శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది.... నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది

>> Tuesday, May 30, 2017

మనిద్దరమూ 18 వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం...

నువ్వు నీ JEE క్లియర్ చేశావ్...
నేను ARMY కి సెలక్ట్ అయ్యాను...

నువ్వు ఐఐటి లో చేరావ్...
నేను  training centre లో చేరాను...

నువు డిగ్రీకోసం రేయింబవళ్ళూ కష్టించావ్...
నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య
ట్రైన్ అయ్యాను...

నువ్వు బి.టెక్ పూర్తి చేశావ్...
నేను the best soldier  అయ్యాను...

నీకు రోజూ ఉదయం 7 తో మొదలయ్యి
సాయంత్రం 6 తో ముగుస్తుంది ....
నాకు ఉదయం 4 తో మొదలయ్యి
రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది...

నీకు కాలేజీ లో స్నాతకోత్సవం ఉంటుంది ...
నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది..

నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరతావ్...
నేను నా ప్లటూన్ లో  చేరతాను..

నీకు ఉద్యోగం వచ్చింది....
నాకు జీవన పరమార్ధం దొరికింది...

ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ నీకుటుంబాన్ని కలుస్తావు... నేను నా తల్లితండ్రులను చూసే సమయం కోసం ఎదురుచూస్తాను ..

నువ్వు పండగలన్నీ
ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్...
నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను..

మనిద్దరికీ పెళ్లయింది.....
నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది....
నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది..

నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావ్...
నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను..

మనిద్దరమూ తిరిగొస్తాము...
చాలా రోజుల తర్వాత చూసిన
నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు..
నేను తుడవలేను...

తనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావ్..
నేను ఇవ్వలేను...

ఎందుకంటే ....
నేను శవపేటికలో ఉన్నాను...
నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్..
వాటి బరువుకు నేను లేవలేను..
నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక మీద
నా జీవన సాఫల్యమైన '' భారత త్రివర్ణ పతాకంతో ''
అందంగా చుట్టబడి ఉంది...

ఆ గర్వించే క్షణాలు వదులుకొని
నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను....

మాతృభూమి రక్షణలో  నా జీవితం సార్ధకమైంది ...
మళ్ళీ సైనికుడిగా నే పుడతాను ...

నా జీవితం ఇంతటితో సమాప్తం

ఎందుకంటే నేను సైనికుణ్ణి ......  అమరుడ్ని ..

నీ జీవితం ముందుకే వెళ్ళాలని ఆశిస్తూ .....
''నీ మితృడైన ఒక సైనికుడు '' ....

భారత్ మాతాకి ... జై... జై హింద్...

(హిందీ నుంచి తెలుగులోకి స్వేచ్చానువాదం...
ఒక అమరవీరుడు తన తన బాల్య స్నేహితుడికి రాసిన లేఖ ..)

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP