శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గుజరాత్ లో దేవాలయాలను ఎలా తొలగించారో ఒక్కసారి చూడండి

>> Tuesday, July 5, 2016

గుజరాత్ లో  దేవాలయాలను ఎలా  తొలగించారో  ఒక్కసారి చూడండి
......అది ఏలాగంటే ముందుగా ప్రజలను, ధర్మకర్తలను ఒకచోట కూర్చోబెట్టి వొప్పించారు ... తరువాత ఆ ప్రదేశానికి దగ్గరలొ ప్రజలకు అందుబాటులొ ఉండే ప్రాంతాలలొ మరలా దేవాలయాలను కట్టించి భక్తులు ఇబ్బందిపడకుండా సకల సదుపాయలు ఏర్పాటుచేశారు ..... తరువాత విగ్రహం తొలగించేటప్పుడు ఆగమశాస్త్రం ప్రకారం ఒక విగ్రహం ప్రతిష్టించేటప్పుడు ఏంత శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారో  అంతే శాస్త్రోక్తంగా విగ్రహాలను తొలగించారు...తొలగించిన విగ్రహాలను భారీ ఊరేగింపుగా తీసుకువెళ్ళి కొత్తగా నిర్మించిన ఆలయాలలొ ఆగమశాస్త్రం ప్రకారం అంతేవైభవంగా పునఃప్రతిష్ఠించారు ..... అంతేకాకుండా తొలగించిన ప్రతి దేవాలయానికి ధూప,దీప,నైవేద్యాలకు భారీస్థాయిలొ డబ్బు చెల్లించారు... ఒక్క దేవాలయాలనే కాదు అడ్డువచ్చిన మసీదులను, చర్చిలను, గురుద్వారాలను కూడా అందరినీ వొప్పించి గౌరవంగా తొలగించారు.
మీలాగ ఆలయ ధర్మకర్తలను బెదిరించి, కనీసం విగ్రహాలు కూడా తొలగించకుండా రాత్రిపూట దొంగతనంగా ఆలయాలను కూల్చివేయలేదు....విగ్రహాలను కాళ్ళతో తొక్కించలేదు ......, గోశాలను  పడగొట్టలేదు..

 ఏమిరా మీ   దౌర్భాగ్యం  దరిద్రాన్ని  కొనితెచ్చుఁ కుంటున్నారు  దైవదోషానికి  పాల్పడి

1 వ్యాఖ్యలు:

Sharma July 5, 2016 at 9:20 PM  

హరి గారూ ,

శుభోదయం .

దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సిందేమిటంటే , ఏ పని చేయాల్సి వచ్చినా , చేయాల్సినా " పధ్ధతి అవసరం . ఆ పధ్ధతిని పాటిస్తే ఎవ్వరూ ఎదురు మాట్లాడలేరు " అని .

ఏ పని చేయదలచుకొన్నా హడావుడి , తొందర కాదు , క్రమమైన ఆలోచన , ఆచరణ అని తెలుసుకొన్న నాడు ( తెలుసుకొన్న వాడు )ఆ పనికి అన్ని అడ్డంకులు తొలగిపోయి చక్కగా పూర్తి చేయగలగటం జరుగుతుంది .

ఇది అక్షర సత్యం , ఆచరణ యోగ్యం కూడాను . ఈ జగంలో అత్యవసరమైనది .

శర్మ జి ఎస్

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP