శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అహోబిల నారసింహుని దివ్యదర్శనానికై బయలుదేరుతున్న "రామదండు" .. మీకు కూడా ఆహ్వానం

>> Saturday, December 13, 2014


శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నుండి  రామదండు కార్యకర్తలు అహోబిల లక్ష్మీనారసింహుని  దర్శనమునకై బయలుదేరుతున్నది. భక్తప్రహ్లాదుని గాచిన భ క్తజనవరదుడగు స్వామిని సేవించుకుని  నవనారసింహక్షేత్రాలను దర్శించుకుని  అక్కడ  అనుష్ఠానములు,జప ,పారాయణాదులు సంకీర్తన చేసుకొనుటకై ఈ కార్యక్రమం  సంకల్పించబడినది.   మాతో పాటు స్వామిని సేవించు కొనుటకై ఇంకాఎవరన్నా రాదలుచుకున్నట్లైతే మాకు ఫోన్ ద్వారా  ముందుగానే తెలియపరచాలి.
ఇక అక్కడ  సామూహికంగానే అందరంకూడా దొరికిన  వసతి,భోజనాదులతో సర్దుకోవాలి. ఎగువ అహోబిళం,కారంజ,యోగ ,క్షేత్రవట నారసిమ్హుల  వరకు వాహనాలలో వెళ్ళినా   జ్వాలా,వారాహ,మాలోల,పావన ,భార్గవ నరసింహులను ఉగ్రస్థంభం దర్శించుకునేందుకు మాత్రం బాగా నడవాలి అడవిలో కొండలపై ..  అందుకు సిద్ధపడిరావాలి. వసతిభోజనాదిసౌకర్యాలపై దృష్టిపెట్టకుండా స్వామి అనుగ్రహం కోసం తపిస్తూ రావాలి ఈ  యాత్రకు.  అలావచ్చే వారికి అమ్మ చెంచులక్ష్మీ దేవి అన్నీ సమకూరుస్తుంది. బిడ్డలు ఆకలి తో ఉంటే ఆతల్లిచూస్తూ ఉండలేదు కదా!


ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్నవారు తో  వచ్చి ఇబ్బందిపడవద్దని మనవి. మీ ఆధార్,లేదా రేషన్ కార్డ్ లాంటి  గుర్తింపు పత్రాల జిరాక్స్ తీసుకుని రావాలి. అలాగే దుప్పట్లు కుడా మరచిపోకండి. 
 కార్యక్రమములు
-----------------

డిసెంబర్   24--25--26

ఇరవై నాలుగున క్షేత్రదర్శనములు  ,ఇరవై అయిదున  మార్గశిర  లక్ష్మీవారపూజలముగింపు లో భాగంగా ఎగువ నారసింహక్షేత్రంలో   లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు,ప్రసాదాలు హారతులు నివేదించటం.ఎగువన అడవిలో ఉన్న  మాలోల [మా.. అంటే   లక్ష్మీదేవి,   లోల  .. అంటే  వశమైనవాడు  ]నరసింహక్షేత్రంలో రాత్రి  ధ్యానాదులు.
ఇరవై ఆరున  క్షేత్రదర్శనములు ..తిరుగు ప్రయాణం .

ఇది  మేము అనుకున్న ప్రణాళిక. ఇక అక్కడ కెళ్లాక   అమ్మా, అయ్యల   అనుగ్రహం ఎలాఉంటుందో దాన్ని బట్టి కార్యక్రమాలుంటాయి.


అక్కడ కు వచ్చేవారు. ఆటవిడుపుకోసం విహారయాత్రకు వచ్చినట్లుగా ప్రవర్తించరాదు.
ప్లాస్టిక్ కవర్లు,వస్తువులను  తేవద్దు, వాటిని అడవిలో పడవేయవద్దు.
అడవి అమ్మ ఒడిలాంటిది. అందులో ఆనందాన్ని అనుభూతిలోకి తెచ్చుకుని ఆ పరమాత్మతో అనుసంధానం కావాలి
లగేజీ చాలా తక్కువగా తెచ్చుకోవాలి. .

జైశ్రీరాంdurgeswara@gmail.com
9948235641                            లలో సంపరదించగలరు.

1 వ్యాఖ్యలు:

dokka srinivasu December 18, 2014 at 4:00 AM  

Mee blog chaalaa bagundi sir. Mee blog choosi anandam vesindi. Mee blogu dwaara mana hindu mathamu yokka goppathanamunu chaalaa vivaramugaa theliyachesthunnanduku chaalaa santhosham.

Sir recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

Sir please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your comment in english language.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP