శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సూడో సిక్యులర్ గాళ్ళకు ఆయన విలన్ లాగా కనబడడం పెద్ద వింత కాదు.

>> Wednesday, March 22, 2017

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్ మీద సిక్యులర్ మనోవ్యాదిగ్రస్తులు .. మెదడులో హిందూద్వేషాన్ని నింపుకున్న జర్నలిస్టులూ ప్రచారం చేస్తున్న పుకార్లలో నిజమెంత??

1.యోగి గోరఖ్ పూర్ మఠ్ తో 22 ఏట నుంచీ తన అనుబంధాన్ని పెంచుకున్నారు... ఆ మఠ్ విస్తీర్ణం మొత్తం 60 ఎకరాలు...
2. ఆ మఠాన్ని ఒక సామాజిక ప్రయోగశాలగా చెప్పవచ్చు... అక్కడ అన్ని కులాల వారూ ..అన్ని మతాల వారు నివసిస్తారు .. అలాగే పని చేస్తారు ఎక్కడా వివక్ష లేదు... ముఖ్యంగా అక్కడ ఆహారం వండేది దళిత సోదరీమణులే.. చతుర్వేది అయినా ..ద్వివేది అయినా..సోమయాజి అయినా ..ఘనాపాఠి అయినా ఆ ఆహారాన్నే తినాలి సహపంక్తి భోజనం తప్పనిసరి..
3.యోగి ఆదిత్య ఆ మఠానికి తన గురువు శ్రీమాన్ మహంత్ అవైధ్యనాధ్ దేహపరిత్యాగం తరువాత ఉత్తరాధికారి అయ్యారు..
4.ఆ మఠంలో ప్రతిరోజూ 2 గంటలు జనతా దర్భార్ నిర్వహిస్తారు... స్థానిక చుట్టుపక్కల ప్రజలు తమ తమ సమస్యలు చెప్పుకోవడానికి కులమత భేధాలు లేకుండా వస్తారు... వచ్చే వారిలో అధిక శాతం ముస్లింస్...
5. మఠం నుంచి ఒక్క ఉత్తరం వస్తే చాలు ఆ పని నూటికి నూరు శాతం అయిపోయినట్లే... దానికి రెండవసారి రిమైండ్ చేయనక్కర్లేదు..
6. గోరఖ్ పూర్ లో ఉన్న ప్రముఖ మసీదు స్థలం సాటి ముస్లింసే కబ్జా చేస్తే దాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్కిస్తుంటే మసీద్ నిర్వాహకులు మఠాన్ని ఆశ్రయించారు... మఠం నుంచి ఉత్తరం అందుకున్న కబ్జాదారు ఒక్క 40 నిమిషాలలో కట్టిన గోడలు కూల్చివేసి మొత్తం స్థలాన్ని మసీదుకు అప్పచెప్పడమే కాకుండా తిరిగి హద్దుల్లో గోడకట్టుకునే నిమిత్తం 70 వేల రూపాయలు పరిహారంకింద ఇచ్చి వెళ్ళిపోఅయడు... అతను అజంఖాన్ మనిషి..
7.మఠంలో ఆల్మోస్ట్ అన్నిరకాల జంతువులూ ఉంటాయి... కొలనులో మొసళ్ళ దగ్గరనుంచీ.. చెంగు చెంగున దూకే లేడిపిల్లలవరకూ..ఇక కోతులైతే చెప్పక్కర్లేదు జాతీయ మీడియా కూడా...
8.యోగీజీ ముస్లింస్ కు వ్యతిరేకం కాదు... కానీ తీవ్రవాద భావాలున్న వహబ్బీ + సలాఫీ ఇస్లాం అంటే తీవ్రంగా మండిపడతారు.. వారి వల్లనే ప్రపంచంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆయన ప్రగాఢ విశ్వాసం..
9.మాకు ముఖ్యమంత్రి ఎవరయ్యిందీ అనవసరం మాకు మఠం ఇచ్చిన ఉత్త్రం చాలు... మా మహారాజ్ మా మహరాజే మీకు ముఖ్యమంత్రి అయితే కావచ్చు... ఇది అన్నది షమ్షేర్ ఆలాం యోగీజీ వలన తన చెవి సర్జరీ చేయించుకున్నారు ఆయన..
10.చౌదరీ కైఫుల్ వరాక్ .. హాజ్ లిస్టులో తనపేరు రికమండేషన్ కోసం యోగీ జీ దగ్గరకు వచ్చి తన పనిపూర్తికి చిన్న లెటర్ తీసుకెళ్ళిన వ్యక్తి.. మీరు యోగి దగ్గరకు ఎందుకువచ్చారు?? అజాం దగ్గరకు వెళ్ళొచ్చు కదా అన్న ప్రశ్నకు '' అజాం '' దొంగ .. మాకు మా యోగి మహరాజ్ ముఖ్యం '' అజాం '' కాదు అని స్పష్టం చేశారు..
11.మొహమ్మద్ మోయిన్ -- మఠం లో గోరక్షణ బాధ్యతలు చూసే వ్యక్తి అలాగే అన్ని నిర్మాణ కార్యక్రమాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి... ఆయన్ని ఈ ఇంటర్వ్యూ చేసిన ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్స్ విలేఖరి మీరు ఇక్కడ వివక్ష ఏమన్నా ఎదుర్కుంటున్నారా? అని అడిగినప్పుడు ఆయన పెద్దగా నవ్వేసి మీ పేపర్ వాళ్ళు టీవీల వలన మాత్రమే మాకు ఇబ్బంది... మా మహరాజ్ మీద వేసిన అభాండాలు చాలు మీరు దయచేయండి అని అన్నారు...
12.జకీర్ అలీ వరాసీ -- మఠం లోని అన్ని ముఖ్యమైన రికార్డులూ భద్రపరిచే బాధ్యత ఆయనదే .. మఠం గురించి ఆయన మాటల్లోనే '' ఇక్కడ మీరు పూర్తి భారతీయులుగా ఉంటేనే ఉండండి ''...ఇక్కడ అదొక్కటే యోగి జీ చూస్తారు...
13. మఠం ఉద్యోగుల్లో 35 మందికి పైగా ముస్లింసే ... స్థానిక ముస్లింస్ అంతా కూడా యోగి జీ అన్నా మఠం అన్నా ప్రాణం ఇస్తారు... అందుకే మీడియాలో యోగీ జీ మీద వస్తున్న అసత్య కధనాలు ఖండిస్తూ ఏకంగా ర్యాలి తీశారు...
ఇదీ వాస్తవం... నిజమైన వసుధైక కుటుంభానికి నిర్వచనం... భారతీయ ఆత్మ అక్కడ సాక్షాత్కారం అవుతుంది..
ఇప్పటివరకూ భారతీయులను మతాల పరంగా కులాలపరంగా విడదీసి రాజకీయం   చేసే వెధవాయీస్ కూ... వాళ్ళేసే బిస్కెట్లకూ అలవాటుపడిన సూడో సిక్యులర్ గాళ్ళకు ఆయన విలన్ లాగా కనబడడం పెద్ద వింత కాదు.. భారత్ మాతాకి జై.

2 వ్యాఖ్యలు:

Zilebi March 22, 2017 at 1:03 PM  


భారత్ మాతా కీ జై

అదురహో మీ సంకలనం

ఎందుకింత భ్రష్టు పట్టిపోయిందో మన మీడియా ; ఈ మధ్యే ఎవడో ఒక విట్టల్ అనే ఆయన దేశం లో సెక్యూలరిజానికి భంగం రాబోతోంది అంటూ చాంతాడంత అనాలిసిస్ రాసాడు ! మీ‌ అభిప్రాయం ఏమిటి ?

జిలేబి

అన్యగామి March 23, 2017 at 9:10 AM  

మంచి సంగతులు. అందరు తెలుసుకోవలసినవి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP