుకుతూ వచ్చిన మా జేజినాయనకి కొడుకు కనపడటముతో ఇద్దరూ ఏడ్చుకుని ఆయనను తీసుకునివచ్చాడు. అక్కడనుండి మాజేజినాయనకు అమ్మవారిపట్ల భక్తి కలిగి తీక్షణముగా నామము చేయటము అలవాటయినది. దానితోనే ధ్యానము లో గంటల తరబడి వుండటము జరుగసాగింది. ఈ లోపల జ్యోతిష్యము ,హస్తరేఖలు చూసి భవిస్యత్ చెప్పగలిగిన శక్తి వచ్చాయి. ఈలోపల మా నాన్న గారికి వినయాశ్రమములో హయ్యర్ గ్రేడ్ టీచర్ ట్రయినింగ్ రావటము ,ఎంతో కష్టపడి ఆయన దానిని పూర్తిచేసుకుని వుద్యోగములో చేరటము జరిగింది. అమ్మ అనుగ్రహముంటే మూగవాడు మహా పండితుడవుతాడన్నట్లు, ఈయనకు జ్యోతిష్యములో అఖండ ప్రజ్జ్న కలగటము జరిగింది వెంకయ్యగారు జ్యోతిష్యము వెంకయ్య గారు గురువుగారుగా గుర్తించబడ్డారు. ఇప్పటి పౌర సరఫరాల మంత్రి కాసు క్రిష్నా రెడ్డిగారి తండ్రిగారైన కాసు వెంగళ రెడిగారు, భవనం వెంకటరాం గారూ అప్పటి ఎస్.పి. శ్రీకాంతరెడ్డిగారూ . నీలం సంజీవ రెడ్డిగారలకు ఈయనంటే గురుత్వము ఏర్పడినది. రాష్ట్రములో ప్రముఖులతో సంబంధాలు వున్నా ఏ రోజూ తన స్వా ర్ధానికి వాడుకో లేదు. ఎప్పుడూ పూజలు ,సలహాలంటూ నాచిన్నప్పుడు. మా పల్లెటూరిలో కార్లు వస్తూవుండేవి ఈయన కోసం . ఎప్పుడూ అన్నదానాలు సంతర్పణలు అని ఎవరన్నా ఇచ్చిన దంతా ఖర్చు చేసేవాడేగాని మిగిల్చాలి పిల్లలకు ఆస్తులు కూడబెట్టాలని ఏరోజూ ప్రయత్నించలేదాయన. అలానే భగవత్ సేవలో ఆయన కాలము పూర్తిచేసుకున్నాడు. నేను ఇంటర్ మీడియట్ చదువుతుండగా వారు దైవ సన్నిధానానికి వెళ్ళిపోవటముతో ఆతరువాత అమ్మ పీఠ సేవా భాగ్యం నాకు సంక్రమించింది. తరువాత శ్రీ పీఠ నిర్మాణము ఎలా జరిపి ఆలయ ప్రతిష్ఠ్ ఎలా లీలలుగా జరిపినదో అమ్మ కరుణ మరొక పోస్టులో వ్రాస్తాను.
శ్రీమాత్రేనమః
2 వ్యాఖ్యలు:
Hridayaniki hathukunela undi andi.. amma karunalu ennennoo!
Ee jagathuni anthatini amma ilage rakshinchalani koruthu..
అద్భుతంగా వుంది.కళ్ళకు కట్టినట్టు వ్రాశారు.మీ పూర్వీకులు చాలా కష్టపడ్డా ‘అమ్మ కరుణతో ’ వాటినుంచి బయటపడటం నిజంగా అద్భుతం.‘అమ్మ కరుణను’ విశేషంగా పొందిన మీరు నిజంగా ధన్యులు.‘అమ్మ కరుణ’మనందరిమీద వర్షించాలని కోరుకొంటూ...
Post a Comment