శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఉగాది నుండి హనుమజ్జయంతి రోజు పూర్ణాహుతి వరకు జరగనున్నపారాయణములతో హనుమత్ రక్షాయాగంలో మీరూ పాల్గొనండి.

>> Saturday, March 25, 2017

అనంతకాలప్రవాహంలో  భూమిపై కొన్ని సమయాలలో ప్రశాంతం గానూ,కొన్ని సమయాలు ఆందోళనకరంగానూ మరికొన్నిసమయాలు అత్యంత భయానకంగానూ ఉంటాయి.  గ్రహసంచార స్థితులవలన ఆయా పరిస్థితులు భూమిపై ఏర్పడుతుంటాయి.

  ప్రస్తుతం గ్రహసంచారస్థితులననుసరించి భూమిపై కొన్ని శుభసూచకములతోపాటు ,కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద చర్యలు,జాత్యహంకారధోరణులు ఇతరులపట్ల అనవసరమైన విద్వేషాల పెరుగుతూ ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా  విదేశాలలో మనవాళ్లు  భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
వ్యక్తిగతంగా  మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి తన స్వప్రయత్నమేగాక దైవాన్ని ఆశ్రయించి ఉండాలని చెప్పేది మనసిధ్ధాంత. ఇక మనం నివారించలేని ప్రమాదాన్ని భగవంతునికి శరణాగతి అవడంద్వారా దాటవచ్చు అనేది జగద్విఖితం.
ఈ  మార్గాన్ని నమ్మిన మేము . గత తొమ్మిది సంవత్సరాలుగా  "హనుమత్ రక్షాయాగం " అనే క్రతువును హనుమత్కృపవలన   నిర్విఘ్నంగా నిర్వహించుకోగలుగుతున్నాము.  ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఈ యాగంలో పాల్గొంటున్న దేశవిదేశాలలోని సాధకులకు ఆయన రక్షణ చేకూరి వారి వారి జీవితాలలో అనేక శుభాలు అనుగ్రహించబడ్డాయి.
స్వామి భక్తజన రక్షకుడు . తననాశ్రయించినవారి దుఃఖములనుతొలగించి,  శుభములను కలిగించుటగూర్చి ఆయన మహిమను గూర్చి చెప్ప సాహసించటం పిట్ట తన నోటితో సముద్రజలాలను కొలవాలని ప్రయత్నించటం లాంటిదే.
ఈసంవత్సరం తొమ్మిదవ ఆవృతిగా హనుమత్ రక్షాయాగం నిర్వహించబడుతున్నది. ఉగాది రోజున హనుమాన్ చాలీసా, పారాయణములు శ్రీరామనామలేఖనములు తదాంగములుగా ప్రారంభించబడుతున్నవి. కష్టములతో తల్లడిల్లుతున్నవారు,భీతిచెందుతున్నవారు,తమతమ కార్యసాధనకు స్వామి అనుగ్రహము కోరేవారందరూ  ఉగాదినుండి  హనుమజ్జయంతి వరకు సాగే ఈసాధనలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని తమజీవితాలలో ప్రత్యక్షంగా దర్శించుకొనవచ్చు.
ఇందుకుగాను    మీ గోత్రనామాలను పీఠమునకు పంపి   మీ ఇంటివద్దనే   నియమానుసరంగా పారాయణములు ప్రారంభించి  పూర్ణాహుతి సమయానికి మీ జపసంఖ్యను  పీఠమునకు తెలియపరచాలి. యాగంలో ప్రత్యక్షంగా పాల్గొనదలచేవారు కొద్దిరోజులు ముందుగా తెలియపరచాలి. రాలేనివారికోసము కూడా ఇక్కడ అర్చనాదికములు జరుపబడతాయి. వివరాలకోసం  క్రింద ఇవ్వబడిన పత్రికలను చూడండి. మీరూ మీతోటివారందరికీ తెలిపి అందరం స్వామి రక్షణకొరకై ప్రార్ధిద్దాం

మీగోత్రనామాలు పంపవలసిన చిరునామా
durgeswara@gmail.com
9948235641




0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP