శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఉగాది ఇలా. ఎలా?

>> Monday, March 19, 2018

ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ప్రస్తుత కాలమాన పరిస్థితులకనుగుణంగా రాసిన ఈ చిన్న బాధను మీరందరూ తప్పక పూర్తిగా చదువుతారని ఆశిస్తూ...

ఉగాది  వస్తోంది అనే ఉత్సుకతతో ఏదో కొందామని అంగడికి పోయాను

కొత్తబెల్లం కావాలని అడిగితే కొత్త ముచ్చెకాగితంతో సవరింపు విలువతో ఒక చిన్నదిమ్మ ఆకారాన్ని చూపాడు , ఇంత ఖరీదా అని విస్తుపోతే  చెరుకు పంట కరువయిందండి అని వాపోయాడు.

రైతులే కూర్చోని రైతుబజారుకి వెళ్ళి మామిడికాయ కొందామంటే రైతన్ననుండి అధిక విలువ చెల్లించి తెచ్చితినంటూ బుకాయించు కాయొకటి నలుబది ఇమ్మని దబాయించెనొకడు .
ఏమని అడుగ మామిడిచెట్టే కరువాయనండి అని వాపోయాడు ఆ వ్యాపారి.

పచ్చని తోరణముకై మామిడి ఆకుల వెతుక బయల్వెడలితని అటు ఇటు చూడ ఇది నగరమండి కాంక్రీటు మయమండి చెట్టు కనబడదండి అని వాపోయెనొక  దారివెంబడి చతికిలబడిన ఒక ముదసలి రైతన్న.

మామిడాకులే తోరణమునకు మిన్న అని బజారుకు పోయిన, చైనా ప్లేస్టిక్ ఆకులండి అంబానీగారి షాపండి అనేక వత్సరములు గుమ్మమునకె వేలాడునండి వందరూకములిచ్చికొనిపొండు అని హూంకరించె  ఒక వ్యాపారి.

వేప పూవుకోసం చుట్టుపక్కల వీధిలో వెదకుచుండ , ఇటునటు ఇళ్ళవారిని సంప్రదించుచు ఇచటే గతంలో వేపచెట్టు ఉండెనని వాకబు చేయుచు *మూడు వీధులు దాటినను వేపచెట్టు జాడ కానరాలేదు.* 

*వేరు నుండి చిగురు వరకు ఔషదంబే అని తెలిసిన, ఆకులే ఊడ్చుట కష్టతరమని భావించి వేపచెట్టును సమూలంగా అంతమొందించిన  మన జనవాళిని ఏమనాలో!!* 

చైనా ప్లేస్టిక్ వేపపువ్వు ఇట్టే కరిగిపోవునని, మన వేపపువ్వు కన్న ఉత్తమమైనదని ఖరీదు తక్కువని అమ్ముటకు సిధ్ధమైనాడు ఒక దౌర్భాగ్యుడు.


కొత్త చింతపండు ఉగాది పచ్చడిలో వేసుకుందామంటే  చింతపండు కరువాయనే అంటూ ఆకాశమునకు అందుబాటులో నుండే ధరపలుకుతూ గ్రాములలో తూకవేసినాడొిక వ్యాపారి. 

చింతపండు బదులూ నల్లుప్పు వాడుకోండయ్యా, పానీపూరీ రుచి వస్తుందని సలహా ఇచ్చి నారు పక్కింటవారు.

వృక్షసంపదను అంతరింపచేస్తూ ఫలపుష్పములు లేవని, నీడే కరువాయనని భూటకపు కబుర్లతో నాటకములాడుచున్నారు ఈ మానవజాతి .

ప్రకృతి కి మర్యాదనీయని ఈ మానవాళికి వసంత ఋతువు ఆగమనమునకు స్వాగతించే అర్హతెక్కడిది.

*కాలుష్యవాయువులను తనదై ఆస్వాదిస్తూ, జీవవాయువులను జీవకోటికి అందిస్తున్న వృక్షాలనే కనుమరుగుచేస్తున్న ఈ జనవాళికి ఈ వసంత ఋతువు ను స్వాగతించే అర్హతెక్కడిది.*

రాళ్ళురప్పల మిళితమైన తాత్కాలిక భవనాల మోజుతో, అస్తిరమైన వారసత్వమునకు భవనాలను స్తిరముచేద్దామన్న కోరికలతో, కొండకోనలను ఆక్రమిస్తూ  చెట్టుపుట్టలను అంతమొందిస్తూ ప్రకృతికి మర్యాదనీయని నీకెందుకయ్యా ఈ ఉగాది..

గుక్కెడు నీళ్ళకోసం కొన్నియోజనాలదూరం పరుగిడుతున్న పక్షులెన్నో !

పిడికెడు గింజలకోసం వెదుకులాడుతున్న గిజిగాడు ఏడి ఈరోజున !

ప్రకృతికి  నీవిచ్చినది ఇదేనా! ఎందుకయ్యా ఈ భూటకపు పూజలు.. ..

లేసమాత్రమైనా ప్రకృతిపై ఆధారపడకుండా జీవనము సలపలేని నీవు నిరంతరము ప్రకృతినే ధ్వంశం చేస్తూనే ఈ భుటకపు నాటకంతో క్షయం చేస్తున్నావుగదయ్యా ఎందుకయ్యా నీకీ ఉగాది పండగ.‌

కనీసం ఒక మొక్కను కూడా ఇంటిలో నీతో పాటు  పెంచుకుందామని కించిత్తు ఙ్ఞానంలేని మానవుడా ఎందుకయ్యా నీకు ఈ ఉగాది సంబరం.

సీసా లో మిగిలిన నీరు మొక్క ఒడిలో పోయాలనే సంస్కారం కరువాయనీలో ! ఎందుకయ్యా నీ కీ ఉగాది.

అయినా ప్రకృతి ఒడిలో ఎల్లప్పుడూ సేద తీర్చుకోడానికి ఈ మానవాళికి ఆ తల్లి కరుణకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి.

ఇకనైనా  మేలకో ప్రకృతి యొక్క వికృతరూపాన్ని  చవిచూసేరోజు రాకుండా భాధ్యత తెలుసుకొని  ప్రకృతిని గౌరవించు ...

........... శ్రీధర్ దండంమూడి

1 వ్యాఖ్యలు:

ఇంద్రధనస్సు March 20, 2018 at 5:58 AM  

ఆవేదన అవగతమైనది
ఆశయాలు ఆలోచనలకే పరిమితమైనవి
ఆచరించే మహానుభావులు అరుదైనారు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP