శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

డొక్కా సీతమ్మగారు చేసిన తప్పేంటి ..? మదర్ తెరెస్సా గారు చేసిన ఒప్పేంటి ..??

>> Sunday, March 5, 2017

డొక్కా సీతమ్మగారు  చేసిన తప్పేంటి ..?
మదర్ తెరెస్సా గారు చేసిన ఒప్పేంటి ..??

మదర్ తెరిస :- ఈవిడడ గారు చిన్నపుడు 5 రూపాయలతో ఒక ముసలి వానికి వైద్యం చేయించారని     3వ తరగతి నుండి పదోవతరగతి వరకు ప్రతి సబ్జెక్టులో ఈవిడి గారి కోసం పాఠాలు వ్రాసి పరీక్షలు పెట్టి  ప్రచారం చేశారు కాబట్టి చచ్చినట్లు చదవాల్సి వచ్చింది.మా బతుకు తగలెయ్య..
ఊరు... వాడ.. పల్లె.. గ్రామం... ఇలా ప్రతిచోట ఏ విధముగా పెద్ద పెద్ద మిసనరీలు నిర్మించింది ..?? మీరు ఏమైనా ఆవిడికి డబ్బులు ఇచ్చారా..?? లేదే
దేశ ప్రభుత్వం ఏమైనా ఇచ్చింద..? లేదే
మరి  ఏ విధంగా ఈవిడి గారు ఆ ప్రత్యేక విమానాలలో  తిరిగారు ..?
 మెడలో "క్రాస్" ఉంది గా అది చూసి ఉచితంగా  ప్రయాణానికి అనుమతులు ఇచ్చి ఉంటారు. ప్రపంచ మీడియా ఈవిడికోసం చిత్రకరించిన సోది అంతా ఇంతా కాదు. ఈవిడిగారు చాలా మందిచనిపోతున్న వ్యక్తుల జబ్బులను నయం చేసింది కానీ ఒక్క సారి ఈ దేవతకు పెద్ద జబ్బు వస్తే దెబ్బకు హాస్పిటల్లో రెండు నెలలో ఉండి వచ్చింది. ఆ హాస్పిటల్ 5 నక్షత్రాల హోదా హాస్పిటల్ పాపం అంత పెద్ద హాస్పిటల్లో కూడా 5 రూపాయలలోపే ఖర్చుతో  వైద్యం చేయడం గమనార్హం  ఇది మన దేశంలో ఉన్నకుహన మేధావులు చెప్తున్న తీరు వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనం అలానే ఊకోడుతునే ఉంటాం ఎందుకంటే మన బుర్రలు  అలకించడానికి తప్ప ఆలోచించడానికి పనికిరాదు

డొక్కా సీతమ్మ గారు :- ఈ మహానుభావురాలి    కోసం ఏ పుస్తకంలో ఒక ఏ ఒక పాఠ్యాంశము తెలియజేయదు .ఎందుకని..?? ఒక్క సారి ఆలోచించండి
ఈవిడ ఏనాడూ ఒక విమానప్రయాణం చేయాలే, ఏనాడూ ఒక్కరి దగ్గర ఒక నయాపైస కూడా ఆశించలేదు, ఏనాడూ కూడా భోజనం పెట్టిన వ్యక్తులపై చేతులు వేస్తూ ప్రార్ధన పేరుతో మతమార్పులకు ప్రోత్సహించలేదు. పల్లె/గ్రామం తప్ప ఇంకేమి తెలియని అమయికురాలు, ఇంటికి వచ్చిన అతిధుల "మొఖం,కులం,మతం" చూసేది కాదు ఈవిడ చూపంతా వచ్చిన అతిధుల "కడుపుపైనే" వాళ్ళు ఏమైనాతిన్నారా  లేదా అంటూ వాల్లకడుపు నింపడమే ఇవిడ ఆశయం, డొక్కా సీతమ్మ గారికి ఒకప్పుడు చాల భయంకరమైన వ్యాధి వచ్చింది అప్పుడు ఆవిడ బంధువులు ఆమెను వైద్యంకోసం బతిమాలితే ఆ మహాతల్లి ఏమందో తెలుసా..? "నా దేహం రాలిపోయే సమయం వచ్చింది . ఇప్పుడు ఈ దేహం కోసం ఆ ధనం వ్రుధా   చేయరాదు ఆ డబ్బుతో నలుగురికి కడుపు నింపు" అంటూ చెప్పిన మహాసేవకురాలు
మరి డొక్కా సీతమ్మ గారు జీవిత చరిత్ర  ఎందుకు మన విద్యావ్యవస్థలో  చోటు సంపాదించలేకపోయింది...?
అంటే  మెడలో సిలువ వేసుకుంటేనే     .. ఆవిడా సేవకురాలు అవుతుందా.?
మన దేశంలో చాల మంది మేధావులు "మదర్ తెరిస పేరున కొన్ని వేల కొద్దీ అనాధ  ఆశ్రమాలు, ట్రస్ట్, స్కూల్స్, పౌన్డేసన్, లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏ ఒక్కడుకూడా "డొక్కా సీతమ్మ గారి" కోసం ఒక్క ట్రస్ట్ ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసాడా..? లేదు అలా చేయలేదు అందుకు ముఖ్యకారణం మన పాఠ్యాంశంలో డొక్కా సీతమ్మ  సేవ ఆవిడ జీవిత చరిత్రను తెలియజేయకపోవడమే. ఒక వేళా డొక్కా సీతమ్మ గారి  జీవితం  పాఠ్యాంశములో చేర్చడం మొదలెట్టితే ఇంక ఈ మదర్ తెరిస చాప్టర్ బంద్ అవుతుంది ఇది ముమ్మాటికి నేను చెప్పగలను
ఇప్పటికైనా రాజకీయ లబ్ది కోసం జీవిస్తున్న అమ్ముడుపోయిన రాజకీయనాయకులకు ఒక విజ్ఞప్తి. దయచేసి ఇప్పటికైనా భావిభారత పౌరులకు డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర కోసం తెలుసుకోడానికి ద్వారాలు తెరిచి పాఠ్యాంశముగా  ఆమె చేసిన త్యాగం గురించి వివరించండి
ఇప్పుడు చెప్పండి ఎవ్వరు గొప్పో..? కనీసం ఒక్క కలర్ ఫోటో కూడా లేదు డొక్కా సీతమ్మ గారిది ఈ గూగుల్ లో కానీ ఈ  మదర్ తెరిస ఫోటోలు అంతులేనన్ని  ఉంటై కావాలంటే మీరే చూసుకోండి.        [అంతర్జాలం నుండి ఒక ఆవేదన]

4 వ్యాఖ్యలు:

Zilebi March 5, 2017 at 4:35 AM  


తప్పే మీ లేదండి

డొక్కా వారు హైందవులు వారి కి దానం చెయ్యడ మన్నది ధర్మం

తెరెసా వారు క్రైస్తవులు సేవ అన్నది ప్రభువు దగ్గిరకి జనాలని చేర్చ డానికి మార్గం


జిలేబి

Unknown March 5, 2017 at 5:28 AM  

అయ్యా!

మీ బ్రతుకే అబధ్ధాలమయం అని తెలుసు. మీ వాలెంటైన్స్ డే పోస్టు నాకింకా గుర్తుంది. మీరీ వ్యాఖ్యను పబ్లిష్ చెయ్యరనికూడా తెలుసు. మీరీ (కం)పోస్టు రాసేముందు కనీసం గూగులించారా?



https://www.google.co.in/search?q=dokka+seetamma&client=firefox-b-ab&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwiWrruqu7_SAhXGkpQKHaSJAEYQ_AUICigD&biw=1360&bih=659

Unknown March 5, 2017 at 5:28 AM  

అయ్యా!

మీ బ్రతుకే అబధ్ధాలమయం అని తెలుసు. మీ వాలెంటైన్స్ డే పోస్టు నాకింకా గుర్తుంది. మీరీ వ్యాఖ్యను పబ్లిష్ చెయ్యరనికూడా తెలుసు. మీరీ (కం)పోస్టు రాసేముందు కనీసం గూగులించారా?

శ్యామలీయం March 5, 2017 at 8:26 AM  

డొక్కా సీతమ్మగారు తెలుగావిడ.
అది చాలు మనవాళ్ళకు పట్టకపోవటానికి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP