రావద్దంటున్నా వస్తున్న అతిథి. ఏంచేయాలి?
>> Friday, March 17, 2017
కొందరు వద్దంటూన్నా వస్తుంటారు. పరవాలేదు సర్దుకపోవచ్చు వాళ్లవల్ల ఇబ్బందిలేకుంటే . కానీ ఇంటిల్లపాదీ భయపడుతుంటే ఆతిథి రాకను అంగీకరించలేంకదా .
ప్రస్తుతం నాకొక సమస్య. ఈమధ్య అంటే పదిరోజులనుండి ఓ తాచుబాము మా పీఠం ఆవరణలో సంచరిస్తున్నది. పూలచెట్ల మధ్యలో ప్రహరీవెంబడి తిరుగుతున్నది. ముందుగా చిట్టి చూసి మొరుగుతూ నిలవేస్తున్నది . ఆపై రాజుగాడు చిట్టీ కలసి దాన్ని కవ్విస్తున్నాయి . బుసలు కొడుతూ పడగవిప్పి ఆడుతున్నది. నేను వెళ్ళటం వీటిని గదమటం . అది వెళ్ళిపోతున్నడి. చెట్లలోకి. నిన్న సాయంత్రం ఆఫీసులో కూర్చుని వర్క్ చేసుకుంటుండగా కింద రాజు ,చిట్టి అరుస్తున్నాయి. వంటగదినుండి మా అవిడ కుక్కలు అరుస్తున్నాయి చూడండి అని కేకవేసింది. నేను బయటకు వచ్చి చూసే సరికి తాచు పదగవిప్పి బుసలు కొడుతున్నది. చిట్టి రాజు దాన్ని కదలకుండా నిలేసి అరుస్తున్నాయి. ఫోటో తీసాను చూడండి నాకైతే దీన్ని చంపడం ఇష్టం లేదు. విషసర్పం .కాబట్టి ఇంట్లోవాళ్లకు భయం . .ఇలారాకు వెళ్లిపో ఎవరన్నా వస్తే నేనొద్దన్నా చంపేస్తారు అంటుండగా అది బాత్ రూం తలుపుగుండా దూరి అటువైపు గోడ ఎక్కి చెట్లలోకి దూకింది . ఏం చేయాలో తోచని సమస్య. నాకు భయంగానీ ,ఆందోళన కానీ లేవు. కాకుంటే వచ్చేవారికి భయం కదా ? ఇంతకు ముందుకూడా ఇలా లోపలి కొచ్చిన విషసర్పాలు ఎవరో ఒకరి చేతిలో మరణించాయిఇక రాకుంటే బాగుండు. దానికి ఆయుర్దాయం ఉంటే ఇకరాదనుకుంటాను. చూద్దాం
2 వ్యాఖ్యలు:
జూపార్కు వారికి తెలియజేస్తే?
దుర్గేశ్వర గారు,
వీళ్ళని కాంటాక్ట్ చెయ్యండి. పాముకి హాని లేకుండా పట్టి వేరే చోట వదిలిపెడతారు -
The Friends of Snakes Society along with its untiring fleet of volunteers serve the community 24/7. We understand that emergencies do not strike after a notice nor do they bite only at a favourable time or during the day; hence we are geared up with a dedicated rescue line to tend to your distress calls. Contact us using the following modes of communication.
You could contact us for
Rescues: +91-8374233366 (24/7 Dedicated line)
FOS Member - Rear
Awareness Programmes: +91-8374233377
Media Queries: +91-8374233388
You could also communicate with us via
Email @ info@friendsofsnakes.org
Post a Comment