శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏవీ నాటి అనురాగాలు,అభిమానాలు

>> Saturday, October 7, 2017

మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయం  గా భావిస్తారు.

" ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం "
అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా, మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ  సంతోషంగా ఉండాలని అనుకుంటాం.
కానీ నేడు మన బృందావనం  బీటలు వాలి చివరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది.
ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మన వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల ఆలోచనలో చాలా  మార్పులు వచ్చాయి.
దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి  మనిషిలో పెరుగుతున్న స్వార్ధం. ఎందుకంటే మన చిన్నతనంలో
"కలసి ఉంటే కలదు సుఖం" అని చెప్పేవారు,
కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా
విడిపోయి సంతోషంగా
ఉండటం మేలు".
అంటున్నారు.
ఇది భౌతిక , కుటుంబ ఎడబాటు అయితే అంత ఇబ్బందేమీలేదు. కాని
చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.
"వెన్నలాంటి  రాత్రులలో చందమామ మిస్ అవ్వలేదు కానీ చందమామ కధలు చెప్పేవారు మిస్ అయ్యారు.
ఎండా కాలంలో వేసవి సెలవులు మిస్ అవ్వలేదు కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదినీ ఒక దగ్గర చేర్చే పెద్ద దిక్కు మిస్ అయ్యారు.
ప్రతి సంవత్సరం  వచ్ఛే పండగలు మిస్ అవ్వలేదు కానీ ఏ పండగ నాడు
ఏ తీపి వంటకం వండాలో చెప్పే మనిషి మాత్రం మిస్ అయ్యారు".
దీనికి కారణం నేటి తరానికి కధలు చెప్పడానికి ట్యాబ్లు, యూ  ట్యూబ్లు ఉన్నాయి. అదే వేసవి సెలవులు వస్తే సమ్మర్ కోర్సులు, క్రాష్ కోర్సులు ఉన్నాయి. అలాగే పండగలు వస్తే తినడానికి రెస్టారెంట్స్, తిరగడానికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
అందుకే నేటి తరానికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు అవసరం లేదు. అందుకే మన భారత దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు శాతం తగ్గుముఖం  పడుతుండగా చిన్న కుటుంబాల  శాతం పెరుగుతూ ఉంది.
నేటి తరానికి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళని ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేస్తారు.ఇలా చివరికి వ్యక్తిత్వ వికాసం కూడా కోర్సుల్లో జాయిన్ అయి నేర్చుకుందుకు ప్రయత్నిస్తారు..
వాళ్ళు వృత్తిలో రాణించడానికి పాఠాలు చెప్పగలరేమో గాని జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేరని తెలియడం లేదు.
ఒక అర్ధ శాస్త్రవేత్త చెప్పిన
మాటను గుర్తుచేస్తాను
" All human relations are commercial relations"
అంటే
" మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే".
ఏమో కొన్ని సార్లు ఈ మాట నిజమనిపిస్తుంది. నేటి సమాజంలో మనిషి బంధాలను ప్రేమతో కాక డబ్బుతో ముడి వేస్తున్నారు. ఎక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందో ఆ బంధాలు దృఢంగా ఉంటాయి.
ప్రేమ, అభిమానాలు వ్యక్త పరచడానికి ఇచ్చిపుచ్చుకోవడమనేది ఒక పద్ధతి. అంతే కానీ పుచ్చుకొనే ధోరణితో బంధాలు ఏర్పడితే అవి ఎక్కువ కాలం నిలబడవు.
ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బు ఉంటుంది.కానీ డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమ నిలబడదు.
కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం.
" ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ,మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం "
ఈ మాటలు నిజం .
నేను చెప్పడం కాదు
యాపిల్ కంపినీ సృష్టి కర్త,
తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి.
"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS". 
అందుకే మన జీవితంలో
ఉన్న ప్రతీ బంధాన్ని  నిలబెట్టుకోవాలి. ఎందుకంటే "
When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relatio   nship more than 'EGO'.
Let's have a smooth relationships. 🙏 🙏�🙏�🙏�
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కుదిరినంత ఎక్కువమందికి షేర్ చేయండి.
మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో వాటన్నిటికీ send చేయండి. 🙏🙏🙏🙏
​​
Oct 7KBNSarma
​​

*

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP