శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అచంచల భక్తితో భగవద్దర్శనం

>> Saturday, September 10, 2016


S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cia
భగవంతుడు తనపై అచంచలమైన నమ్మకాన్ని, తనపై భక్తిని కలిగి ఉంటే చాలు వారిని, వారి యోగక్షేమాలను తానే చూస్తానని భగవద్గీతలో కంఠోపాఠంగా చెప్పాడు. చెప్పడం కాదు ఆయన ద్వాపరయుగంలో చేసి చూపాడు. నేటి కలియుగంలోను కృష్ణామృతాన్ని పొందిన భాగ్యవంతులు లెక్కకుమించే ఉన్నారు. ఆ భాగ్యాన్ని అందరూ పొందాలంటే ఒక్కటే మార్గం. కృష్ణకథలను నిరంతరమూ వినడం. కృష్ణతత్వాన్ని ఆకళింపుచేసుకోవడం. కృష్ణుని మార్గాన్ని అనుసరించడం. కృష్ణా అని పిలిచినంతనే పలికే యదునందుని మనసార ప్రేమించడం. ఇవి ఉంటే చాలు కృష్ణుని పొందడం కష్టమేమి కాదని కృష్ణకథలు మనకు చెబుతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామానికి ముందే దుర్యోదనుడు, అర్జునుడు కృష్ణ సహాయం కోరి వచ్చారు. ఎవరి మనసులో ఏముందో తెలుసుకొనే కృష్ణుడు దాన్ని బహిర్గతం చేయాలని ముందుగా ధర్మరాజు తమ్ముడిని చూస్తాడు. దుర్యోదనుడు తాను ముందుగా నీవద్దకు వచ్చానని అంటే నేను చూసింది ముందు అర్జునుడినే కదా అంటాడు కృష్ణయ్య. అంటే భగవంతుని చూపు మనపై పడితే చాలు కాని మనం ఎన్ని మార్లు గుడికి వెళ్లాం. ఎన్ని పూవులతో పూజించాం. ఎన్ని పట్టువస్త్రాలను భగవంతుని అర్పించాం అంటే కాదు. భగవంతుడు వాటిని స్వీకరించాడా అన్నదే ముఖ్యం. దీన్ని చెప్పేదే శ్రీకృష్ణతులాభారం. సత్యభామా మిడిసిపాటుతో నేను కృష్ణుని మనసు దోచినదాన్ని, నాకున్న సంపద మరివ్వరికీ లేదు. నేను మాత్రమే అందగత్తెను కనుక కృష్ణుడు నాకు దాసోహం అంటున్నాడు అని గర్వాంధకారంలో ఉండిపోయి నారదుడు చెప్పిన వ్రతాన్ని చేయడానికి ముందుకు వచ్చింది.
వ్రతభాగంలో కృష్ణుణ్ణి దానం ఇచ్చివేసినా తనకున్న అపార సంపదలతో కొనుకోవచ్చు అనుకొందా పిచ్చితల్లి. కాని కృష్ణుడు పిచ్చివాడు కాదుగదా. అందుకే ఆ తల్లి పిచ్చి గర్వాన్ని అణచడానికి లోకకల్యాణ కారుడైన నారదుణ్ణి ఎంచుకున్నాడు. సత్య చేతవ్రతం చేయించాడు. కృష్ణుడిని నారదునికి దానం ఇప్పించాడా కృష్ణయ్య. ‘‘ ఇక నీ ఇష్టం. ఈ నారదుని చేతిలో నేను కీలుబొమ్మగా ఆడిస్తావా లేక నన్ను ఈ నారదుని చేతినుంచి విడిపించి నీవాడిని చేసుకొంటావా ’’అని వెర్రి నాగన్నలాగా, పసిపాపడిలాగా మొహం పెట్టి అతి అమాయకత్వంతో సత్యవైపు చూచాడా గోపీమానస చోరుడు.
సత్య మరేంభయంలేదు. నేను నిన్ను క్షణంలో విడిపించేస్తాను. అని గర్వంతో కృష్ణుడికి సైగ చేసింది. లోపల నవ్వుకునే ఆ గోపాలబాలుడు తదుపరి కార్యక్రమాన్ని కానిమ్ము అన్నాడు. భలే చౌక బేరం రండిరండి ధనవంతులారా, భాగ్యవంతులారా రండి ఈ నందనందుడిని, దేవకీసుతుడిని, యశోదముద్దుబిడ్డడిని కొనరండి అనీ నారదుడు మహతితో మహారమ్యంగా చెప్పసాగాడు. సత్య విసుగుపడి ‘‘ఆగాగు... ఈ కృష్ణయ్యను మరెవ్వరూ కొనడానికి వీలులేదు. నేను మాత్రమే కొనుక్కుంటాను అని తన దగ్గర నున్న సంపదనంతా తెచ్చి త్రాసులో పోసింది. వీసమంతమైనా కదలలేదు ఆ మాయాత్రాసు. దాంతో బెంబేలు పడి తన వంటి మీదనున్న నగలను జోడించింది ఆ పిచ్చితల్లి. కాని కృష్ణయ్య ఏ సంపద సమానం కాకపోయే సరికి తనకు జ్ఞానోదయం అయ్యింది. అయ్యో అజ్ఞానంతో ఎంత పని చేశానో, నా పతిదేవుణ్ణి నా మానసచోరుణ్ణి, నా కృష్ణుని పరుల పాలు చేశానో అని ఎంతోవాపోయింది. తన సవితియైన రుక్మిణీ దేవి దగ్గర కు పోయి తాను చేసిన నేరాన్ని చెప్పింది. అంతే రుక్మిణీ చిరునవ్వు ఆ కృష్ణుడు భోగభాగ్యాలకు వశం అవుతాడా చెల్లీ. ఒక్క భక్త్భివానికే కట్టుబడుతాడు కాని అంటూ ఆ తల్లి ఒక్క తులసీ దళాన్ని తెచ్చి ‘‘కృష్ణా ! అనాథపతే! హే జగద్రక్షకా మమ్ము కాపాడు. మా అజ్ఞానాన్ని దూరం చేయి ’’అని వేడుకొనగానే ఆ మాయాత్రాసు కదిలింది. తులసీదళానికే కృష్ణుని భారం సమానమైంది. ఓ ఎంత అద్భుతం. నా అజ్ఞానాన్ని క్షమించి చెంత చేర్చుకో ప్రభూ అంటూ సత్యపాద నమస్కారం చేసింది. అటువంటి ఆ భక్త ప్రియుణ్ణి అధికార దాహమున్న దుర్యోధనుడు నేను ముందుగా చూసానంటే కృష్ణుడు సరే అంటాడా? ఎంత అజ్ఞానం? ఎంత గర్వాంధకారం? అర్జునుడు కేవలం నా పక్షంలో నీవుంటే చాలు. నాకు రథసారథిగా ఉండి నన్ను నడిపిస్తే చాలు అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు ఎంత పిచ్చివాడీ అర్జునుడు. ఇక గెలవడం మా వంతే అని అజ్ఞానంతో గాలిమేడలు కట్టుకొన్నాడు. కాని జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణయ్య మన జీవిత పగ్గాలు పట్టుకున్నాడన్న నమ్మకమే చాలు కదా మన ధర్మం పథంలో నడవడానికి. ఆ కృష్ణుని నమ్ముకుంటే చాలు కదా మన దినచర్య సాఫీగా జరగడానికి.
మతిలేని దుర్యోధనుడు అపార సైనావాహిని తన సొంతం చేయమని కృష్ణుణ్ణి అడిగాడు. అడిగిన వానికి అడిగినట్లు ఇచ్చే కృష్ణుడు బాగా ఆలోచించుకుని అడుగు అని అన్నా పట్టించుకోకుండా తనకు ఆ సేనాసంద్రమే చాలన్నాడు. భక్తి సంద్రంలోమునగని వానికి అందలి లోతు, తీపి ఎలా తెలుస్తుంది. అంతే దుర్యోధనుడు పవనునితో అతిగా స్నేహం చేస్తూ అందాల మేడల్లో వసిస్తూ ముం దుకు పోయాడు. యుద్ధం రానేవచ్చింది. ఆయుధం పట్టనని భీష్మించిన కృష్ణుని కృప ఎలాంటిదో లోకానికి వెల్లడి చేయాలనుకొన్నాడు కృష్ణ్భక్తుడు భీష్ముడు. సంగ్రామంలో అర్జునుని మిక్కిలిగా బాధించాడు. శరీరమంతా తన బాణపుములుకు గుచ్చాడు. ఇక అర్జునునికి ప్రాణాపాయం తప్పదేమో అన్నట్లుగా భీష్ముడు ఉద్యమించాడు. ఎంత తన సారథ్యాన్ని ఎన్ని మెళుకులతో నడిపించినా భీష్ముని ధాటికి కుంతీ తనయుడు విలవిలలాడాడు. కృష్ణా కృష్ణా అని పదే పదే మనసున స్మరించసాగాడు. ఇక ఆగలేక పోయాడుకృష్ణయ్య. అంతే రథచక్రం పట్టుకొని కుప్పించి ఎగిసాడు ఆ కృష్ణుడు. జరగబోయే దాన్ని చూస్తూ ‘‘ఆహా! కృష్ణా! ఎంత దయామూర్తివి! ఎంతటి భక్తరక్షకుడు. ఆడిన మాటనే కాదని ఆయుధం పట్టి నన్ను మట్టుపెట్టడానికి ఉరికి ఉరికి వస్తావా! నీ చేతిలో మరణం కన్నా నాకు కావల్సింది ఏముంది అని భీష్ముడు మ్రాన్పడి మనసున వందన సమర్పణ చేస్తుండగా అర్జునుడు ఆశ్చర్యం నుంచి తేరుకొని ‘‘బావా! కృష్ణా! ఆగాగు. చంపేది చంపించేది నీవే. చచ్చేవాడు చంపేవాడు కూడా నీవే! కృష్ణా కానీ ఈలోకంలో నీవు నాకు కేవలం రథ సారథి గా ఉంటానని మాటిచ్చావు. ఆయుధం పట్టనని ప్రతిన బూనావు. కృష్ణా ఆ ఆయుధాన్ని నా చేత ఆడించు. నేను భీష్ముణ్ణి పడవేసాననే కీర్తిని నాకు కలిగించు కృష్ణా! అని పరిపరివిధాల కృష్ణుణ్ణి అర్జునుడు వేడుకున్నాడు. కోపమే లేని కృష్ణుడు కోపాన్ని తగ్గించుకున్నాడు. జరుగుతున్న విషయాన్ని గ్రహించినట్లుగా రథచక్రాన్ని కిందకు దింపాడు. ఇది కదా భక్తపరాధీనత అంటే. భగవంతుణ్ణి మనసారా కోరుకుంటే చాలు. మనసారా స్మరిస్తేచాలు ఆ వేల్పు ను వేడుకుంటే చాలు. ఆ పరమాత్మ దయామృతం పొందడానికి మరో మార్గమెందుకు. అందుకే అందరం భజిద్దాం రండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!

from andhrabhoomi

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP