శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అంబకన్న అధికులెవరు లోకమందునా?అరసి చూడ అంబ ఒకతే ఉన్నదెందునా ?

>> Friday, March 27, 2020


1 వ్యాఖ్యలు:

maheshudu March 29, 2020 at 8:06 AM  

పల్లవి:
అంబకన్న అధికులెవరు లోకమందున
అరసి చూడ అంబ యొకతె ఉన్నదెందున!!

చరణం:
శిలల తెచ్చి ఉలుల మలచి అమ్మ యందునా?
వెన్నవంటి మనసు మాట తలపకుందునా!!
తలపకుందునా!! తలపకుందునా!! …1

వెలుగులీను దీప శిఖల అమ్మ యందునా
వెల్లివిరియు చల్లదనము వదలు కొందునా!
వదలు కొందునా! వదలు కొందునా! …2

అంతు లేని నింగి చూచి అమ్మ యందునా
లేనిదాని కున్నదనము నిచ్చు కొందునా!
ఇచ్చు కొందునా! ఇచ్చు కొందునా! …3

మంత్ర తతుల నాదగతులనమ్మ యందునా
అమ్మలోని శాశ్వతత్త్వ మెన్నకుందునా!
ఎన్నకుందునా! ఎన్నకుందునా! …4

మంచుకొండ ముద్దుపట్టి అమ్మ యందునా
ఆమె అఖిలమాత యనుట పలుకకుందునా!
పలుకకుందునా! పలుకకుందునా! …5

శివుని మేన అర్ధ భాగమమ్మ యందునా
నిత్య పూర్ణశక్తినిట్లు చీల్చు కొందునా!
చీల్చు కొందునా! చీల్చు కొందునా! …6

నేను-నీవు-వాడులన్ని అమ్మ యందునా
సచిదనంద దివ్యపదమ నూత గొందునా!
ఊత గొందునా! ఊత గొందునా! …7
Bhajana written & composed & sung by
Pujya Sri Ganapathy Sacchidananda Swamiji
www.dattapeetham.com

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP