శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చనిపోయిన శవాల వద్ద భగవద్గీతను పెట్టకండి ..*

>> Friday, June 9, 2017

*భగవద్గీత చావుమేళం కాదు ... కారాదు.*

*దయచేసి చనిపోయిన శవాల వద్ద భగవద్గీతను పెట్టకండి ..*

*వినాశకాలే విపరీత బుద్ధి.*

భగవద్గీతను “శవ” సంకేతానికి , “శవయాత్రలకు” మొట్టమొదట ప్రారంబించిన.... చవట/సన్నాసి/నీచ/నికృష్ట వెధవ ఎవడోగానీ ....

ఏం దరిద్రం ఇది ?  పవిత్రమైన, జ్ఞానప్రదాయని అయిన భగవద్గీతను “పీనుగ లేచింది” అనే సంకేతంగా మార్చిన పైత్యం ఎవరు నేర్పినారు?  ఇంట్లో భగవద్గీత పెట్టుకోవాలంటేనే భయపడే స్తితికి తీసుకొచ్చారు .
ఒకప్పుడు భ్రంహ్మముహూర్త కాలంలో , ప్రభాత వేళలో గుడి మైకులనుండి వినబడే ఆ మధురమైన ఘంటసాల గారి భగవద్గీత మనోల్లాసాన్ని కలిగించేది , అనంత కాలగమనంలో మనిషి జీవితం ఎంతచిన్నదో ... కాలస్వరూపమైన దైవం ఎంత విస్తృతమో నిత్యం గుర్తు చేస్తూ ఉండేది . పండితుడైనా పామరుడైనా ఒక విధమైన ట్రాన్స్ లో కి తీసుకెళ్ళేది ... ఎదో తెలియని ఆధ్యాత్మిక భావన అనిర్వచనీయమైన హృదయ వైశాల్యాన్ని కలిగించేది .

అటువంటి భగవద్గీతకు ఎంత భ్రష్టత్వం ఆపాదిస్తున్నాము.

కలికాల ప్రభావమా ..? దైవ ఉపాసనలకు బదులు పిచాచ ఉపాసనలు ? ఏం ఖర్మ ఇది ?

ఈ దిక్కుమాలిన ప్రాక్టిస్ తెలుగు రాస్త్రాలలోనేనా ? దేశం మొత్తం భూత ప్రేతాలు ఆవహించాయా ??

ఇప్పటికైనా మారండి.. పాపం మూటగట్టుకోకండి... నాయనా ...
ఆలోచించండి ఈ నీచ సంస్కృతినుండి బయటపడండి . తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా అవేర్నేస్స్ కలిగించండి.......అవును నేను నిజమైన హిందువునే, మీరు నిజమైన హిందువే అయితే ఇప్పటినుండి చావుల దగ్గర, భగవద్గీత వేయకుండా ఆపండి .....                                            📌ఈమధ్య నాతో ఒక యువతి మాట్లాడుతూ ఇలా అంది – “నాకు ‘భగవద్గీత’ పేరు విన్నా, అందులో శ్లోకాలు విన్నా, భయం వేస్తుంది. ఒళ్ళు వణుకుతుంది’ అన్నది.

ఎందువల్లనమ్మా?’ అని ఆశ్చర్యంతో అడిగితే, ఆమె చెప్పిన సమాధానం మరీ దిగ్భ్రమను కలిగించింది – ‘ఎవరైనా చనిపోయినప్పుడు, శవవాహన సమయంలో దీని రికార్డు వేస్తారు. అదే నా మనసులో ముద్రించుకు పోయింది. పెద్దలు ఎవరైనా మరణిస్తే సంతాపంగా దీనిని వినిపిస్తారు. ఇందువల్లనే నాకు గీతా శ్లోకాలన్నా గానమన్నా భయం పట్టుకుంది.”.
మరొకచోట మరొక సంఘటన – ఒక సభా ప్రారంభంలో ఎవరో భగవద్గీత శ్లోకాలు చదివారు. అందులో ఒక రాజకీయ నాయకుడు లేచి – ‘శుభమా అని సభ పెట్టుకుంటే గీత పాడతారేంటి?’ అని వాపోయాడు.
ఇంచుమించు చాలామంది వద్ద ఇలాంటి అభిప్రాయాలే వినబడ్డాయి.
దీనిని బట్టి – హిందువులు తమ ధర్మవిషయంలో ఎంతగా భ్రష్టమయ్యారో, పశుప్రాయులయ్యారో తెలుస్తోంది.
దీనికి కారణమేంటి?
‘భగవద్గీత’ను కేవలం మరణ సందర్భంలో రికార్డులద్వారా వినిపించడం! ఇది అసంగతమైన విషయం. అసలు భగవద్గీతకీ మరణ సంస్కారాలకీ సంబంధమే లేదు. ఆ సమయంలో భగవద్గీత, విష్ణుసహస్రనామాలు, శివనామాలు – వంటి వాటి అవసరం లేదు.
ఇతరులకైతే ‘పిండికీ, పిడుగుకీ ఒకటే మంత్రం’ అన్న చందంగా పెళ్ళికీ, చావుకీ, పుట్టుకకీ అన్నిటికీ ఒకటే గ్రంథపఠనం!
సనాతనధర్మం పరిస్థితి అటువంటిది కాదు. జన్మ ప్రభ్రుతి మరణపర్యంతం ‘షోడశసంస్కారాలు’ ఉన్నాయి. ఆయా సందర్భాలలో చేయవలసిన కర్మలు, మంత్రాలు ఉన్నాయి. అంతేగానీ అప్పుడు గీతాపఠనం చేయరు.
జ్ఞానం కోసం భగవద్గీత. అంతేకానీ – ఔర్ధ్వదైహిక క్రియలకోసం కాదు. మన సంస్కృతిలో ఆ క్రియలు సంస్కారాలు చక్కని విజ్ఞానంతో కూడి ఉన్నాయి. వాటికి భగవద్గీతతో పొంతన లేదు. గీత బ్రతికి ఉన్నవారు, చక్కగా బ్రతకదలచుకున్న వారు అధ్యయనం చేయవలసిన జ్ఞానశాస్త్రం.
ఈ విషయం మరచి కేవలం మరణ సమయగానంగా దానిని వినిపించడం మహాపరాధం. వెంటనే బాధ్యతగల పెద్దలు పూనుకొని వల్లకాట్లలో, శవవాహనాలలో, సంతాపాలలో గీతాపాఠాన్ని నిషేధించాలి.
మరో విషయం – ఇతరమతస్థులు వారి మరణవేళల్లో వారి మతగ్రంతాలనే చదువుతారు. కానీ దానిపై ఆ మతస్థులకి భయం, హీన దృష్టి లేవు. కానీ మనవారికి ఆ రెండూ ఏర్పడ్డాయి.
బాల్యంనుండే ఇంట్లో పిల్లలకి ఆ గ్రంథాల గురించి తెలియజేయని పెద్దలది ప్రథమాపరాధం! ఇంట్లో ఆ పుస్తకాలనుంచడం లేదు. శ్లోకాలు నేర్పడం లేదు. అసలు వాటి అర్థాలు కూడా తెలియవు.
ముస్లిం సోదరులు ఉర్దూ నేర్చుకుని ఖురాన్ ని చిన్నతనం నుంచే అధ్యయనం చేస్తారు. మతాచారాలను అనుసరిస్తారు.
కానీ మన ఇళ్ళల్లో సంస్కృతం నేర్పరు. కనీసం తెలుసు పద్యాలు తెలుసుకోరు.
అందుకే గీతా జ్ఞానం లేదు సరికదా – ఏ సందర్భానికి ఏది చేయాలో కూడా తెలియని దయనీయ స్థితి.
దీని కారణం గానే స్వధర్మ నిష్ఠ కలగడం లేదు. ఆఖరికి ‘గోవింద’ నామమన్నా కొందరికి శవయాత్రయే గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. మానవుని కర్తవ్యోన్ముఖుని చేసి, వ్యక్తిత్వాన్ని వికసింపజేసి, తనలోని అంతశ్శక్తులను జాగృతపరచి వినియోగింపజేసే శక్తి గీతా బోధలలో ఉంది. ఈ విషయం ఎందఱో విదేశీ మేధావులు అంగీకరించి విజయ సూత్రాలుగా, వ్యక్తిత్వ వికాస పాఠాలుగా అధ్యయనం చేస్తున్నారు. మనం మాత్రం అసలు పట్టించుకోని స్థితిలో ఉన్నాం.
మరొకవైపు మార్పిడి మతాలు ఎరజూపే బిస్కట్ల కోసం ప్రలోభపడి దాస్యం చేసే గ్రామసింహాలవంటి భారత మేధావులు – గీతవంటి సద్గ్రంథాలకు లేని అర్థాలు చూపించి, కువ్యాఖ్యలు చేస్తుంటే – ‘భావస్వేచ్ఛ’ క్రింద  దానిని భరిస్తూ, వాటిని ఖండించలేని స్థితిలో నిద్రిస్తున్నారు గీతాభిమానులు.
ఒక్క గీతనే కాదు. వేదాలను కూడా ఏవో అనువాద గ్రంథాలు చదివి – బట్టతలకీ, మోకాలికీ ముడిపెడుతూ వికృత వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ మతంలో గొప్పదేదో చెప్పుకు వెలగబెడితే చాలు. ఇతరుల మతాల గురించి మాట్లాడే హక్కు అవగాహన వారికి లేవు. చట్టరీత్యా నేరం కూడా.
మనవారిలో ఉన్న అవగాహనా రాహిత్యం, ఇతరుల దుర్మార్గపూరిత వంచన కలిసి హిందూమతంలో లేనిపోని అనర్థధోరణులు కలుగుతున్నాయి. హిందూ సమాజం తమ సంప్రదాయాలేమిటో, ధర్మజ్ఞానాలేమిటో గ్రహించే ప్రయత్నం చేయాలి. వాటిని నిలుపుకోవాలి.
దీనికి సాధికారకంగా చెప్పగలిగే పెద్దలు పూనుకొని ఉద్యమించి, జాగరణ కలిగించాలి...✍ లోకాస్సమస్తసుఖినోభవంతు      

1 వ్యాఖ్యలు:

Chandrika Chandrika June 11, 2017 at 9:02 PM  

నిజమేనండీ. కానీ మనిషి చనిపోయి ఏడుస్తుంటే, ఇలా భగవద్గీత పెట్టకూడదు అని చెప్పడం కూడా ఆ సమయం లో తప్పుగా అనుకుంటారు. దీనిని ఎలా ఆపాలో కూడా అర్ధం కాని పరిస్థితి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP