శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నువ్వు కాకంటే కాకే.. చిలకంటే చిలుకే !

>> Monday, March 26, 2018

ఒకరోజు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అపుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశంవైపు చూపి
'ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా "'  అని అడిగాడు.

అర్జునుడు " అవును కృష్ణా! అది పావురమే " అన్నాడు.

మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు.

" అబ్బే! అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు "

" అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణా"  అన్నాడు అర్జునుడు.

కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళి కాసేపటికి ఇలా అన్నాడు.

" అర్జునా! అది గ్రద్ధ కానేకాదు. అది చిలుక సరిగ్గ చూడు ఒక్కసారి"

" నిజమే కృష్ణా! అది చిలుకనే" అన్నాడు అర్జునుడు.

చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు.

" అయ్యో! అది చిలుక కూడా కానేకాదు. అది కాకి అర్జునా!
 ఒక్కసారి పరికించి చూడు"

" అరే! నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణా! అన్నాడు అర్జునుడు.

కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.

" అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా?
  సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంత
 పాడుతున్నావు " అన్నాడు.

దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు.

" ఓ సర్వాంతర్యామీ! నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను.
  నువ్వు ఏదంటే నేనూ అదే! మీరు పావురమే కదా అన్నా రు
  నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది.
  నాకు అన్నీ మీరే. మీ మాటే నాకు వేదం కృష్ణా!

ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది.

దేవుడిపైన అనుమానం అక్కరలేదు.తనపైన నిజమైన నమ్మకాన్ని
ఉంచండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే
శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి
తెలుసు. ఎప్పుడు మనకు ఇవ్వాలో మన నుండి ఎప్పుడు తీసుకోవాలో
అన్నీ ఆ దేవుడికి తెలుసు. నమ్మకంతో జీవించు... 🙏🏻🙏🏻💐💐

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP