ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.
>> Wednesday, September 21, 2022
పూర్వం తమిళనాట అవ్వయ్యర్ అనే అవ్వ ఉండేది.
ఆవిడ గొప్ప గణపతి భక్తురాలు.
ఒకసారి ఆవిడ వినాయకుడిని పూజిస్తున్న సమయంలో కొందరు యోగులు కలిసానికి వెళుతూ, అవ్వా! నువ్వు కూడా మాతో పాటు కైలాసానికి వస్తావా? అని అడిగారు.
నేను ఇప్పుడు గణపతిని పూజిస్తున్నాను, కాబట్టి రాలేను, మీరు వెళ్ళండి అని అవ్వ చెప్పింది.
కైలాసానికి వెళ్ళడం అంటే మాటలు కాదు. అలా వెళ్ళడం కూడా ఊరికే వచ్చే అవకాశం కూడా కాదు. అయినా తనకు గణనాధుడే చాలనుకుంది అప్పయ్యర్. అవసరమైతే నన్ను గణపతే తీసుకువెళతాడని, తన పూజలో తాను నిమగ్నమైంది.
ఈ యోగులు కైలాసానికి వెళ్ళేసరికల్లా అవ్వ కైలాసంలో ఉంది.
అదేంటి అవ్వా! ఇందాక అడిగితే రానన్నావు, ఇంతలోనే కైలాసానికి ఎలా వచ్చావు అని ఆ యోగులు అడగ్గా, నా పూజ ముగియగానే వినాయకుడే తన తొండంతో నన్ను ఎత్తుకుని, కైలాసంలో కూర్చోబెట్టాడు అని చెప్పింది.
ఇది గణపతి అనుగ్రహం అంటే. ఇది భక్తుల పట్ల గణపతికున్న ప్రేమ.
గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే అని ఆడిశంకరులు గణేశభుజంగంలో అంటారు.
అంతటా వ్యాపించిన గణపతి ప్రసన్నుడైనచో పొందలేందంటూ ఏముంటుందని దాని అర్దం.
దానికి ఇదే ప్రయక్ష ఉదాహరణ.
0 వ్యాఖ్యలు:
Post a Comment